శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శ్రీ రామ మందిర నిర్మాణానికి కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కింద గల డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, సిఎస్ఐఆర్ ( శాస్త్రవిజ్ఞాన ,పారిశ్రామిక పరిశోధన మండలి)కి చెందిన కనీసం నాలుగు ప్రముఖ జాతీయ సంస్థలు సాంకేతిక సహకారాన్ని అందించాయి. వీటికి తోడు వివిధ ఐఐటి సంస్థలు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహా పలు సంస్థలు అవసరమైన సేవలు అందించాయని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కీలక సేవలు అందించిన నాలుగు సంస్థలలో సిఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిబిఆర్ఐ) రూర్కీ, సిఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ),హైదరాబాద్, డిఎస్టి–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజికస్ (ఐఐఎ) బెంగళూరు,సిఎస్.ఐఆర్ ఇన్స్టిట్యూటఠ్ ఆప్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బిటి) పాలంపూర్ ( హెచ్పి).
.సిఎస్ఐఆర్–సిబిఆర్ఐ రూర్కీ ప్రధానంగా రామమందిర నిర్మాణానికి తన సేవలు అందించింది.సిఎస్ఐఆర్ –ఎన్.జిఆర్ఐ హైదరాబాద్ ఫౌండేషన్ డిజైన్, భూప్రకంపనలు, భూకంపాలనుంచి భద్రత,డిఎస్టి–2ఎ బెంగళూరు వారు సూర్యతిలక్ కు సూర్య మార్గానికి సంబంధించిన సాంకేతిక మద్దతునిచ్చారు. సిఎస్ఐఆర్–ఐహెచ్బిటి పాలంపూర్ వారు జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవసమయానికి వికసిత తులిప్ పుష్పాలను పంపుతున్నారు. .: డాక్టర్ జితేంద్ర సింగ్.
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనం గురించి నొక్కి చెబుతూ ఉన్నారు.
Posted On:
21 JAN 2024 1:43PM by PIB Hyderabad
శ్రీ రామ మందిర నిర్మాణానికి కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కింద గల డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, సిఎస్ఐఆర్ ( శాస్త్రవిజ్ఞాన ,పారిశ్రామిక పరిశోధన మండలి)కి చెందిన కనీసం నాలుగు ప్రముఖ జాతీయ సంస్థలు సాంకేతిక సహకారాన్ని అందించాయి. వీటికి తోడు వివిధ ఐఐటి సంస్థలు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహా పలు సంస్థలు అవసరమైన సేవలు అందించాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కీలక సేవలు అందించిన నాలుగు సంస్థలలో సిఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిబిఆర్ఐ) రూర్కీ, సిఎస్ఐఆర్– నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ),హైదరాబాద్, డిఎస్టి–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజికస్ (ఐఐఎ) బెంగళూరు,సిఎస్.ఐఆర్ ఇన్స్టిట్యూటఠ్ ఆప్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బిటి) పాలంపూర్ ( హెచ్పి). ఉన్నాయన్నారు. .సిఎస్ఐఆర్–సిబిఆర్ఐ రూర్కీ ప్రధానంగా రామమందిర నిర్మాణానికి తన సేవలు అందించిందని .సిఎస్ఐఆర్ –ఎన్.జిఆర్ఐ హైదరాబాద్ ఫౌండేషన్ డిజైన్, భూప్రకంపనలు, భూకంపాలనుంచి భద్రత,డిఎస్టి–2ఎ బెంగళూరు వారు సూర్యతిలక్ కు సూర్య మార్గానికి సంబంధించిన సాంకేతిక మద్దతునిచ్చారు. సిఎస్ఐఆర్–ఐహెచ్బిటి పాలంపూర్ వారు జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవసమయానికి తులిప్ పుష్పాలు వికసించుకునేలా చూసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
అయోధ్య ప్రధాన ఆలయం 360 అడుగుల పొడవు , 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందని, దీనిని రాజస్థాన్లోని పహాడ్పూర్లోని ఇసుకరాయి తో నిర్మించారని తెలిపారు. దీని నిర్మాణంలో ఎక్కడా సిమెంటు, ఇనుము, స్టీలు వాడలేదన్నారు. మూడు అంతస్తులు కలిగిన ఈ ఆలయ నిర్మాణాన్ని 2500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనగలిగేలా, అలాగే రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8ని సైతం తట్టుకునేలా నిర్మించినట్టు తెలిపారు.
సిఎస్ఐఆర్–సిబిఆర్ఐ రూర్కీ సంస్థ రామమందిర నిర్మాణ కార్యక్రమాలలో ప్రాథమిక దశనుంచే నిమగ్నమై ఉంది. ప్రధాన ఆలయ నిర్మాణ డిజైన్ను సూర్యతిలక్ పద్ధతిని, ఆలయ ఫౌండేషన్ డిజైన్ను ప్రధాన ఆలయ నిర్మాణ స్థితి పర్యవేక్షణలో ఈ సంస్థ భాగస్వామి అయింది.
