ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ప్రధాన మంత్రిసూర్యోదయ యోజన’ లో భాగం గా ఒకకోటి కుటుంబాల కు ఇంటి పైకప్పు ల మీద రూఫ్ టాప్ సోలర్ సదుపాయం అందుబాటు లోకిరాగలదు

Posted On: 22 JAN 2024 6:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన’ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ పథకం లో భాగం గా దేశం లో ఒక కోటి కుటుంబాల కు వారి యొక్క ఇంటి పై కప్పు మీద సౌర శక్తి అందుబాటు లోకి రాగలదు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘ఈ రోజు న అయోధ్య లో ప్రాణ ప్రతిష్ఠ తాలూకు మంగళప్రదం అయినటువంటి సందర్భం లో భారతదేశం లో ప్రజల ఇళ్ల పై కప్పు మీద వారి యొక్క సొంత సోలర్ రూఫ్ టాప్ సిస్టమ్ అమరాలి అన్న నా సంకల్పం సైతం బలపడింది.

అయోధ్య నుండి తిరిగి వచ్చిన తరువాత నేను తీసుకొన్న ఒకటో నిర్ణయం ఏమిటి అంటే మా ప్రభుత్వం ఒక కోటి ఇళ్ల కు పై కప్పు మీద రూఫ్‌ టాప్ సోలర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం తో ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభిస్తుంది అన్నదే.

దీని తో పేదల కు మరియు మధ్య తరగతి ప్రజల కు కరెంటు బిల్లు లో తగ్గింపు ఒక్కటే కాకుండా, శక్తి రంగం లో భారతదేశం స్వయం సమృద్ధం గా మారుతుంది కూడా ను’’ అని తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

సూర్యవంశీకుడు భగవాన్ శ్రీ రాముని ప్రకాశం తో ప్రపంచం లో భక్తజనులంతా సదా శక్తి ని ప్రాప్తింపచేసుకొంటారు.

ఈ రోజు న అయోధ్య లో ప్రాణ ప్రతిష్ఠ తాలూకు మంగళప్రదమైన సందర్భం లో భారతదేశం ప్రజల ఇళ్ల పైకప్పు ల మీద వారి సొంత సోలర్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు కావాలి అనేటటువంటి నా సంకల్పం మరింత బలపడింది.

 

అయోధ్య నుండి తిరిగి వచ్చిన తరువాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటి అంట మా ప్రభుత్వం ఒక కోటి టి ఇళ్ల పై రూఫ్ టాప్ సోలర్ వ్యవస్థ ను అమర్చాలన్న లక్ష్యం తో ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన ను ప్రారంభిస్తుంది అనేదే.

 

దీని తో పేదలు మరియు మధ్య తరగతి ప్రజల యొక్క కరెంటు బిల్లు తగ్గుతుంది సరే, దానితో పాటు గా భారతదేశం శక్తి రంగం లో స్వయం సమృద్ధం గా కూడాను మారుతుంది.’’ అని పేర్కొన్నారు.

****

DS/SKS


(Release ID: 1998688) Visitor Counter : 312