రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ దళాల్లో మహిళల పాత్ర
Posted On:
02 FEB 2024 3:37PM by PIB Hyderabad
సాయుధ దళాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం, త్రివిధ దళాలు తీసుకున్న చర్యలు ఇవి:
(1) మహిళా అధికార్లకు శాశ్వత కమిషన్
- ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మీ డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సేవలతో పాటు 12 సాయుధ & సేవల్లో మహిళా అధికార్లకు శాశ్వత కమిషన్ ప్రారంభమైంది.
- మహిళా అధికార్లను భారత నౌకాదళ యుద్ధ నౌకల్లో, ప్రత్యేక నావల్ ఎయిర్ ఆపరేషన్ (ఎన్‌ఏవో) అధికార్లుగా కూడా నియమిస్తున్నారు.
- అన్ని పోరాట విభాగాల్లో మహిళా అధికార్లను చేర్చుకునేందుకు ఐఏఎఫ్ 2015లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పథకాన్ని 2022లో శాశ్వత పథకంగా క్రమబద్ధీకరించారు.
(2) నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళా క్యాడెట్లు
నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళా అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మహిళా క్యాడెట్ల మొదటి, రెండు, మూడు, నాలుగు బ్యాచ్‌లకు వరుసగా 2022 జులై, 2023 జనవరి, 2023 జులై, 2024 జనవరిలో ఎన్‌డీఏలో శిక్షణ ప్రారంభమైంది. మహిళా క్యాడెట్ల కోసం అవసరమైన అన్ని నిర్వహణ, శిక్షణ, విధాన మార్పులను ఆ సంస్థ ప్రారంభిస్తోంది.
(3) కమాండ్ నియామకాలు
మహిళా అధికార్లకు కల్నల్ ర్యాంక్‌కు పదోన్నతి కల్పిస్తున్నారు. అర్హతలు సాధించడంలో వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగ పురోగతిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు.
(4) త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా మహిళల ప్రవేశం కూడా ప్రారంభమైంది.
రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2001981)