నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దృశ్య మాధ్యమం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న శ్రీ సర్బానంద సోనోవాల్
దిబ్రూగఢ్‌లో హనుమాన్ మందిర్ & రామ్‌దేవ్ మందిర్‌లో స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో పాలుపంచుకున్న శ్రీ సోనోవాల్
Posted On:
22 JAN 2024 5:20PM by PIB Hyderabad
ప్రపంచంలోని అనేకమంది రామభక్తులలో ఒకరిగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అయోధ్యలో జరుగుతున్న శ్రీరామలల్లా సర్కార్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని దిబ్రూగఢ్‌లోని ఔనియాశాఖ సత్ర నామ్‌ఘర్ నుంచి సోమవారంనాడు వీక్షించారు.
తన చరిలాయ్ సమీపంలోని రామ మందిరం, హనుమాన్ మందిరంలో స్వచ్ఛ తీర్థ్ ప్రచారంలో పాలుపంచుకోవడం ద్వారా మంత్రి తన రోజును ప్రారంభించారు. అనంతరం లఖినగర్‌లోని ఔనతి సత్ర శాఖ నామగఢ్ లో హరినామ కీర్తనకు సోనోవాల్ హాజరయ్యారు. అక్కడే ఆయన దిబ్రూగఢ్ నుంచి వచ్చిన రామభక్తులతో కలిసి ప్రతిష్ఠను వీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అయోధ్యలో భగవాన్ శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న పవిత్ర దినాన మన విశిష్ట జాతిని నిర్వచించే ఐక్యత, సహనస్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని శ్రీ సోనోవాల్ అన్నారు. రామ మందిరం కేవలం విశ్వాసానికి చిహ్నంగా మాత్రమే కాక సమరసత, కలుపుకుపోవడం, మనందరినీ కలిపి ఉంచే, మనం పంచుకునే విలువల పట్ల సంఘటిత నిబద్ధతకు తార్కాణంగా నిలవాలని ఆయన అన్నారు. దివ్యమైన ఈ ఆవాసంలో ప్రతిష్ఠాపన అన్ని విభజనలను అధిగమించే సమాజాన్ని పెంపొందించి, ముందెన్నడూ లేనంతగా అవగాహనా వెలుగు ప్రకాశించేందుకు స్ఫూర్తినిస్తూ, శాంతికి కరదీపికగా ఉండాలని ఆయన ఆశించారు. రామమందిరం కేవలం విశ్వానికి చిహ్నం కాదు, సనాతన ధర్మ సంస్కృతి, దయ & విలువల వ్యవస్థకు తార్కాణం అని ఆయన అన్నారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తన ఘనమైన గతం కోసం భారత ఉద్వేగపూరిత వ్యక్తీకరణ రామ మందిరం అని ఆయన పేర్కొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంతో కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలు వాస్తవ రూపుదాలుస్తాయన్నారు. రామ మందిరం ఇప్పుడు మనందరికీ, శాశ్వతంగా మనందరిదీ. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ప్రధాన యజమానిగా హాజరవుతున్న క్రమంలో పవిత్రమైన ఔనియతి సత్ర దిబ్రూగఢ్‌లో రామ భక్తులతో కలిసి రామ మందిరంలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠకార్యక్రమాన్ని దృశ్యమాధ్యమం ద్వారా వీక్షించడం నా అదృష్టమని భావిస్తున్నాను అని ఆయన అన్నారు.
***
(Release ID: 1998693)
Visitor Counter : 98