సిబిఐఆర్, సిఎస్ఐఆర్–ఎన్.జి.ఆర్.ఐ హైదరాబాద్లు ఫౌండేషన్ డిజైన్, భూ ప్రకంపనలు, భూకంపాలనుంచి రక్షణ వంటి విషయాలపై కీలక సమాచారం అందించాయి.పలు ఐఐటిలు నిపుణుల కమిటీలో భాగస్వామ్యం అయ్యాయి. ఇస్రోనుంచి అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఈ భారీ నిర్మాణానికి వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు.
రామ మందిర నిర్మాణంలో ప్రత్యేకత సూర్య తిలక్. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, సూర్య కిరణాలు ఆరు నిమిషాల పాటు, రాముడి విగ్రహంపై తిలక భాగంలో పడే విధంగా దీనిని నిర్మించారు. హిందూ క్యాలండర్లోని తొలి మాసమైన చైత్ర మాసం ప్రారంభమైన తర్వాత 9 వరోజున శ్రీరామనవమి జరుపుకుంటారు.సాధారణంగా ఇది మార్చి ఏప్రిల్, మాసాలలో ఉంటుంది. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారమైన రామావతారంలో శ్రీరాముడు జన్మించిన మహత్తర దినమని ఆయన తెలిపారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, బెంగళూరు వారు సూర్యమార్గానికి సంబంధించిన సమాచారాన్ని అందించి ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇచ్చారు.ఆప్టికా బెంగలూరు వారు కటకాలను(లెన్సులను)ఇత్తడి ట్యూబ్ను రూపొందించడంలో సహకరించారు.
గేర్ బాక్స్, పరావర్తన కటకాలు, అద్దాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సూర్య కిరణాలు ఆలయ ఆలయ మూడో అంతస్తు సమీపంలోని శిఖరం నుంచి గర్బగృహంలో పడేట్టు చూస్తారు. ఇక్కడ సూర్యగమనాన్ని నిర్ధారించే సూత్రాలను వాడినట్టు తెలిపారు. సిఎస్ఐఆర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విశ్వాస ఉత్సవంలో ఐక్యత, భక్తిస్ఫూర్తి వెల్లివిరుస్తోందన్నారు. సిఎస్ఐఆర్..ఐహెచ్బిటి పాలంపూర్ (హిమాచల్ ప్రదేశ్) వికసిత తులిప్ పుష్పాలను అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన ఉత్సవానికి జనవరి 22న పంపుతున్నదని తెలిపారు.
తులిప్ పుష్పాలు సాధారణంగా ఈ సీజన్ లో పుష్పించవు.ఇవి కేవలం జమ్ము కాశ్మీర్, హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయి. ద ఇన్స్టిట్యూట్ఆప్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ పాలంపూర్ వారు ఇటీవల దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది పొడవునా తులిప్ పుష్పాలు వికసించేలా కొత్త రకాన్నిరూపొందించారు.సీజన్ లతో సంబంధం లేకుండా ఇవి ఏడాది పొడవునా అందుబాటులోకి వస్తాయి అని మంత్రి తెలిపారు.సిఎస్ఐఆర్టెక్నాలజీలను రోజువారీ జీవితంలో మనం విస్తృతంగా వాడుతుంటామని డాక్టర్జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి ఆత్మనిర్భర్, వికసిత్భారత్ గా స్వాతంత్ర్య అమృత్ కాల్ లో ఎదుగుతున్నదని అన్నారు. సిఎస్ఐఆర్ పరిశోదన శాలలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని, ఇవి నవ భారతదేశానికి గుర్తుగా నిలిచాయని అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్స్ (ఐఐఐఎం) జమ్ము అరోమా మిషన్ కు, పర్పుల్ విప్లవవానికి నాయకత్వం వహిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర తెలిపారు.
అలాగే, నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్.బి.ఆర్.ఐ)లక్నో కొత్త కమలం పుస్ఫాల వంగడాన్ని అభివృద్ధి చేసిందని దీనిపేరు ఎన్.బి.ఆర్.ఐ, నమో 108 అని తెలిపారు.నమో 108 కమలం పుష్పాలు మార్చి నుంచి డిసెంబర్ వరకు అందుబాటులోకి వస్తాయని ,వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయన్నారు. ఈ కమలం పుష్పాల జన్యు క్రమాన్ని పూర్తిస్తాయిలో రూపొందించినట్టు కూడా ఆయన తెలిపారు. ఈ తరహా జన్యు క్రమాన్ని రూపొందించడం ఈ పుష్పంలో ఇదే తొలిసారి అని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా సంప్రదాయం, ఆధునికతలను మేళవించాలని, అన్ని రకాల ఆలోచనా ధారలను మిళితం చేయాలని చెబుతూ వచ్చారని డాక్టర్ జితేంద్ర తెలిపారు. భారతదేశం పదో పెద్ద ఆర్థిక వ్యవస్థనుంచి ఐదో పెద్ద ఆర్ధిక వ్యవస్థకు ఎగబాకిందని, త్వరలోనే ఇది నాలుగో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఆ తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా అవతరించనున్నదని డాక్టర్ జితేంద్ర తెలిపారు.
***
(Release ID: 1998541)
Visitor Counter : 197