శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సిఎస్ఐఆర్–ఎన్ఐఎస్సిపిఆర్ నిర్వహించిన భారత అంతర్జాతీయ విజ్ఞాన ఉత్సవం 2023–వైజ్ఞానిక లో మెరిసిన కె.ఎ.ఎం.పి విద్యార్థులు..
Posted On:
20 JAN 2024 4:39PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్, పాలసీ రిసెర్చ (ఎన్ఐఎస్సిపిఆర్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన, భారత అంతర్జాతీయ విజ్ఞాన ఉత్సవం వైజ్ఞానిక ఈవెంట్ 2023లో నాలెడ్జ్ అవేర్ నెస్ మాపింగ్ ప్లాట్ఫారం (కె.ఎ.ఎం.పి) కి చెందిన సుమారు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరు తమ వైజ్ఞానిక సామర్థ్యాలను, కళాత్మక దృష్టితో ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 2024 జనవరి 19న, హర్యానాలోని ఫరీదాబాద్లో ఎన్.సి.ఆర్ బయో టెక్ సైన్స్ క్లస్టర్ లో గల డిబిటి టిహెచ్ఎస్టిఐ–ఆర్.సి.బి క్యాంపస్లో జరిగింది.
విజ్ఞానం, సృజనాత్మకత సమ్మిళితంగా దీనిని నిర్వహించారు. జైన్ భారతి మృగవతి విద్యాలయ యూనివర్సల్ పబ్లిక్స్కూల్, ఢిల్లీ పబ్లిక్స్కూల్, ఆర్.కె.పురం , ఎస్డి పబ్లిక్సెంకండరీ స్కూలు తదితర విద్యాసంస్థలకు చెందని విద్యార్థులు వైజ్ఞానిక అంశాలలో తమకు గల అద్భుత ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ చిన్నారుల ప్రతిభ అద్భుతమైనది. క్విజ్, డ్రాయింగ్ పోటీలు కూడా జరిగాయి. ఈ సంస్థల విద్యార్థులకు గల అద్భుత నైపుణ్యాలు ఈ ఉత్సవాలలో ప్రదర్శించారు. విద్యార్థులకు గల వివిధ ఆసక్తులు , వారి మేధస్సు, నైపుణ్యాలు ఈ సందర్భంగా ప్రదర్శితమయ్యాయి. ఈ యువ మేధావులు అందరి ప్రశంసలు అందుకున్నారు. సైన్స్, కళా రంగాలలో అద్భుతమైన ఆవిష్కరణలకు సంబంధించిన వాటిని ప్రదర్శించారు. ఐఐఎస్ఎఫ్ 2023 వైజ్ఞానిక్ ఈవెంట్లో వీరు చురుకుగా పాల్గొనడం , వ్యక్తిగతంగా వారి ప్రతిభను చాటడమే కాక, సమష్ఠిగా ఆవిష్కరణలు, శాస్త్రీయ దృష్టి కోణం పట్ల వారి అంకిత భావాన్ని తెలియజేశాయి.
***
(Release ID: 1998443)