రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

బిఒటి నమూనాను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనితిన్‌ గడ్కరి.


పెట్టుబడి అనుకూలమైనదిగా, ప్రైవేటు బాగస్వామ్యాలకు ఆకర్షణీయమైనదిగా దీనిని తీర్చిదిద్దనున్నట్టు వెల్లడిరచిన మంత్రి.

ఇది రోడ్డు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాక,దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయగల ప్రభావాన్ని కలిగిఉంటుంది. ఇది ఉపాధి కల్పన సామర్ధ్యాలను పెంపొందిస్తుంది, రవాణా వ్యయాలను తగ్గిస్తుంది: శ్రీనితిన్‌ గడ్కరి.

Posted On: 17 JAN 2024 8:41PM by PIB Hyderabad

బిల్డ్‌ `ఆపరేట్‌ ` ట్రాన్స్‌ఫర్‌ (బిఒటి) ప్రాజెక్టుల కింద పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు , సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు కేంద రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రోడ్డురవాణా రంగానికి చెందిన ,పరిశ్రమవర్గాలు,స్టేక్‌ హోల్డర్లు ,కాంట్రాక్టర్లు, హై వే ఆపరేటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు, బ్యాంకర్లు,ఆర్థిక సంస్థలు, టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌లతో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీనితిన్‌ గడ్కరి, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి శ్రీఅనురాగ్‌ జైన్‌, ఎన్‌.హెచ్‌.ఎ.ఐ ఛైర్మన్‌ శ్రీ సంతోష్‌కుమార్‌ యాదవ్‌, రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు, జాతీయ రహదారుల అధారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు, ఎన్‌,హెచ్‌.డి.సి.ఎల్‌, నీతి ఆయోగ్‌, డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌, డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, డిపార్టమెంట్‌ ఆఫ్‌ లీగల్‌ అఫైర్స్‌,అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ నితిన్‌ గడ్కరి, తాము బిఒటి నమూనాను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దీనిని పెట్టుబడుల అనుకూలమైనదిగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది రోడ్డు రవాణా రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేకాక, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అద్భుతంగా దోహదం చేస్తుందన్నారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన సామర్ధ్యాలను పెంపొందిస్తుందని, రావాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు.

ఈ సదస్సులో సీనియర్‌ ఎన్‌.హెచ్‌.ఎ.ఐ అధికారులు  ప్రతిపాదిత బి.ఒ.టి మోడల్‌ కన్సెషన్‌ అగ్రిమెంట్‌ (ఎం.సి.ఎ) పై ప్రెజెంటేషన్లు, ఇచ్చారు. స్టేక్‌ హోల్డర్లు ప్రస్తావించిన అనుమానాలను నివృత్తి చేయడానికి, అడ్డంకులను తొలగించడానికి ఇది దోహదపడిరది. ప్రతిపాదిత మార్పులలో, వాస్తవ టారిఫ్‌ ఆధారంగా కన్సెషన్‌కాలం,
వాహనాల టోలింగ్‌ , డిజైన్‌ సామర్ధ్యానికి మించి  వాస్తవిక ట్రాఫిక్‌, అధారిటీ వారి కాలయాపనలకు పరిహాంర, ఒప్పందం నుంచి ముందస్తుగా వైదొలగడం వంటి వాటికి సంబంధించి న అంశాలు, వాటికి సంబంధించిన చెల్లింపుల విషయం అదనపుటోల్‌ వే, పోటీ రోడ్‌ విషయంలో బై బ్యాక్‌నిబంధనలు వంటివి ఇందులో పొందుపరిచారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రశ్రీన్‌ (ఇపిసి) లేదా హైబ్రిడ్‌ యాన్యుటి మోడ్‌ లో  (హెచ్‌.ఎ.ఎం) కేటాయిస్తున్నారు. బిఒటి కింద అమలులో ఎదురవుతున్న వివిధ సవాళ్ల కారణంగా ఈ విధానం అమలు చేస్తున్నారు. అయితే బిఓటి విధానాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు పలు ప్రయత్నాలుజరిగాయి. ఒక సారి నిధుల కేటాయింపు, పరిహార హేతుబద్దీకరణ, ప్రీమియం డిఫర్‌మెంట్‌,  రీఫైనాన్సింగ్‌ కు అనుమతి, వంటివాటిని  ఇంతకు ముందు అమలు చేశారు.  ఈ విషయంలో మరింత ముందుకు పోతూ 53 బి.ఒ.టి (టోల్‌ ) ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది.ఈ మార్గాల పొడవు సుమారు 5200 కిలోమీటర్లు. వీటి విలువ 2.1 లక్ష కోట్ల రూపాయలు. 7 ప్రాజెక్టులకు సంబంధించి 27,000 కోట్ల రూపాయల విలువగల 387 కిలోమీటర్ల పొడవు గల మార్గాలను బిఒటి కి బిడ్లు పిలవడం జరిగింది.
భారత ప్రభుత్వ దార్శనికత విజన్‌ 2047 ప్రకారం,దేశంలో హైస్పీడ్‌కారిడార్‌లను పెద్ద్ద ఎత్తున అమలు చేయనున్నారు. ఇందుకు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రభుత్వ దార్శనికత సాకారం కావడంలో కీలకపాత్ర వహించనుంది. ఇది దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. తద్వారా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను దేశంలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుంది.

***



(Release ID: 1997488) Visitor Counter : 68


Read this release in: English , Urdu , Hindi , Punjabi