జల శక్తి మంత్రిత్వ శాఖ

ఎం పీ లో కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ మరియు అటల్ భుజల్ యోజన స్టీరింగ్ కమిటీ 5వ సమావేశం

Posted On: 19 JAN 2024 6:44PM by PIB Hyderabad

కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ యొక్క స్టీరింగ్ కమిటీ 5వ సమావేశం ఈరోజు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కార్యదర్శి (డీ ఓ డబ్ల్యూ ఆర్, ఆర్ డీ & జీ ఆర్) శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి డబ్ల్యూ ఆర్ డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మనీష్ సింగ్, ఎం పీ,  శ్రీ సుబోధ్ యాదవ్, జే ఎస్, పన్నా మరియు ఛతర్‌పూర్ కలెక్టర్ & డీ ఎం, ఐ & డబ్ల్యూ ఆర్ డీ & జీ ఆర్, యూ పీ అటవీ శాఖ ప్రతినిధి, యూ పీ ఎం పీ, ఫీల్డ్ డైరెక్టర్, పీ టీ ఆర్, నీతి అయోగ్, ఎం ఓ ఈ ఎఫ్ & సీ సీ, డబ్ల్యూ ఐ ఐ, ఎన్ డబ్ల్యూ డీ ఏ, సీ డబ్ల్యూ సీ, కె బీ ఎల్ పి ఎ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను చైర్‌పర్సన్ హైలైట్ చేశారు. సమాజాభివృద్ధితో పాటు పర్యావరణం, జీవవైవిధ్యం యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం, నిర్మాణంలో ఉత్తమ విధానాలను ఆమె నొక్కి చెప్పారు. దౌధన్ డ్యామ్ మరియు లింక్ కెనాల్  భూసేకరణ సకాలంలో పూర్తి చేయటం పై ప్రత్యేక దృష్టి సారించారు. మిగతా అన్ని డీపీఆర్‌లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని త్రైమాసికాల్లో సకాలంలో మరియు అంచనా వేసిన ప్రయోజనాలను సాధించేందుకు ఐక్యంగా పని చేయాలని భాగస్వాములందరికీ కార్యదర్శి చెప్పారు.

 

అనంతరం అటల్ భుజల్ యోజన పురోగతి సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.

 

ఎంపీ లోని ఛత్తర్‌పూర్ జిల్లా, రాజ్ నగర్ బ్లాక్‌లోని సాలయ్య గ్రామ పంచాయితీలోని పిపారియా గ్రామాన్ని సెక్రటరీ (డీ ఓ డబ్ల్యూ ఆర్, ఆర్ డీ & జీ ఆర్) నిన్న సందర్శించారు. అటల్ జల్ ఆధ్వర్యంలో భూగర్భ జలాలపై అవగాహన కల్పించేందుకు గ్రామస్తులతో ఆమె మాట్లాడారు. శ్రీ సుబోధ్ యాదవ్, ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, మనీష్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీ సందీప్, కలెక్టర్ ఛత్తర్‌పూర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎస్ పీ ఎం యూ , అటల్ భుజల్ యోజన ఉన్నారు. గ్రామస్థులు భూగర్భ జలాల నిర్వహణపై తమ అనుభవాలను పంచుకున్నారు మరియు నీటి పొదుపు పద్ధతులు  కొత్త చొరవ పద్ధతులను అనుసరించడానికి చేపట్టిన కార్యక్రమాలను పంచుకున్నారు.

 

తర్వాత కార్యదర్శి (డీ ఓ డబ్ల్యూ ఆర్, ఆర్ డీ & జీ ఆర్)తో పాటు,  కలెక్టర్, ఛతర్‌పూర్ సమక్షంలో , సి  డబ్ల్యూ సీ మరియు డబ్ల్యూ ఆర్ డీ, ఎన్ డబ్ల్యూ డీ ఏ, సీ  కె బీ ఎల్ పి ఎ అధికారులు కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ యొక్క దౌధాన్ ఆనకట్ట స్థలాన్ని సందర్శించారు. దౌధన్ డ్యామ్ ప్రణాళిక మరియు సకాలంలో అమలుపై ఆమె కె బీ ఎల్ పి ఎ, ఎం పీ, ప్రభుత్వ అధికారులతో చర్చించారు. కార్యదర్శి, స్థానిక గ్రామస్తులతో కూడా సంభాషించారు మరియు ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల అభివృద్ధి కోసం ఆర్ & ఆర్ ని సమర్థవంతంగా అమలు చేయాలని డబ్ల్యూ ఆర్ డీ, ఎం పీ, కలెక్టర్‌లను కోరారు.

 

సెక్రటరీ (డీ ఓ డబ్ల్యూ ఆర్, ఆర్ డీ & జీ ఆర్) పన్నా టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు మరియు పన్నా టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌తో చర్చించారు. వాటాదారులందరి సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేయాలని అన్ని చర్యలు సకాలంలో తీసుకోవాలనీ ఆమె ఆదేశించారు.

 

***



(Release ID: 1998169) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi