ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

దేశంలో సెమీకండక్టర్ చిప్ డిజైన్ ఆవరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచేందుకు సెమికాన్ఇండియా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీ ఎల్ ఐ) పథకం కింద మరో రెండు ఫ్యూచర్‌డిజైన్ స్టార్టప్ కంపెనీలు

Posted On: 05 FEB 2024 6:55PM by PIB Hyderabad

"ఢిల్లీలోని ఐ ఐ ఐ టీ లో డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌లాబ్స్ సమ్మిట్ 2024 ను ప్రారంభించిన సందర్భంగా ఎలక్ట్రానిక్స్ & ఐటి, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, జల్ శక్తి సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  సెమికాన్ ఇండియా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్‌ఐ) పథకం కింద రెండు ఫ్యూచర్‌డిజైన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లెస్ కంపెనీలపై ప్రకటన చేసారు.  డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌లాబ్స్ సమ్మిట్ 2024 లో ఆటోమోటివ్, కంప్యూట్, కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ఐఓటీ మరియు డిజైన్ & ఇన్నోవేషన్ వంటి 6 రంగాలలో ఫ్యూచర్‌లాబ్‌లను అమలు చేయడానికి పరిశ్రమతో 20 అవగాహన ఒప్పందాలను ప్రకటించింది.

 

డీ ఎల్ ఐ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ప్రకటించిన ఈ రెండు కర్ణాటకకు చెందిన ఫ్యూచర్‌డిజైన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లెస్ కంపెనీలు కమ్యూనికేషన్ మరియు మెడ్-టెక్ రంగాలకు చిప్‌సెట్‌లు మరియు పరిష్కారాలను అందజేస్తున్నాయి.

 

సాంఖ్య ల్యాబ్స్ వ్యవస్థాపకుడు పరాగ్ నాయక్ మాట్లాడుతూ “సాంఖ్య ల్యాబ్స్ ఒక వైర్‌లెస్ కమ్యూనికేషన్ మరియు సెమీకండక్టర్ సొల్యూషన్స్ కంపెనీ, ప్రస్తుత మరియు భవిష్యత్తు కోసం తదుపరి తరం కమ్యూనికేషన్ సొల్యూషన్‌ల పూర్తి స్పెక్ట్రమ్‌ను రూపొందిస్తోంది. ఇందులో 5జీ ఎన్ ఆర్, డైరెక్ట్ టు మొబైల్ (డీ 2 ఎం) బ్రాడ్‌కాస్ట్, రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, ఐ ఓ టీ అప్లికేషన్‌ల కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ మోడెమ్‌లు మరియు మల్టీ-స్టాండర్డ్ డీ టీ వీ మాడ్యులేటర్‌లు మరియు డీమోడ్యులేటర్‌లతో సహా బ్రాడ్‌బ్యాండ్, శాటిలైట్ మరియు బ్రాడ్‌కాస్ట్ అప్లికేషన్‌ల కోసం ఉత్పత్తులు మరియు పరిష్కారాలు ఉన్నాయి" అని అన్నారు 

 

సెన్సెసెమి టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు విజయ్ ముక్తమత్  మాట్లాడుతూ  “డీ ఎల్ ఐ పథకంలో భాగంగా, సెన్సెసెమి ఐ ఓ ఎం టీ మరియు ఐ ఓ టీ పరికరాల కోసం ఎం సి యూ మరియు వైర్‌లెస్ ఐ పీ ని ఏ ఐ ఇన్ఫరెన్సింగ్ తో కూడిన అతి-తక్కువ పవర్ అనలాగ్ ఫ్రంట్ ఎండ్‌ ఎస్ ఓ సీ ని అభివృద్ధి చేస్తుంది. అది  స్మార్ట్ వేరబుల్స్, మెడ్-టెక్ సెక్టార్ మరియు ఇతర కనెక్ట్ చేయబడిన పరికరాలైన ప్రతిదానికీ కనెక్ట్ చేయబడిన ఎస్ ఓ సీ ని అందించడం ద్వారా భారతదేశం యొక్క సెమీకండక్టర్ సామర్థ్యాలను పెంచడం సెన్సెసెమి లక్ష్యం" అని అన్నారు.

