రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మైగొవ్ లో జనవరి 22-29, 2024 నుండి ఆన్‌లైన్ పోటీని నిర్వహించనున్న రక్షణ మంత్రిత్వ శాఖ


బీటింగ్ రిట్రీట్ వేడుక 2024లో వినిపించే భారతీయ ట్యూన్‌లపై ప్రజలు తమ వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు, అద్భుతమైన బహుమతులను గెలుచుకోవచ్చు

Posted On: 21 JAN 2024 8:41PM by PIB Hyderabad

జనవరి 29, 2024న విజయ్ చౌక్‌లో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకలో ప్లే చేయాల్సిన భారతీయ ట్యూన్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రక్షణ మంత్రిత్వ శాఖ మైగొవ్ సమన్వయంతో జనవరి 22-29, 2024 వరకు ఆన్‌లైన్ పోటీని నిర్వహిస్తుంది. పాల్గొనేవారు వోకల్ లేదా ఇన్‌స్ట్రుమెంటల్ మోడ్ ద్వారా బీటింగ్ రిట్రీట్ సెర్మనీ 2024 ట్యూన్‌లపై తమ వీడియో క్లిప్‌లను తయారు చేయవచ్చు. మై గొవ్ పోర్టల్‌లోని ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లో వారి ఎంట్రీలను అప్‌లోడ్ చేయవచ్చు.

విశిష్ట లక్షణాలు

- మైగొవ్ ప్లాట్‌ఫారమ్‌లో ట్యూన్‌ల లింక్ (లిరిక్స్‌తో పాటు) అందుబాటులో ఉంటుంది.

- పాల్గొనేవారు అప్‌లోడ్ చేయాల్సిన వీడియో క్లిప్ నిడివి 45-60 సెకన్ల మధ్య ఉండాలి.

 

- 3 ఉత్తమ స్థానాల్లో వచ్చిన వారికి (ప్రతి విభాగంలో) క్రింది విధంగా నగదు బహుమతి ఇస్తారు. :

 

గాత్రం క్యాటగిరీ 

సంగీత వాద్యం కేటగిరి 

మొదటి బహుమతి 

రూ.25,000/-

మొదటి బహుమతి 

రూ. 25,000/-

రెండవ బహుమతి 

రూ 15,000/-

రెండవ బహుమతి 

రూ. 15,000/-

మూడవ బహుమతి 

రూ 10,000/-

మూడవ బహుమతి 

రూ. 10,000/-

 

నిబంధనలు & షరతులు

- భారతీయ పౌరులే ఈ క్విజ్ లో పాల్గొడానికి అర్హులు 

- ఒకరు ఒక పోటీ లోనే పాల్గొడానికి అవకాశం ఉంటుంది 

- పోటీలో పాల్గొనాలనుకునే ఏ వ్యక్తి అయినా అతని/ఆమె పేరు, తండ్రి/తల్లి పేరు, పుట్టిన తేదీ, కరస్పాండెన్స్ చిరునామా, ఇమెయిల్ చిరునామా మరియు మొబైల్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది.

- పాల్గొనేవారి సంప్రదింపు వివరాలు ఏ దశలోనైనా చెల్లనివిగా గుర్తించబడితే, వారి భాగస్వామ్యం రద్దు చేయబడుతుంది, నగదు బహుమతిని కూడా కోల్పోతారు. 

- క్విజ్ ఫలితాలను ప్రకటించిన తర్వాత విజేతలు బోనఫైడ్ డాక్యుమెంట్లు (గుర్తింపు రుజువు, వయస్సు, చిరునామా మరియు బ్యాంక్ వివరాలు) సమర్పించవలసి ఉంటుంది. సరైన దశలో సమాచారం/పత్రాలను అందించకపోతే ఎంపిక శూన్యం  అవుతుంది.

- పోటీలో పాల్గొనడానికి ఒకే మొబైల్ నంబర్ మరియు ఒకే ఇమెయిల్ ఐడిని ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించలేరు.

 

*****


(Release ID: 1998527) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi