ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎయిమ్స్ జోధ్‌పూర్ 4వ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
ఎయిమ్స్ బిలాస్‌పూర్, రిషీకేశ్, గోరఖ్‌పూర్, నాగ్‌పూర్, భుబనేశ్వర్, దేవ్‌గఢ్‌లలో 24 ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రారంభించి, ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 68 ఆరోగ్య సేవలకేంద్రాలకు శంకుస్థాపన చేసిన డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
మన ఆసుపత్రులు వైద్యానికి మందిరాలు, వైద్యులుగా వాటిలో సేవలందించడం మీ బాధ్యత ః డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
ఈ వ్యాధులన్నింటిలో తక్షణ వైద్య సేవలు తగిన సమయంలో అందితే, అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను కాపాడావచ్చుః డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
Posted On:
03 FEB 2024 4:15PM by PIB Hyderabad
అన్ని వ్యాధులకూ తగిన సమయంలో కీలక సంరక్షణ సేవలు అందుబాటులో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను రక్షించవచ్చు. బిలాస్‌పూర్, రిషీకేశ్, గోరఖ్‌పూర్, నాగ్‌పూర్, భుబనేశ్వర్, దేవ్‌గఢ్ ఎయిమ్స్‌ల వ్యాప్తంగా 24 ఆరోగ్య సదుపాయాలను ప్రారంభించి, జోధ్‌పూర్ ఎయిమ్స్ కోసం 68 ఆరోగ్య సేవలకు పునాదిరాయి వేసి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిమ్స్ 4 స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయా పై వ్యాఖ్యలు చేశారు.
ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర జలశక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ ఖిమ్సార్, రాజ్యసభ ఎంపీ శ్రీ రాజేంద్ర గెహ్లాట్ ఉన్నారు.
డాక్టర్ మనసుఖ్ మాండవీయ, శ్రీ భజన్‌లాల్ శర్మ ఉమ్మడిగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 5 ఉప - ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేసి, రెసిడెన్షియల్ హౌజింగ్ తో కూడిన 2 ఆసుపత్రులు, నూతనంగా నిర్మించిన ఎంఎన్‌సి యూనిట్లు, నూతనంగా నిర్మించిన 3 ఎంఎన్‌సి యూనిట్ల ఆసుపత్రులు, నూతనంగా ప్రసూతి గదులను నిర్మించిన 2 ఆసుపత్రులు, 4 జన ఔషధి కేంద్రాలు, నూతనంగా నిర్మించిన 3 బిపిహెచ్‌యు గదులు, 42 సబ్- హెల్త్ సెంటర్లు, 7 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2 ఆసుపత్రులు సహా 15వ విత్త కమిషన్ కింద సివిల్ విభాగంలో 63 జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన 63 ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ కింద నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కేంద్ర - రాష్ట్ర భాగస్వామ్య ప్రాతిపదికన జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీని అప్‌గ్రేడ్ చేసి దేశానికి అంకితం చేస్తారు. ఇది కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, మెడికల్ జెంరెంటాలజీ అనే 5 విభాగాలను నిర్వహిస్తుంది.
ప్రారంభించిన ఆరోగ్య మౌలిక సదుపాయాల కేంద్రాల వివరాలు దిగువన ఇవ్వడం జరిగింది-
భుబనేశ్వర్ ఎయిమ్స్‌లో ధర్మశాల భవనం- ధర్మశాలలో 24 క్యాబిన్లు, వేర్వేరు పురుష, మహిళ బ్లాకులు, క్యాంటీన్ వార్డెన్ గది తదితరాలతో కూడిన 468 పడకలు ( 2 పడకలు, 4 పడకల గదులు) ఉంటాయి. ఈ భవనం పేద రోగుల సహాయకులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది. భువనేశ్వర్‌లోని నూతన ట్రామా సెంటర్‌లో కన్సల్టేషన్ గదులు, ప్రొసీజర్ గది, ఎంఒటి, ఐసియు వార్డులు, సెమినార్ హాల్, కేబిన్‌లు, ఫ్యాకల్టీ గదులు తదితరాలు ఉంటాయి.
కేన్సర్ రోగులకు చికిత్సనందించేందుకు భుబనేశ్వర్‌లోని డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్‌ను ఉపయోగిస్తారు.
