అణుశక్తి విభాగం
2031-32 నాటి ప్రస్తుత స్థాపిత అణు విద్యుత్ సామర్ధ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22800 మెగావాట్లకు పెంచనున్నట్టు తెలిపిన కేంద్ర మంత్రి డా. జితేందర్ సింగ్
Posted On:
07 FEB 2024 2:30PM by PIB Hyderabad
2031-32 నాటి ప్రస్తుత స్థాపిత అణు విద్యుత్ సామర్ధ్యాన్ని 7480 మెగావాట్ల నుంచి 22800 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు బుధవారం వెల్లడించింది.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన వనరులను ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు విధానపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు.
దేశంలో మొత్తం విద్యుదుత్పాదనలో అణు ఇంధన వాటాను పెంచేందుకు, ప్రభుత్వం దిగువన పేర్కొన్న చర్యలు తీసుకుని, శీఘ్ర రీతిలో పది దేశీయ 700 మెగావాట్ల ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ( పిహెచ్ డబ్ల్యుఆర్ - పీడన భారజల రియాక్టర్ల) ఏర్పాటు కోసం సహా పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక కేటాయింపులు, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ (సిఎల్ ఎన్ డి) చట్టం అమలుకోసం అణు విద్యుత్ బారతీయ అణు బీమా పూల్ (ఐఎన్ఐపి), , అణు విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ కంపెనీల వీలుగా, ఇంధన సరఫరా సహా అణు ఇంధన సహకారం కోసం విదేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు అణు ఇంధన చట్టంలో సవరణలు చేపడుతున్నట్టు డా. జితేందర్ సింగ్ వివరించారు.
***
.
(Release ID: 2003760)
Visitor Counter : 289