మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2024 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రకటించింది.
Posted On:
19 JAN 2024 6:25PM by PIB Hyderabad
అసాధారణమైన సామర్థ్యాలు మరియు అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బీపీ) ఇస్తారు. జాతీయ గుర్తింపుకు అర్హమైన ధైర్యం, కళ మరియు సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ మరియు క్రీడల కోసం ఏడు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ అవార్డులు అందజేస్తారు. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బీపీ) యొక్క ప్రతి అవార్డు గ్రహీతకి మెడల్ తోపాటు సర్టిఫికేట్ మరియు సైటేషన్ బుక్‌లెట్ ఇవ్వబడుతుంది.
జనవరి 22, 2024న విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 2024 సంవత్సరానికిగాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అసాధారణ విజయాలు సాధించిన 9 మంది చిన్నారులు ఎంపికయ్యారు.
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో 23 జనవరి, 2024న భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ,సంభాషించనున్నారు. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా పురస్కార గ్రహీతలైన పిల్లలు పాల్గొంటారు.
శౌర్యం, సైన్స్ & టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కేటగిరీలలో ఒక్కో కేటగిరీకి ఒకరిని ఎంపికచేశారు. సామాజిక సేవ విభాగంలో నలుగురిని; క్రీడల విభాగంలో ఐదుగురు బాలలను ఎంపిక చేశారు. కళ మరియు సంస్కృతి విభాగంలో ఈ పురస్కారం కోసం ఏడుగురు ఎంపికయ్యారు. ఈ జాబితాలో 18 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 9 మంది బాలురు మరియు 10 మంది బాలికలు ఉన్నారు. జాబితా క్రింది విధంగా ఉంది:
ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2024
క్రమసంఖ్య పేరు రాష్ట్రం కేటగిరీలు
1. ఆదిత్య విజయ్ బ్రహ్మనే (మరణానంతరం) మహారాష్ట్ర శౌర్యం
2. అనుష్క పాఠక్ ఉత్తర ప్రదేశ్ కళ & సంస్కృతి
3.అరిజిత్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ కళ & సంస్కృతి
4. అర్మాన్ ఉబ్రానీ ఛత్తీస్‌గఢ్ కళ & సంస్కృతి
5. హేత్వీ కాంతిభాయ్ ఖింసూరియా గుజరాత్ కళ & సంస్కృతి
6. ఇష్ఫాక్ హమీద్ జమ్మూ & కాశ్మీర్ కళ & సంస్కృతి
7. ఎండీ హుస్సేన్ బీహార్ కళ & సంస్కృతి
8. పెండ్యాల లక్ష్మీ ప్రియ తెలంగాణ కళ & సంస్కృతి
9. సుహాని చౌహాన్ ఢిల్లీ ఆవిష్కరణ
10. ఆర్యన్ సింగ్ రాజస్థాన్ సైన్స్ & టెక్నాలజీ
11. అవనీష్ తివారీ మధ్యప్రదేశ్ సామాజిక సేవ
12. పరువు హర్యానా సామాజిక సేవ
13. జ్యోత్స్న అక్తర్ త్రిపుర సామాజిక సేవ
14. సయం మజుందర్ అస్సాం సామాజిక సేవ
15. ఆదిత్య యాదవ్ ఉత్తర ప్రదేశ్ క్రీడలు
16. చార్వి ఎ కర్ణాటక క్రీడలు
17. జెస్సికా నెయ్ సారింగ్ అరుణాచల్ ప్రదేశ్ క్రీడలు
18. లింతోయ్ చనంబం మణిపూర్ క్రీడలు
19. ఆర్ సూర్య ప్రసాద్ ఆంధ్రప్రదే క్రీడలు
***
(Release ID: 1998161)
Visitor Counter : 262