ఎయిమ్స్ బిలాస్‌పూర్ లో కార్డియాక్ కాథ్ లాబ్ ప్రారంభం - ఈ ప్రయోగశాలలోని సౌకర్యాలు గుండె జబ్బులు ఉన్న రోగులకు, గుండె పోటుతో బాధపడుతున్న రోగులకు అధిక నాణ్యత గల గుండె సంరక్షణ, చికిత్సను అందించడంలో రోగులకు సహాయపడతాయి. వీరిలో చాలామందికి యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ/ స్టంటింగ్ వంటి ప్రాణాలను కాపాడే అత్యవసర విధానాలను అందించడంలో తోడ్పడుతుంది.
ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లో లాండ్రీ సేవలు.
దేవగఢ్ దేవీపూర్ ఎయిమ్స్‌లో ఎంఆర్ఐ సౌకర్యం - రోగనిర్ధారణ సేవలను మెరుగుపరిచేందుకు 3 టెస్లా మెషీన్లు ఉపయోగపడతాయి.
దేవ్‌గఢ్, దేవీపూర్ ఎయిమ్స్‌లో బాలికల హాస్టల్ - ఈ హాస్టల్‌లో ఒక్కొక్క అంతస్తులో 12 గదులతో మొత్తం 18 అంతస్థులు ఉంటాయి.
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో నైట్ షెల్టర్ అన్నది పేద రోగుల బంధువులు ఆసుపత్రి ఆవరణలో తమ సన్నిహితులకు దగ్గరగా ఉండేందుకు సరసమైన ధరలో సౌకర్యవంతంగా ఉండే సౌకర్యాన్ని అందిస్తుంది.
ఎయిమ్స్ గోరఖ్‌పూర్ లో షాపింగ్ కాంప్లెక్స్- మౌలిక సేవలతో పాటు నిత్యావసర, వాడుక వస్తువులు అందుబాటులో ఉండడంతో ఆవరణలో ఉండే స్థానికులు అత్యంత లాభపడతారు.
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లోని ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రం నాణ్యత కలిగిన ఔషధాలు అంటే ఖరీదైన మందులే అనే భావనను ఎదుర్కొనేందుకు జెనరిక్ మందుల గురించి శిక్షణ, ప్రచారం ద్వారా అవగాహనను సృష్టిస్తుంది.
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లోని ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం నాణ్యత కలిగిన ఔషధాలు అంటే ఖరీదైన మందులే అనే భావనను ఎదుర్కొనేందుకు జెనరిక్ మందుల గురించి శిక్షణ, ప్రచారం ద్వారా అవగాహనను సృష్టిస్తుంది.
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లోని మోడల్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫర్ నియోనాటాలజీ (పుట్టిన శిశువుల విషయంలో తక్షణ జోక్యంతో చికిత్సకు కేంద్రం) అన్నది ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అద్భుత సదుపాయం.
తల్లిపాలు తాగలేని పిల్లల కోసం పౌష్టికాహారాన్ని అందించేందుకు ఎయిమ్స్ జోధ్‌పూర్‌లోని సముగ్ర చనుబాల నిర్వహణ కేంద్రం పని చేస్తుంది.
ఎయిమ్స్ జోద్‌పూర్‌లోని పిఇటి- సిటి+ ఎస్‌పిఇసిటి- సిటి (PET – CT + SPECT – CT) మెదడులో రుగ్మతలు, గుండె సమస్యలు, ఎముకలకు సంబంధించిన సమస్యల రోగ నిర్ధారణ చేసి, పర్యావేక్షించే సదుపాయాన్ని కల్పిస్తుంది.
ఎయిమ్స్ జోద్‌పూర్, బిఎస్ఎల్- 3 ప్రయోగశాల (విఆర్‌డిఎల్) సాధారణ వైరల్ వ్యాధులకు సెరలాజికల్, మాలిక్యులార్ రోగనిర్ధారణ * పరిశోధనను కొనసాగించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది.
ఎయిమ్స్ జోద్‌పూర్, విద్యార్ధుల హాస్టల్
ఎయిమ్స్ జోద్‌పూర్, విద్యార్ధుల యాక్టివిటీ కేంద్రం
ఎయిమ్స్ జోద్‌పూర్, టైప్ V ఫ్యాకల్టీ ఆవాసాలు
ఎయిమ్స్ జోద్‌పూర్, సెంట్రల్ యానిమల్ హౌజ్
ఎయిమ్స్ నాగపూర్ సిఎస్ఎస్‌టి సేవ శస్త్రచికిత్సలకు పరికరాలను అందిస్తుంది
ఎయిమ్స్ నాగపూర్, నైపుణ్యాల ప్రయోగశాల విద్యార్ధుల అభ్యాసాలను, సులభతరం చేసేందుకు, మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
ఎయిమ్స్ రిషీకేశ్‌లో ట్రామా ఐసియు అత్యవసర ప్రొసీజర్లకు ఉత్తమ చికిత్సను అందిస్తుంది.
