ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనవరిలో జీఎస్‌టీ కింద రూ.1.72 లక్షల కోట్లు వసూలు


జనవరిలో 10.4% వృద్ధి నమోదు చేసిన జీఎస్‌టీ వసూళ్లు

2023-24 ఆర్థిక సంవత్సరంలో 3వ సారి 1.70 లక్షల కోట్లకు మించి పన్ను వసూళ్లు

1,72,129 కోట్ల రూపాయలు వసూలు కావడం ఇదే అత్యధికం.

Posted On: 31 JAN 2024 7:21PM by PIB Hyderabad

2024 జనవరి నెలలో (31.01.2024 సాయంత్రం 05:00 గంటల వరకు)  రూ .1,72,129 కోట్లు జీఎస్‌టీగా వసూలు అయ్యింది. 2023 జనవరి  లో వసూలు అయిన న రూ .155,922 కోట్ల ఆదాయం తో పోలిస్తే 2024 జనవరిలో జీఎస్‌టీ వసూలు  10.4%  వృద్ధిని నమోదు చేశాయి. 

రూ.1.70 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వసూళ్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ అత్యధిక నెలవారీ వసూళ్లు కావడం గమనార్హం. ఐజీఎస్టీ వసూళ్ల నుంచి  సీ జీఎస్టీకి రూ.43,552 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.37,257 కోట్లు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. 

ఏప్రిల్ 2023-జనవరి 2024 కాలంలో స్థూల  జీఎస్‌టీ   వసూళ్లు 11.6% వృద్ధిని సాధించాయి (31.01.2024 సాయంత్రం 05:00 గంటల వరకు), అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో (ఏప్రిల్ 2022-2023) వసూలు చేసిన రూ .14.96 లక్షల కోట్లతో పోలిస్తే రూ .16.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

 

***


(Release ID: 2001152) Visitor Counter : 206