పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డిజి యాత్ర ద్వారా ప్రయాణీకులను వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పిఐఐ) డేటా కేంద్ర నిల్వ ఉండదు
విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత ప్రయాణీకుల వ్యక్తిగత డేటా కంప్యూటర్ నుంచి తొలగింపు
Posted On:
05 FEB 2024 2:45PM by PIB Hyderabad
డిజియాత్ర సెంట్రల్ ఇకోసిస్టమ్ (డివైసిఇ- డిజియాత్ర కేంద్ర పర్యావరణ వ్యవస్థ) నమూనా/ డిఫాల్ట్ ను గోప్యత అన్న ప్రాథమిక సిద్ధాంతాలపై నిర్మించడం జరిగింది. ఇందులో ప్రయాణీకులను వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పిఐఐ) డేటా కేంద్ర నిల్వ లేదు.
డేటా గోప్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా డిజీ యాత్ర ప్రక్రియలు సిఇఆర్‌టి- అంతర్గతంగా నియమించిన ఏజెన్సీల ఆడిట్ లు, ధృవీకరణలకు లోబడి ఉంటాయి.
డిజి యాత్ర కేంద్ర పర్యావరణ వ్యవస్థను డిజి యాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఇది కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 8 ప్రకారం రూపొందించిన లాభాపేక్ష లేని కంపెనీ కనుక సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి రాదు.
డిజి యాత్ర మార్గదర్శకాలను డిజిసిఎ (డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) 18.04.2022న ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్క్యులర్ (ఎఐసి) నెం. 09/2022 ద్వారా జారీ చేయడం జరిగింది. ఈ డిజి యాత్ర మార్గదర్శకాలు వికేంద్రీకృత మొబైల్ వాలెట్ ఆధారిత గుర్తింపు నిర్వహణ వేదిక కోసం ఉద్దేశించినవి. ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారం ప్రయాణికుడి మొబైల్ వాలెట్‌లో నిల్వచేయడం జరుగుతుంది. ప్రయాణీకుడు బయలుదేరే విమానాశ్రయంతో వాటిని గుప్తీకరించిన రీతిలో పంచుకోవడం జరుగుతుంది. ఈ డేటాను విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి తొలగిస్తారు. డిజి యాత్ర అమలులో డేటా భద్రత సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. అంతేకాకుండా, డిజి యాత్ర ప్రక్రియలు డేటా గోప్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా సిఇఆర్‌టి - అంతర్గతంగా నియమించిన ఏజెన్సీలచే ఆడిట్లు, ధృవీకరణకు లోబడి ఉంటాయి.
రాజ్యసభలో సోమవారం అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్(డా.) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని వెల్లడించారు.
***
(Release ID: 2002841)
Visitor Counter : 86