రక్షణ మంత్రిత్వ శాఖ
పత్రిక ప్రకటన: 'ఎక్స్-డెసర్ట్ నైట్' విన్యాసాలు
Posted On:
24 JAN 2024 10:55AM by PIB Hyderabad
భారత వైమానిక దళం (ఐఏఎఫ్), ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ (ఎఫ్‌ఏఎస్‌ఎఫ్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైమానిక దళం కలిసి, ఈ నెల 23న, 'ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్' నిర్వహించాయి. అరేబియా సముద్రం మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఫ్రాన్స్ తరపున రాఫెల్ ఫైటర్ విమానం, మల్టీ-రోల్ ట్యాంకర్ ట్రాన్స్‌పోర్ట్ విమానం పాల్గొన్నాయి. యూఏఈ వైమానిక దళం నుంచి ఎఫ్-16 వచ్చింది, దీనిని యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ నుంచి నడిపించారు. భారత వైమానిక దళం తరపున ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్, అవాక్స్, సి-130-జే, గాలిలోనే ఇంధనాన్ని నింపే విమానాలు పాల్గొన్నాయి.
మూడు వైమానిక దళాల మధ్య సమన్వయం మెరుగుపరచడం 'ఎక్సర్‌సైజ్ డెసర్ట్ నైట్' ప్రధాన ఉద్దేశం. ఈ విన్యాసాల ద్వారా మూడు వర్గాల మధ్య విజ్ఞానం, అనుభవాలు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి సులభతరమైంది. ఇది, భారత వైమానిక దళం పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాక, ఆ ప్రాంతంలో బలపడుతున్న దౌత్య & సైనిక సత్సంబంధాలకు దర్పణం పడుతోంది.
***
(Release ID: 1999117)
Visitor Counter : 256