మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
“2047 నాటికి భారతదేశం వికసిత భారత్ అవుతుంది; నూతన యుగ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు నూతన భారతదేశానికి మార్గదర్శకులుగా ఉంటారు"
" 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదంతో నడిచే దేశ యువత భారతదేశాన్ని
గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా స్థాపిస్తుంది"
"వికసిత భారత్ మన సంకల్పం. మన సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తల సహకారం మరియు మద్దతుతో, మనం సిద్ధిని సాధించగలుగుతాము"
- శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఐఐటీ హైదరాబాద్‌లో ఇన్వెంటివ్ రెండవ ఎడిషన్‌ను ప్రారంభించిన శ్రీ ప్రధాన్
'ఇన్వెంటివ్' లో 53 భవిష్యత్-కేంద్రీకృత సంస్థలు మరియు 2000 పరిశ్రమ వాటాదారుల ఆధ్వర్యంలో
120 సంచలనాత్మక ప్రాజెక్టుల ప్రదర్శన
Posted On:
19 JAN 2024 4:37PM by PIB Hyderabad
ప్రాచీన భారతదేశం ఆవిష్కరణలకు భూమిక అని, నేడు ఆధునిక భారతదేశం విశ్వ మిత్రగా వ్యవహరిస్తోందని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతరాలను తగ్గించడానికి, కొత్త ఎత్తులకు చేరుకోవడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటోందని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌గా మారడానికి ఉద్దేశించిన భారతదేశం పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకతను దాని పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఈరోజు ఐఐటి హైదరాబాద్‌లో ఉన్నత విద్యా సంస్థల (హెచ్‌ఇఐ) రెండవ ఎడిషన్ II ఇన్వెంటివ్, ఆర్ & డి ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి తన ప్రధాన ప్రసంగం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారతదేశం 'ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భారీ పరివర్తన'ని తీసుకుందని అన్నారు. భారతదేశ అభివృద్ధి నమూనాను ప్రపంచం ఇప్పుడు గుర్తించిందని అన్నారు. భవిష్యత్, స్థిరమైన అభివృద్ధిపై భారత్ దృష్టి పెట్టిందని చెప్పారు. మార్కెట్, సంక్షేమ ఆర్థిక వ్యవస్థ రెండింటి గతిశీలతను గుర్తించడంలోనే మన బలం ఉందని, ఈ ప్రయోజనం కోసం, విధాన రూపకల్పన అనేది 'తయారీ రంగం' వ్యూహాలను, దృష్టిని కేంద్రీకరించే ప్రాంతాలకు మార్చామని శ్రీ ధర్మేంద్ర ప్రధాన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 17 శాతంతో పోలిస్తే దేశ జిడిపికి కనీసం 25 శాతం వరకు దోహదపడేలా భారత్ ను ఒక తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', 'ఇన్వెస్ట్ ఇన్ ఇండియా', పిఎల్ఐ స్కీమ్, ఎఫ్‌డిఐ లిబరలైజేషన్ వంటి ముఖ్యమైన విధాన మార్పుల ద్వారా తయారీ రంగాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలు భారతదేశం భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే లక్ష్యాన్ని సాధించగలవు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు భారత తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో భారతదేశ వృద్ధి సాధించే దిశగా సాగించే ప్రయాణంలో ఇన్నోవేషన్ నిర్ణయాత్మకమని శ్రీ ప్రధాన్ అన్నారు. మన స్టార్టప్‌లు, మానవ శక్తి ఈ మొత్తం పరిణామాల దశ, దిశనే మారుస్తున్నాయి. ఐఐటీయన్ల సుసంపన్నమైన సహకారాన్ని ప్రశంసిస్తూ అమెరికన్ కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన తీర్మానం 'బ్రాండ్ ఇండియా'కి ప్రశంసనీయమైన ఉదాహరణ అని శ్రీ ప్రధాన్ తెలిపారు.
