వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తికి సంబంధించి మూడో ముందస్తు అంచనాలను విడుదల చేసిన వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
- హార్టికల్చర్ ఉత్పత్తి 355.25 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది;
- ఇది 8.07 మిలియన్ టన్నులు అధికం
- ప్రధానమంత్రి నాయకత్వంలో మన రైతులు, శాస్త్రవేత్తలు, రైతు స్నేహపూర్వక విధానాలు తోడ్పాటుతో కృషి చేయడం దీనికి కారణం: కేంద్ర మంత్రి శ్రీ ముండా
Posted On:
18 JAN 2024 5:26PM by PIB Hyderabad
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022-23 సంవత్సరానికి వివిధ ఉద్యాన పంటల విస్తీర్ణం మరియు ఉత్పత్తికి సంబంధించిన మూడవ ముందస్తు అంచనాను విడుదల చేసింది. 2022-23 సంవత్సరానికి మొత్తం ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనా 355.25 మిలియన్ టన్నులు, ఇది 2021-22 సంవత్సరం (చివరి) కంటే దాదాపు 8.07 మిలియన్ టన్నులు (2.32% పెరుగుదల) అధికం. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉద్యానవన పంటల ఉత్పత్తిని నిరంతరంగా పెంచుతున్న ఘనత మన రైతు సోదరులు, సోదరీమణులు, శాస్త్రవేత్తలదేనన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు స్నేహపూర్వక విధానాల కృషి వల్లనే అధిక ఉత్పత్తి సాధ్యమవుతోందని అన్నారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ఇతర ప్రభుత్వ వనరుల ఏజెన్సీల నుండి అందిన సమాచారం ఆధారంగా.. 2022-23 మూడవ ముందస్తు అంచనా ప్రకారం పండ్లు, కూరగాయలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, తేనెల ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేయబడింది. పండ్ల ఉత్పత్తి 2021-22 సంవత్సరంలో 107.51 మిలియన్ టన్నుల నుండి 2022-23 సంవత్సరంలో 109.53 మిలియన్ టన్నులు పెరుగుతుందని అంచనా.
అదేవిధంగా, కూరగాయల ఉత్పత్తి 2022-23 సంవత్సరంలో 213.88 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, 2021-22 సంవత్సరంలో ఉత్పత్తి 209.14 మిలియన్ టన్నులుగా ఉంది. ప్లాంటేషన్ పంటల ఉత్పత్తి 2021-22 సంవత్సరంలో 15.76 మిలియన్ టన్నులతో పోలిస్తే 2022-23 సంవత్సరంలో 16.84 మిలియన్ టన్నులు పెరుగుతుందని అంచనా వేయబడింది, అంటే దాదాపు 6.80% పెరుగుదల. బంగాళాదుంప ఉత్పత్తి 60.22 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా వేయగా, 2021-22 సంవత్సరంలో ఉత్పత్తి 56.18 మిలియన్ టన్నులుగా నిలిచింది. టమోటా ఉత్పత్తి 2021-22 సంవత్సరంలో 20.69 మిలియన్ టన్నులు కాగా 2022-23 సంవత్సరంలో 20.37 మిలియన్ టన్నులుగా నిలిచింది.
మొత్తం ఉద్యాన పంటలు
|
2021-22
(తుది గణాంకాలు)
|
2022-23
(రెండో విడత ముందస్తు అంచనాలు)
|
2022-23
(మూడో విడత ముందస్తు అంచనాలు)
|
విస్తీర్ణం (మిలియన్ హెక్టార్లలో)
|
28.04
|
28.12
|
28.34
|
ఉత్పత్తి (మిలియన్ టన్నులలో)
|
347.18
|
351.92
|
355.25
|
***
(Release ID: 1997995)
Visitor Counter : 173