 

సెమికాన్ఇండియా డీ ఎల్ ఐ పథకం కింద సీ-డాక్ వద్ద ఇంతకుముందు స్థాపించబడ్డ చిప్ఇన్ సెంటర్  గ్లోబల్ కంపెనీల నుండి అత్యాధునిక చిప్ డిజైన్ టూల్స్ తో  క్రింది మద్దతును ప్రకటించింది.

 

విద్యా సంస్థలకు మద్దతు:

సినాప్సిస్  ' దేశవ్యాప్త విద్యాసంస్థలకు'  విద్యాసంస్థల కోసం ఈ డీ ఏ సాధనాలు, '150 విద్యాసంస్థలకు' కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ మరియు '120 విద్యాసంస్థలకు' సిమెన్స్-ఈ డీ ఏ & ఎన్సిస్ మద్దతు  ఇస్తోంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 100+ విద్యాసంస్థలలో వేలాది మంది పరిశోధకులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ సెమీకండక్టర్ చిప్‌లను రూపొందించడానికి చిప్ఇన్ సెంటర్ నుండి ఈ సాధనాలను ఉపయోగిస్తున్నారు.

 క్సీలింక్స్ నుండి 100 విద్యాసంస్థల వరకు ఎఫ్ పీ జీ ఏ  హార్డ్‌వేర్ బోర్డులు.

ఎస్ సి ఎల్ ఫౌండ్రీ & ఓవర్సీస్ ఫౌండరీలలో తమ డిజైన్‌లను రూపొందించడానికి అకాడెమియా & స్టార్ట్-అప్‌లకు టేప్‌అవుట్ మద్దతు.

 

స్టార్టప్‌లకు మద్దతు: 

స్టార్టప్‌ల కోసం సినాప్సిస్, కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ మరియు సిమెన్స్-ఇడిఎ నుండి వారి సెమీకండక్టర్ చిప్‌లను రూపొందించడానికి ఈ డీ ఏ సాధనాలు.

ఈ గ్లోబల్ కంపెనీలతో పాటు, కాడ్/ ఈ డీ ఏ సొల్యూషన్‌ల కోసం కీసైట్ టెక్నాలజీస్ & సిల్వాకో మరియు స్టార్టప్ మెంటర్‌షిప్ & సపోర్ట్ కోసం క్వాల్కం & ఎన్ ఎక్స్ పీ సెమీకండ్‌క్యూటర్‌ల వంటి ఇతర ప్రముఖ డిజైన్ & సొల్యూషన్ కంపెనీలతో సన్నిహితంగా ఉండటానికి చిప్ఇన్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం 125కి పైగా విద్యా సంస్థలు మరియు 15 స్టార్టప్‌లతో నిమగ్నమై ఉన్న చిప్ఇన్, దేశవ్యాప్తంగా చిప్ డిజైనర్‌లకు వన్-స్టాప్ సెంటర్‌గా మారాలని భావిస్తోంది.

 

సీ-డాక్ సమన్వయంతో డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌ల్యాబ్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ (ఈ ఎస్ డీ ఎం) రంగం అందించిన ట్రిలియన్-డాలర్ అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ విలువ వ్యవస్థ ను పెంచడానికి, దేశీయ ఆర్ & డీ ని బలోపేతం చేయడానికి మరియు దేశంలో ఐ పీ లు, ప్రమాణాలు మరియు తదుపరి తరం ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్‌ల అభివృద్ధికి సహకారఆవరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది.

 

సెమీకాన్ఇండియా ఫ్యూచర్‌డిజైన్ మరియు ఫ్యూచర్‌స్కిల్స్‌తో కలిపి మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌లాబ్స్ చొరవ #IndiaTechadeని నిర్వచిస్తుంది మరియు భారతదేశాన్ని #ElectronicsProductNation మరియు సెమీకండక్టర్ ఉత్పత్తుల దేశం గా మారుస్తుంది".

 

***



(Release ID: 2002957) Visitor Counter : 78


Read this release in: English , Hindi , Kannada