ఈ రోజు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డొమైన్ లో 46 శాతం గ్లోబల్ డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరుగుతున్నాయని, తద్వారా భారతదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. 9 సంవత్సరాలలో 1.2 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో 300 రెట్లు పెరగడంతో స్టార్ట్-అప్ సంస్కృతి సుస్థిరత సాధించింది. వందకు పైగా యునికార్న్‌ల ఉనికిని కలిగి ఉండటం కీలకమైన అంశమని, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థగా మార్చిందని అన్నారు. పర్యవసానంగా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్ 2015లో 81వ ర్యాంక్ నుండి 132 ఆర్థిక వ్యవస్థలలో ప్రపంచవ్యాప్తంగా 40వ ర్యాంక్‌కు చేరుకుంది. తన ప్రసంగంలో డీప్ టెక్ స్టార్ట్-అప్‌లు, డాక్టోన్ సెక్టార్ ఎకోసిస్టమ్ వంటి క్రిటికల్ డెఫెన్స్‌పై ప్రభుత్వ దృష్టిని కూడా ప్రధానంగా ప్రస్తావించారు కేంద్ర మంత్రి శ్రీ ప్రధాన్. సాంకేతికత, రోబోటిక్స్. గ్రీన్‌హైడ్రోజన్ మిషన్, ఇండియన్ సెమీ-కండక్టర్ మిషన్ వంటి కార్యక్రమాలు పిఎల్ఐ పథకాలతో కలిపి పెట్టుబడిదారుల నుండి ఆసక్తిని రేకెత్తించాయి. మన యువత ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదంతో ముందుకు సాగి భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా నిలబెడతారనే నమ్మకం తనకు ఉందని శ్రీ ప్రధాన్ ఉద్ఘాటించారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (ఎన్ఈపి-2020), ఇన్నోవేషన్‌ల మధ్య సంబంధానికి సంబంధించి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక నిర్ణయం తీసుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి వాటిపై దృష్టి సారించే పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో ఎన్ఈపి-2020 సాధనంగా ఉందని శ్రీ ప్రధాన్ అన్నారు. ఇది బహుళ-క్రమశిక్షణ, ఇంటర్-డిసిప్లినరీ విద్యను ప్రోత్సహించింది. ఎన్ఈపి-2020 ఆర్కిటెక్చర్ హ్యాకథాన్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇన్నోవేషన్ డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐడిఈ) బూట్‌క్యాంప్‌లు, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్), కొత్త పాఠ్యపుస్తకాల అభివృద్ధి, రీసెర్చ్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్లు, డెవలప్‌మెంట్ పోర్టల్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థుల బృందాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్బంగా శ్రీ ప్రధాన్ ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని ప్రారంభించారు. వినూత్న సాధనాలు, సాంకేతికతలను ప్రదర్శించే స్టాల్స్‌ను సమగ్రంగా సందర్శించారు. వాటాదారులతో కూడా ఆయన సంభాషించారు. ఎగ్జిబిషన్ పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది, సమాజం, పరిశ్రమ, విద్యాసంస్థలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి, ప్రయోజనం చేకూర్చేందుకు వాగ్దానం చేసే సంభావ్య సహకారాలకు మార్గం సుగమం చేస్తుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ మూర్తి, ఐఐటీ-హెచ్, ఐఐటీ-రూర్కీ బిఓజి డా. బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ-హెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఇన్వెస్ట్ ఇండియా ఎండీ, సీఈఓ నివృత్తి రాయ్, ఐఐటీ-హెచ్ ఇన్నోవేషన్స్ డీన్ ప్రొఫెసర్ ఎస్. సూర్య కుమార్, హెచ్ఈఐల డైరెక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యులు, ప్రముఖ విద్యాసంస్థల అధిపతులు, పరిశ్రమల ప్రముఖులు, చైర్మన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు.
ది ఇన్వెంటివ్ 2024 పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ ఫెయిర్ వినూత్న ప్రాజెక్ట్‌ల విభిన్న శ్రేణిని ప్రదర్శిస్తుంది, ఇది 53 ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి మొత్తం 120 సంచలనాత్మక కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. ఈ ఈవెంట్ ఐదు కీలకమైన డొమైన్‌లను లక్ష్యంగా చేసుకుంది, వీటిలో సరసమైన హెల్త్‌కేర్, అగ్రికల్చర్ & ఫుడ్ ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్, ఇ-మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ స్పేస్, ఇండస్ట్రీ 4.0తో సహా స్థిరమైన సాంకేతికతలు ఉన్నాయి. అదనంగా, ఈ 2-రోజుల ఈవెంట్ ఆయా రంగాల్లో ఒక్కొక్కటి ఐదు ప్యానెల్ చర్చలు నిర్వహిస్తారు. ఇది లోతైన అంతర్దృష్టులను పెంపొందించడం, జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, ఆవిష్కర్తల మధ్య సహకార సంభాషణలను ప్రేరేపిస్తోంది.
***
(Release ID: 1998017)
Visitor Counter : 103