ఎయిమ్స్ రిషీకేశ్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ భారతదేశంలోని విస్తారమైన ప్రజారోగ్య వ్యవస్థ కోసం మధ్య స్థర నిర్వహకులలో అసమతుల్యతను తగ్గిస్తుంది.
ప్రతిభ ప్రదర్శించిన విద్యార్ధుల విజయాలను ప్రశంసిస్తూ, వారికి డాక్టర్ మాండవీయ స్వర్ణ పతకాలను అందించారు. ఈ సందర్భంగా మెడికల్, నర్సింగ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాల పంపిణీ చేశారు.
ప్రతి పౌరునికి ఆరోగ్య సౌకర్యాలు భరించదగిన స్థాయిలో అందుబాటులో ఉండే సౌలభ్యం కలిగి, ఒకే నాణ్యతా ప్రమాణాలతో అందరికీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందాలన్న ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆయుష్మాన్ భారత్ ను పునరుద్ఘాటిస్తూ, మన ఆసుపత్రులు ఔషధాలకు ఆలయాలు, వైద్యునిగా వాటిని సేవించడం మీ బాధ్యత అని పేర్కొంటూ, వైద్య విద్యా విస్తరణను, మెరుగుదలను డాక్టర్ మాండవ్యా ప్రశంసించారు.
మరింత వివరణిస్తూ, పేదలకు ఉచిత చికిత్స అందించే 16 కొత్త ఎయిమ్స్ సంస్థలతో పాటు వ్యాధుల నివారణం కోసం ప్రివెంటివ్ స్క్రీనింగ్, జీవనశైలి విద్య, సంక్షేమ అంశాలతో కూడిన సంపూర్ణ పద్ధతిని అనుసరించే 1,60,00కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్థాపన వంటి ఆరోగ్య సదుపాయాలలో గణనీయమైన వృద్ధిని డాక్టర్ మాండవీయ ఉదహరించారు. ఆరోగ్య ఛత్రాన్ని విస్తరిస్తూ, ఇసంజీవనీ, టెలిమానస్ వంటి మాధ్యమాల ద్వారా వైద్యులకు అనుసంధానత, సంప్రదింపులను అందించడం ద్వారా ఆరోగ్య సేవలు చివరి మైలుకు చేరుకునేలా భారత్ డిజిటల్ మాధ్యమాన్ని ప్రభావితం చేసి, రోగులకు అపారమైన సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది.
సికిల్‌సెల్ వ్యాధి నిర్మూలన కార్యక్రమం, టిబి రహిత భారతదేశ ప్రచారాల వంటి చొరవలు ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలను సాధించే దిశలో దేశంలోని అనేకమంది టిబి రోగులను ని-క్షయ్ మిత్రాలు దత్తత తీసుకోవడం సమలేఖనంగా ఉన్నాయని డాక్టర్ మాండవీయ నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతను ప్రశంసిస్తూ, ఆరోగ్య సేవల సౌలభ్యం, లభ్యతను పెంపొందించడం ద్వారా అందరి ప్రయోజనాల కోసం అందించిన మార్పుల పరిమాణాన్ని నొక్కి చెప్పడమే కాక, ఆరోగ్యం పట్ల సానుకూల వైఖరిని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రశంసించారు.
ఆరోగ్య చొరవల ప్రభావాన్ని ప్రశంసిస్తూ, భారతదేశంలో చోటు చేసుకుంటున్న పరివర్తన మొత్తం ప్రపంచంపై అర్థవంతమైన ప్రభావాన్ని కలిగి ఉందని, మన దేశానికి, ప్రపంచానికి ఉత్తమ స్థాయిలో సేవలందించేందుకు మన వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు.
ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుభ్రా సింగ్, ఎయిమ్స్ జోధ్‌పూర్ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఎయిమ్స్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు, డీన్, ఫ్యాకల్టీ, గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్ధులు హాజరయ్యారు.
***
(Release ID: 2002465)
Visitor Counter : 114