ప్రధాన మంత్రి కార్యాలయం
సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన ను ప్రకటించిన ప్రధాన మంత్రి
Posted On:
13 FEB 2024 4:53PM by PIB Hyderabad
ఉచిత విద్యుత్తు కోసం ఉద్దేశించినటువంటి రూఫ్ టాప్ సోలర్ స్కీమ్ - పిఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రకటించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘దీర్ఘకాలం పాటు మన్నిక ను కలిగివుండేటటువంటి అభివృద్ధి మరియు ప్రజల శ్రేయం కోసం, మేం ‘పిఎమ్ సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన’ ను ప్రారంభిస్తున్నాం. 75,000 కోట్ల రూపాయల కు పైచిలుకు పెట్టుబడి తో కూడినటువంటి ఈ ప్రాజెక్టు ప్రతి నెలా 300 యూనిట్ ల వరకు ఉచిత విద్యుత్తు ను సమకూర్చడం ద్వారా ఒక కోటి కుటుంబాల జీవనం లో వెలుగుల ను నింపాలి అనే లక్ష్యాన్ని కలిగివుంది.’’
‘‘గణనీయమైన సబ్సిడీల ను నేరు గా ప్రజల బ్యాంకు ఖాతాల లో పంపిణీ చేయడం మొదలుకొని అత్యధిక రాయితీ తో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజల పై ఎటువంటి వ్యయ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పూచీ పడుతుంది. స్టేక్ హోల్డర్స్ అందరి ని ఒక జాతీయ ఆన్‌లైన్ పోర్టల్ కు కలపడం జరుగుతుంది. ఫలితం గా ఎక్కువ సౌకర్యం లభిస్తుంది.’’
‘‘క్షేత్ర స్థాయి లో ఈ పథకం ప్రజాదరణ కు పాత్రం అయ్యేటట్లు చూడడం కోసం, పట్టణ స్థానిక సంస్థల కు మరియు పంచాయతీల కు వాటి న్యాయాధికార పరిధుల లో ఇళ్ల పైకప్పు భాగాల లో సోలర్ సిస్టమ్స్ ను పెంపొందింప చేసేటట్టు గా ప్రోత్సహించడం జరుగుతుంది. దీనితో పాటే, ఈ పథకం తో ప్రజల కు ఆదాయం అధికం అవుతుంది, విద్యుత్తు బిల్లు తగ్గుతుంది మరి అలాగే ఉపాధి అవకాశాలు లభిస్తాయి.’’
‘‘రండి, సౌర విద్యుత్తు మరియు దీర్ఘకాలిక పురోగతి.. ఈ రెంటి ని పెంపొందింపచేసుకొందాం. నివాస గృహాల వినియోగదారులు అందరి కి, ప్రత్యేకించి యువజనుల కు నేను చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే - వారు https://pmsuryaghar.gov.in/ లో దరఖాస్తు పెట్టుకొని ‘పిఎమ్ - సూర్య ఘర్: ముఫ్త్ బిజ్‌లీ యోజన’ ను బలపరచాలి అనేదే.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 2005654)
Visitor Counter : 457
Read this release in:
Kannada
,
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Malayalam