సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్‌సిల కోసం కోచింగ్ కేంద్రాలు
Posted On:
06 FEB 2024 2:35PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఎస్‌సిలు, ఒబిసిలకు ప్రభుత్వ/ ప్రైవేటు రంగంలో తగిన ఉద్యోగాలు పొందేందుకు / లేదా ప్రసిద్ధ సాంకేతిక, వృత్తిపరమైన ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం కోసం ఉచిత కోచింగ్ పథకాన్ని అమలు చేస్తోంది.
2023-24 నుంచి, సెంట్రల్ యూనివర్సిటీలలో స్థాపించిన డాక్టర్ అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (డిఎసిఇ) ద్వారా ఈ పథకాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డిఎఎఫ్) నిర్వహిస్తోంది. ఈ పథకం కింద నిధులను నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డిబిటి- ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) ద్వారా విడుదల చేస్తుంది. ప్రస్తుతం, 17 సెంట్రల్ యూనివర్సిటీలు కోచింగ్ ఇచ్చేందుకు డా. అంబేడ్కర్ ఫౌండేషన్‌తో (డిఎఎఫ్) అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇతర సెంట్రల్ యూనివర్సిటీలు డిఎఎఫ్‌తో ఎంఒయుపై సంతకం చేయడం ద్వారా భవిష్యత్‌లో కోచింగ్ ఇవ్వడాన్ని ప్రారంభించవచ్చు.
పథక మార్గదర్శకాల ప్రకారం సివిల్ సర్వీసెస్ పరీక్షలకే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎఫ్‌సిఎస్ పోర్టల్ పై coaching.dosje.gov.in అన్న లింక్‌లోనూ, https://socialjustice.gov.in/schemes/30 లింక్ ద్వారాను తెలుసుకోవచ్చు.
ఈ సమాచారాన్ని మంగళవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ ఎ.నారాయణ స్వామి లిఖితపూర్వక సమాధానం ద్వారా ఇచ్చారు.
***
(Release ID: 2003382)
Visitor Counter : 82