ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్@2047 ఆవిష్కరణ, శాస్త్ర, సాంకేతికత నేపథ్యాంశంలో ముందడుగు, 'స్మార్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ సిస్టమ్' సాంకేతికత పరిశ్రమకు బదిలీ
Posted On:
05 FEB 2024 12:47PM by PIB Hyderabad
భారత 'ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలోని 'సమీర్' అభివృద్ధి చేసిన 'స్మార్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ సిస్టమ్' (సేఫ్టీ) సాంకేతికతను ధాన్యం నిర్వహణ వ్యవస్థల తయారీ & సరఫరా కోసం 'పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్'కు బదిలీ చేశారు. ఢిల్లీ ట్రిపుల్ ఐటీలో జరిగిన "డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌లాబ్స్ సమ్మిట్ 2024" ప్రారంభ కార్యక్రమంలో సాంకేతికత బదిలీ జరిగింది. ధాన్యం సంచుల లోడింగ్ & అన్‌లోడింగ్, ధాన్యం బరువు & తేమ కొలవడం, రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికతతో ధాన్యంలో తేమను తొలగించడం వంటివి ఈ వ్యవస్థ నిర్వహిస్తుంది. దాదాపు ఒక లారీ లోడు (సుమారు 28 టన్నుల బరువు) ధాన్యాన్ని 40 నిమిషాల్లో ఈ వ్యవస్థ నిర్వహించగలదు.
మైటీ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో సాంకేతికత బదిలీ పత్రాల మార్పిడి జరిగింది. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉన్నతాధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
'స్మార్ట్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజీ సిస్టమ్' ఆవిష్కరణ
|
'సేఫ్టీ సిస్టమ్' సాంకేతికత బదిలీ అసలు నమూనాను పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అమిత్ మహాజన్‌కు అందిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
|
****
(Release ID: 2002956)
Visitor Counter : 105