కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం రంగంలోని స్టార్టప్ లు/ కంపెనీలకు బెంగళూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన డాట్ సాంకేతిక విభాగం "టిఇసి"
టెలికాం పరికరాల తప్పనిసరి టెస్టింగ్ సర్టిఫికేషన్, వాలంటరీ టెస్టింగ్, సర్టిఫికేషన్ లపై దృష్టి
టైప్ అప్రూవల్స్, ఇంటర్ఫేస్ అప్రూవల్, సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్, టెక్నాలజీ అప్రూవల్ టిఇసి ద్వారా ల్యాబ్ హోదా మొదలైనవి ఇందులో ఉన్నాయి.
టిఇసి స్వచ్ఛంద ధృవీకరణ పథకం కింద గత సంవత్సరం సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్ (సిఒఎ), టెక్నాలజీ అప్రూవల్ ఆన్ లైన్ మాడ్యూల్స్ ప్రారంభించిన డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్
సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచడం, ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించడం దీని ఉద్దేశం
Posted On:
03 FEB 2024 3:42PM by PIB Hyderabad
టెలికమ్యూనికేషన్ రంగంలోని స్టార్టప్ లు/ కంపెనీలకు టెలికం పరికరాల తప్పనిసరి టెస్టింగ్, ధృవీకరణ (ఎంటిసిటిఇ), టైప్ అప్రూవల్స్, ఇంటర్ ఫేస్ అప్రూవల్, సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్, టెక్నాలజీ అప్రూవల్, టెక్నాలజీ అప్రూవల్, ల్యాబ్ హోదా వంటి స్వచ్చంద టెస్టింగ్, సర్టిఫికేషన్ ల పై టెలీకమ్యూనికేషన్స్ శాఖ (డాట్) సాంకేతిక విభాగం టిఇసి 2024 ఫిబ్రవరి 02 న బెంగళూరు ఐటిఐ కాంప్లెక్స్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో డాట్ ఎల్ ఎస్ ఏ అధికారులు/ ఐ టి ఐ, సి డి ఒ టి లతో పాటు స్టార్టప్ లు/ఎం ఎస్ ఎం ఇ లకు చెందిన సుమారు 70 మంది పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడానికి ఎంతో సహాయపడే వివిధ టిఇసి పథకాల గురించి స్టార్టప్ లు ఎంఎస్ఎమ్ఇ లలో అవగాహన కల్పించడానికి ఇది ఒక చొరవ. ఈ టెస్టింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియలు, ఇంకా స్టార్టప్ లు, ఎంఎస్ ఎం ఇ ల కోసం చేపట్టిన కాస్ట్ సర్టిఫికేషన్, ఎస్ సి ఎస్ సర్టిఫికేషన్ వంటి ఇతర కొత్త కార్యక్రమాలను గురించి సదస్సులో పాల్గొన్న వారికి వివరించారు.
ఎన్ మురళీ కృష్ణ డి డి జి, ఆర్ టి ఇ సి, బెంగళూరు అధ్యక్షతన ఐటీఐ సహకారంతో టి ఇ సి/డాట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పి కె పాండా, డైరెక్టర్ టి ఇ సి; సునీల్ కుమార్, డైరెక్టర్ టెక్నాలజీ, డాట్; ఎల్ ఎస్ ఎ అధికారులు, శ్రీమతి లత, ఎ జి ఎం, శ్రీమతి అల్లీరాణి, ఐటీఐ డి జి ఎం తదితరులు కూడా హాజరై స్టార్టప్ లు, ఎంఎస్ఎంఇ లకు ఐ టి ఐ లో ఉన్న వివిధ సౌకర్యాల సమాచారాన్ని అందించారు. డాక్టర్ ప్రశాంత్ డిడిజి సిఎ మాట్లాడుతూ, సర్వీస్ ప్లాట్ ఫామ్ గా టెస్టు పై టిఇసి చొరవలు , రిమోట్ భాగస్వామ్యం ద్వారా ఐపిఆర్, ఎస్ఇపి ఇ ఎస్ జి ప్రాముఖ్యత ను వివరించారు.
డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ (డిసిసి) గత ఏడాది డిసెంబర్ 29 న టిఇసి స్వచ్ఛంద ధృవీకరణ పథకం కింద సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్ (సిఒఎ) , టెక్నాలజీ అప్రూవల్ ఆన్ లైన్ మాడ్యూల్స్ ను ప్రారంభించింది. వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం, ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా సి డి ఒ టి ఈ మాడ్యూల్స్ ను రూపొందించింది. టైప్/ఇంటర్ఫేస్ అప్రూవల్ కోసం ఆన్-లైన్ మాడ్యూల్స్ గతంలో 07.07.2023 నుండి అమలులోకి వచ్చాయి. టెలికాం, సంబంధిత ఐసిటి రంగంలో స్టార్టప్ లు, ఎంఎస్ఎమ్ఇ లకు ప్రోత్సాహకరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించే టెస్టింగ్ , సర్టిఫికేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దీనిని ఒక ముఖ్యమైన అడుగు గా గుర్తించారు. స్టార్టప్ లు, ఎంఎస్ఎంఇ లు తమ ఉత్పత్తుల విశ్వసనీయత కోసం టెలికాం రంగానికి సంబంధించిన తమ ఉత్పత్తులకు ఈ సర్టిఫికెట్లను తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఫలితంగా ఇప్పుడు టైప్ అప్రూవల్ సర్టిఫికేట్, ఇంటర్ ఫేస్ అప్రూవల్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్ (సీఓఏ), టెక్నాలజీ అప్రూవల్ సర్టిఫికేట్ సహా వాలంటరీ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ కింద అన్ని రకాల సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 02, 2024 న, టిఇసి మరో 37 ఉత్పత్తులను సరళీకృత సర్టిఫికేషన్ పథకం కిందకు తీసుకువచ్చింది, తద్వారా సర్టిఫికేషన్ కోసం తీసుకునే సమయాన్ని ఎనిమిది వారాల నుండి రెండు వారాలకు తగ్గించింది. మీడియా గేట్ వే, ఐపీ సెక్యూరిటీ ఎక్విప్ మెంట్, ఐపీ టెర్మినల్స్, ఆప్టికల్ ఫైబర్ లేదా కేబుల్, ట్రాన్స్ మిషన్ టెర్మినల్ ఎక్విప్ మెంట్ మొదలైనవి ఈ ఉత్పత్తుల్లో ఉన్నాయి. జి సి ఎస్ , ఎస్ సి ఎస్ కేటగిరీతో సంబంధం లేకుండా ఎం టి సి టి ఇ కింద సమర్పించే తక్షణ అవసరాల (ఇ ఆర్ ) ఆధారిత దరఖాస్తులకు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫీజును మాత్రమే టి ఇ వసూలు చేస్తుంది. మూల్యాంకన రుసుమును పూర్తిగా మాఫీ చేశారు. ఇది ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారు (ఒఇఎం) కట్లేదా దరఖాస్తుదారులకు భారీ ఉపశమనం, ఎందుకంటే ఇది దరఖాస్తు రుసుమును 80 శాతానికి పైగా తగ్గిస్తుంది, తద్వారా కట్టుబాటు భారాన్ని మరింత తగ్గిస్తుంది.
ప్రస్తుతం, 59 టెలికాం, నెట్ వర్కింగ్ ఉత్పత్తులను ఎంటిసిటిఇ కింద నోటిఫై చేశారు.
***
(Release ID: 2002449)
Visitor Counter : 107