సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్‌తో భేటీ అయిన మిజోరాం ముఖ్యమంత్రి
Posted On:
11 FEB 2024 5:49PM by PIB Hyderabad
ప్రస్తుతం దేశ రాజధానిలో పర్యటిస్తున్న మిజోరాం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దూహావ్మా, ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని, రాష్ట్రంలో సివిల్ సర్వెంట్లు ఇతర అధికారుల నియామకం సహా రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల గురించి చర్చించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారని, ఈ ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలలోనూ సమాన అభివృద్ధిని నిర్ధారించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారని డా. జితేంద్ర సింగ్ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాలలో 65సార్లు పర్యటించారని, ఆయనకు ముందు ఉన్న ప్రధానులందరూ చేసిన పర్యటనల మొత్తం కన్నా బహుశ ఇది ఎక్కువే ఉండవచ్చని అన్నారు. మిజోరాం చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ, ప్రధానమంత్రి మోడీ అప్పుడప్పుడు రాష్ట్రంలో పర్యటించి, అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను, కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇజ్రాయెలీ సహకారంతో మోడీ ప్రభుత్వం మిజోరాంలో మొత్తం ఉపఖండంలో మొదటి విశిష్టకేంద్రాలలో ఒకటైన ప్రత్యేకమైన నిమ్మజాతి పళ్ళ పార్క్‌ని ఏర్పాటు చేసిన విషయాన్ని డా. జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. ఇది ఉద్యానవనాలను పెంపొందించి, ఈ ప్రాంతంలో ఆదాయం, ఉపాధి కల్పిస్తుందని ఆయన అన్నారు.
సివిల్ సర్వెంట్ల నియామకాలకు బాధ్యుత వహించే డిఒపిటికి ఇన్ఛార్జిగా ఉన్న డా. జితేంద్ర సింగ్‌ను రాష్ట్రంలో సివిల్ సర్వెంట్లను, అధికారుల నియామకం గురించి శ్రీ లాల్‌దూహావ్మా విజ్క్షప్తి చేశారు. ఈ విషయమైన అధికారిక సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రికి సూచిస్తూ, సాధ్యతను పరిగణించి, తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీతో సమావేశాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చూపిన ఆసక్తికి, కేటాయించిన సమయానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక, ఎప్పటికప్పుడు మిజోరాం రాష్ట్రానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందచేస్తూ ఉండాల్సిందిగా ప్రధానమంత్రి మోదీ అన్నట్టు ఆయన చెప్పారు.
***
(Release ID: 2005108)
Visitor Counter : 87