యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
చెన్నైలో కేఐవైజీ 2023 విజేతలకు ట్రోఫీ అందజేసిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా
Posted On:
31 JAN 2024 8:27PM by PIB Hyderabad
బుధవారం చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ముగింపు కార్యక్రమంలో విజేతలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్రోఫీలను అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడిన శ్రీ ఠాకూర్ యువత శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి, వారి ప్రతిభను వెలికి తీయడానికి ప్రధానమంత్రి ఆశించిన ఖేలో ఇండియా గేమ్స్ కు రూపకల్పన చేశారని అన్నారు. యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
" యువతకు ప్రధాని నిరంతరం సహకారం అందిస్తున్నారు.రామ మందిర ప్రతిష్ట కు ముందు చేపట్టిన 11 రోజుల అనుస్థాన్ (స్వీయ తపస్సు) సమయంలో తమిళనాడు లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి, అదే సమయంలో యువజన కార్యక్రమాల కోసం నాసిక్ ను సందర్శించడం ద్వారా ప్రధాని యువతను ప్రోత్సహించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, , తర్వాత అథ్లెట్ల తో ప్రధాని స్వయంగా మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించారు" అని శ్రీ ఠాకూర్ తెలిపారు.
మహారాష్ట్ర మొత్తం 158 పతకాలతో (57 స్వర్ణాలు, 48 రజతాలు, 53 కాంస్యాలు) అగ్ర స్థానంలో నిలిచింది. 98 పతకాలు (38 స్వర్ణాలు, 21 రజతాలు, 39 కాంస్యాలు) తో తమిళనాడు ద్వితీయ స్థానం , 103 పతకాలు (35 స్వర్ణాలు, 22 రజతాలు, 46 కాంస్యాలు) సాధించి హర్యానా 3వ స్థానంలో నిలిచాయి.
ఈ క్రీడల్లో అథ్లెట్లు, టెక్నికల్ అధికారులు, వాలంటీర్లు సహా మొత్తం 7234 మంది పాల్గొన్నారు.
ప్రతి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తో దేశంలో క్రీడల స్థాయి పెరిగిందని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4454 మంది యువ అథ్లెట్లు 26 పోటీ క్రీడల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రతి అథ్లెటిక్ ఉత్సాహం , అచంచలమైన క్రీడా స్ఫూర్తితో పోరాడారని ఆయన అన్నారు. . 2307 మంది పురుష అథ్లెట్లు, 2147 మంది మహిళా అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొని పోటీ పడ్డారు.
ప్రపంచంలోనే భారత్ తదుపరి స్పోర్ట్స్ సూపర్ పవర్ గా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశిస్తున్నారని తెలిపిన శ్రీ ఠాకూర్ దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
ఈ గేమ్స్ లో మొత్తం 30 మీట్ రికార్డులు, నేషనల్ యూత్ రికార్డులు నమోదు అయ్యాయి. అథ్లెటిక్స్ లో 8, వెయిట్ లిఫ్టింగ్ లో 22 రికార్డులు నమోదయ్యాయి. రు. హరియాణాకు చెందిన అథ్లెట్లు 7 రికార్డులు సృష్టించారు. . మహారాష్ట్రకు చెందిన అథ్లెట్లు 6 రికార్డులు నెలకొల్పారు.
హర్యానాకు చెందిన సంజన 75 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 5 వ్యక్తిగత రికార్డులు నమోదు చేసింది. తమిళనాడుకు చెందిన కీర్తన 81 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 35 వ్యక్తిగత రికార్డులు నమోదు చేసింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఆర్తి తత్ గుని 3 వ్యక్తిగత రికార్డులు నమోదు చేసింది.
తెలంగాణకు చెందిన స్విమ్మర్ వ్రిత్తీ అగర్వాల్ 200 మీటర్ల బటర్ ఫ్లై, 1500 మీటర్ల ఫ్రీస్టైల్, 800 మీటర్ల ఫ్రీస్టైల్, 400 మీటర్ల ఫ్రీస్టైల్, 200 మీటర్ల ఫ్రీస్టైల్ మొత్తం 5 బంగారు పతకాలు సాధించి క్రీడల్లో అత్యుతమ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపు పొందింది.
సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అథ్లెట్లు జాతీయ పోటీల్లో పోటీ పడడం ఖేలో ఇండియా గేమ్స్ లో అత్యంత ఆకర్షణీయమైన అంశాల్లో ఒకటి . 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అస్సాంకు చెందిన పంచమి సోనోవాల్ మూడు జాతీయ యూత్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆమె అస్సాంలో టీ అమ్మే వ్యక్తి కుమార్తె.
దేశంలో కొన్ని చిన్న పట్టణాల్లో మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్న శ్రీ ఠాకూర్ ఇకపై ఈ ప్రాంతాల్లో సాయ్ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బీహార్ కు చెందిన దుర్గా సింగ్ 1500 మీటర్ల పరుగు పందెం రికార్డును బద్దలు కొట్టింది. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో మారుమూల గ్రామమైన బెల్వా ఠాకూరాయ్ లోని పొలాల చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశాల్లో ఆమె పరిగెత్తేది. తక్కువ క్రీడా నేపథ్యం ఉన్న ప్రాంతంలో గోధుమ రైతు అయిన దుర్గ తండ్రి శంభు శరణ్ సింగ్ ఆమెను ప్రోత్సహించారు.
మారుమూల ఒడిశా గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన వెయిట్ లిఫ్టర్ జ్యోష్న సబర్ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఒక చిన్న రైతు తండ్రి , గృహిణిగా ఉన్న తల్లి ప్రోత్సాహంతో 15 సంవత్సరాల జ్యోష్న భారతదేశపు ప్రముఖ జూనియర్ వెయిట్ లిఫ్టర్లలో ఒకరిగా ఎదిగింది. గతేడాది అల్బేనియాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన జ్యోష్న 40 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించే క్రమంలో జాతీయ స్నాచ్ రికార్డును బద్దలు కొట్టింది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో 23 మంది ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్చరీలో అదితి గోపీచంద్ స్వామి, వెయిట్ లిఫ్టింగ్ లో ఎల్ ధనుష్ లాంటి క్రీడాకారులు పాల్గొన్నారు.గత ఏడాది జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో అదితి ఒక స్వర్ణం సహా రెండు పతకాలు సాధించింది. , తమిళనాడుకు చెందిన ధనుష్ గత ఏడాది అల్బేనియాలోని డ్యూరెస్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ ఛాంపియన్ చిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు.
గత 13 రోజులుగా తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయం సాధించడం పట్ల శ్రీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. యువత ప్రతిభకు, అంకితభావానికి, అచంచల స్ఫూర్తికి ఈ క్రీడలు నిదర్శనం. అథ్లెటిక్ పరాక్రమం, క్రీడాస్ఫూర్తి, స్నేహశీలతకు అద్దం పట్టే విధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి అని మంత్రి పేర్కొన్నారు.
బుధవారం జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ముగింపు కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు (సెంట్రల్ చెన్నై) శ్రీ దయానిధి మారన్, తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి మంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2001157)
Visitor Counter : 77