వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్‌ లో భాగంగా పీయూష్ గోయల్ 40 యునికార్న్‌లతో రౌండ్ టేబుల్‌ సమావేశం లో పాల్గొన్నారు.


పెట్టుబడులు, నెట్‌వర్కింగ్ మరియు మెంటార్‌షిప్‌లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌ల కోసం డీ పీ ఐ ఐ టీ ‘స్టార్టప్‌శాల’ ఫ్లాగ్‌షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది

స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ‘హౌ టు స్టార్ట్ అప్’ వెబ్‌నార్లను ఏర్పాటు చేశారు.

Posted On: 30 JAN 2024 9:28AM by PIB Hyderabad

స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా కేంద్ర వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ యూనికార్న్ రౌండ్ టేబుల్‌కు అధ్యక్షత వహించారు. మన దేశంలో ఎక్కువ యునికార్న్స్ ఉన్నాయని పాల్గొన్న 40 యునికార్న్‌లు వారి అనుభవం నుండి వారి అభ్యాసాలు వారి పెరుగుదలకు దోహదపడిన అంశాలు  భారతదేశ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని పెంచడానికి గుర్తించిన రంగాలు దేశాన్ని గ్లోబల్ స్టార్టప్ లీడర్‌గా ఎదగడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. శ్రీ పీయూష్ గోయల్ యునికార్న్‌లు ఏకతాటిపైకి వచ్చి దేశంలోని స్టార్టప్‌లకు మూలధనాన్ని పొందేందుకు పరిష్కారాలను అందించే యునికార్న్ క్లబ్ లేదా అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంభాషణ మరింత స్టార్టప్ స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడానికి నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, టైర్-2/3 నగరాల్లో యాక్సెస్‌ను పెంచడం మరియు ప్రైవేట్ రంగంలోని ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్తమ పద్ధతుల నుండి నేర్చుకోవడంపై దృష్టి సారించింది.

 

పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (డీ పీ ఐ ఐ టీ), ఈ సంవత్సరం, దేశంలోని కీలక స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు మరియు ఇతర వాటాదారులతో కలిసి ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతపై దేశవ్యాప్తంగా 10 జనవరి 2024 నుండి 18వ తేదీ వరకు ఇన్నోవేషన్ వీక్‌ ను జరుపుకున్నారు. 'స్టార్టప్‌శాల' - స్టార్టప్ ఇండియా యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ప్రారంభ దశ స్టార్టప్‌ల కోసం 3-నెలల సుదీర్ఘ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, వారికి విజ్ఞానం, నెట్‌వర్క్, నిధులు మరియు ప్రగతి కి అవసరమైన మార్గనిర్దేశంను అందిస్తుంది. ప్రోగ్రామ్‌లోని ప్రతి బృందం ఒక నిర్దిష్ట రంగంపై దృష్టి సారిస్తుంది, మొదటిది క్లీన్‌టెక్ మరియు ప్రతి 20 స్టార్టప్‌లకు ఒక కోహోర్ట్‌ చప్పున  ఓపెన్ కాల్ అప్లికేషన్ నుంచి నిపుణులచే  ఎంపిక చేయబడతాయి. అప్లికేషన్‌లు 10 జనవరి 2024 నుండి స్టార్టప్ ఇండియా హబ్‌లో తెరవబడ్డాయి: https://www.startupindia.gov.in/content/sih/en/Startup_Shala.html.

 

విద్యార్థులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రేరేపించడానికి, 'ఎలా ప్రారంభించాలి' అనే అంశంపై దృష్టి సారించిన 5 అంకితమైన వెబ్‌నార్లు,  వర్ధమాన పారిశ్రామికవేత్తల కోసంమార్గ్ మెంటర్‌షిప్ సిరీస్ పేరుతో నిర్వహించబడ్డాయి. పరిశ్రమ నాయకులు మరియు మార్గదర్శకులు స్టార్టప్‌ను ప్రారంభించటానికి అవసరమయ్యే ప్రాథమిక అంశాల గురించి అంతర్దృష్టులు మరియు కీలక పాఠాలను పంచుకున్నారు. ఈ సెషన్లన్నీ స్టార్టప్ ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు యువ పారిశ్రామికవేత్తల కోసం మైభారత్ (MYBharat) పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి.

 

స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ యొక్క 75+ ఫిజికల్ ఈవెంట్‌లు వ్యవస్థాపకతకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి, భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రదర్శిస్తాయి మరియు అసంఖ్యాక ఔత్సాహిక వ్యవస్థాపకుల కలలను రేకెత్తించాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే వర్క్‌షాప్‌ల నుండి ఇంక్యుబేటర్ ఛాంపియన్‌ల కోసం శిక్షణకు ఈ వారంలో మెంటార్‌లు మరియు మెంటీలు విజ్ఞానాన్ని పంచుకోవడం, ఔత్సాహిక పయినీర్లకు స్ఫూర్తి ఇచ్చింది. భవిష్యత్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను రూపొందించే అనుబంధాలను ఏర్పరుచుకుంటూ, వాటాదారుల చర్చలతో అనేక నగరాల్లో అనేక ఆలోచనలను రేకెత్తించే రౌండ్ టేబుల్‌లు నిర్వహించబడ్డాయి.

 

కార్పోరేట్‌లతో స్టార్టప్‌ల యొక్క  మెంటర్‌షిప్ కూడా వారం ప్రారంభంలో ప్రారంభించబడింది. ఈ సిరీస్‌లో ఆర్థిక రుణాలు మరియు మద్దతు, కార్యకలాపాలు, స్థిరమైన ఆవిష్కరణలు మరియు నూతన సాంకేతికత డొమైన్‌లలో కార్పొరేట్‌లతో షార్ట్‌లిస్ట్ చేయబడిన స్టార్టప్‌లకు ప్రత్యేకమైన చేయూత మరియు మార్గదర్శకత్వం ఉన్నాయి. హెచ్‌సిఎల్, హెచ్‌ఎస్‌బిసి ఇండియా, క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు టిసిఎస్ ఫౌండేషన్లు కార్పొరేట్ భాగస్వాములు.

 

ఆవిష్కరణ మరియు సుస్థిరత్వం గురించి మరింత అవగాహన కల్పించడానికి, స్టార్టప్ ఇండియా యొక్క ప్రపంచ భాగస్వాములతో వర్చువల్ ప్యానెల్ చర్చ నిర్వహించబడింది. ఇన్‌క్యుబేషన్, పెట్టుబడి మరియు రుణాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్, మార్కెట్ అందుబాటు మరియు గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా ఇన్నోవేషన్ యొక్క 5 కీలక స్తంభాలపై ప్యానెల్ దృష్టి సారించింది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీ ఈ ఎం)లో స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రలోని ముంబైలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించబడింది. 9 జనవరి 2024న తెలంగాణాలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ కొనుగోళ్ల పై వర్క్‌షాప్ కూడా నిర్వహించింది, ఇందులో 70 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

***



(Release ID: 2000570) Visitor Counter : 94