విద్యుత్తు మంత్రిత్వ శాఖ

చెషైర్ హోమ్ ఇండియా దిల్లీ యూనిట్‌లోని శారీరక & మానసిక దివ్యాంగులకు వైద్య చికిత్సలు, పోషకాహారం అందించనున్న ఎన్‌హెచ్‌పీసీ

Posted On: 18 JAN 2024 11:03AM by PIB Hyderabad

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద, ఎన్‌హెచ్‌పీసీ - చెషైర్ హోమ్ ఇండియా దిల్లీ యూనిట్ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఎంఓయూ కింద, చెషైర్ హోమ్ ఇండియా దిల్లీ యూనిట్‌లో ఉన్న శారీరక & మానసిక దివ్యాంగులకు ఒక సంవత్సరం పాటు వైద్య సంరక్షణ, పోషకాహారాన్ని ఎన్‌హెచ్‌పీసీ అందిస్తుంది. వైద్యులు, నర్సులు, మానసిక వైద్య నిపుణులు, సహాయకులను కూడా నియమిస్తుంది.

ఎన్‌హెచ్‌పీసీ జీఎం (సీఎస్‌ఆర్‌ & ఎస్‌డీ) - చెషైర్ హోమ్ ఇండియా మేనేజింగ్ కమిటీ సభ్యుడు, విశ్రాంత మేజర్ జనరల్ విజయ్ కృష్ణ ఎంఓయూపై సంతకాలు చేశారు. 2024 జనవరి 17న, ఫరీదాబాద్‌లో ఎన్‌హెచ్‌పీసీ డైరెక్టర్ (సిబ్బంది), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సీఎస్‌ఆర్‌ & ఎస్‌డీ) శ్రీ ఉత్తమ్ లాల్ సమక్షంలో ఒప్పందం జరిగింది.

 

***



(Release ID: 1997577) Visitor Counter : 64


Read this release in: English , Urdu , Hindi , Tamil