చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ఉన్నత స్థాయి కమిటీ సంప్రదింపుల ప్రక్రియ
प्रविष्टि तिथि:
18 JAN 2024 6:56PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన వన్ నేషన్ వన్ ఎలక్షన్(జమిలీ ఎన్నికల) పై ఉన్నత స్థాయి కమిటీ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా, పౌరులు, రాజకీయ పార్టీలు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు, మాజీ సీఈసీలు వంటి ప్రముఖ న్యాయనిపుణుల నుండి సలహాలు మరియు అభిప్రాయాలు స్వీకరించబడతాయి.
ఈ సంప్రదింపులలో భాగంగా, జనవరి 17న హెచ్ఎల్సీ చైర్మన్ న్యూఢిల్లీలో మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీని కలిశారు. ఈ మధ్యాహ్నం చర్చలను కొనసాగిస్తూ, హెచ్ఎల్సీ చైర్మన్ జస్టిస్ గొర్ల రోహిణి, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్రతో చర్చలు జరిపారు.
రానున్న రోజుల్లో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది.
(रिलीज़ आईडी: 1998045)
आगंतुक पटल : 161