బొగ్గు మంత్రిత్వ శాఖ
(i) ఎస్‌ఈసిఎల్ మరియు ఎంపిపిజిసిఎల్‌కు సంబంధించిన 1×660 ఎండబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ద్వారా ఈక్విటీ పెట్టుబడిని మరియు (ii) ఎంబిపిఎల్ ద్వారా 2x800 ఎండబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు కేబినెట్ ఆమోదించింది.
Posted On:
18 JAN 2024 12:56PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ రోజు (i)ఎస్‌ఈసిఎల్ మరియు ఎంపిపిజిసిఎల్‌కు సంబంధించిన 1×660 ఎండబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ద్వారా ఈక్విటీ పెట్టుబడిని మరియు (ii) ఎంబిపిఎల్ ద్వారా 2x800 ఎండబ్ల్యూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు ఆమోదం తెలిపింది.
ఎస్‌ఈసిఎల్, ఎంసిఎల్ మరియు సిఐఎల్ ద్వారా ఈక్విటీ పెట్టుబడుల ప్రతిపాదనను ఈ క్రింది విధంగా సిసిఈఏ ఆమోదించింది:
- (ఎ) ఎస్‌ఈసిఎల్ ద్వారా రూ.823 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ (± 20%) డెట్-ఈక్విటీ నిష్పత్తి 70:30 మరియు జేవి కంపెనీలో 49% ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అంచనా ప్రాజెక్ట్ కాపెక్స్ రూ.5,600 కోట్లు (±20 ఖచ్చితత్వం). మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా చచాయ్ గ్రామంలోని అమర్‌కంటక్ థర్మల్ పవర్ స్టేషన్‌లో ఎస్‌ఈసిఎల్ మరియు ఎంపిపిజిఎస్‌ఎల్ యొక్క జేవి ద్వారా ప్రతిపాదిత 1×660 ఎండబ్ల్యూ సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం.
- (బి) ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాలో ప్రతిపాదిత 2×800 మెగావాట్ల సూపర్-క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎంసిఎల్ ద్వారా రూ.4,784 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ (± 20%) అంచనా వేయబడిన ప్రాజెక్ట్ క్యాపెక్స్ ఎంబిపిఎల్ ద్వారా రూ.15,947 కోట్లు (±20 ఖచ్చితత్వం).
- (సి) 2×800 ఎండబ్ల్యూ సూపర్-క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఎంసిఎల్‌కు సంబంధించిన ఎస్‌పివి అయిన ఎంబిపిఎల్‌కి ఆమోదం.
- (డి) పైన పేర్కొన్న (ఏ) ప్రకారం ఎస్‌ఈసిఎల్-ఎంపిపిజిసిఎల్ (రూ.823 కోట్ల ± 20%) జేవి నికర విలువలో 30% కంటే ఎక్కువ సిఐఎల్ ద్వారా ఈక్విటీ పెట్టుబడి మరియు ఎంబిపిఎల్‌లో ఎంసిఎల్ యొక్క 100% పూర్తి అనుబంధ సంస్థ పైన పాయింట్ (బి) వద్ద రూ.4,784 కోట్లు ± 20%.
ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) దేశానికి చౌకైన విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో దాని అనుబంధ సంస్థల ద్వారా రెండు పిట్‌హెడ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తుంది -
- ఎస్‌ఈసిఎల్ మరియు మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కో లిమిటెడ్ (ఎంపిపిజిసిఎల్) జేవి ద్వారా మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, చచై గ్రామంలోని అమర్‌కంటక్ థర్మల్ పవర్ స్టేషన్‌లో 1×660 ఎండబ్ల్యూ సూపర్‌క్రిటికల్ కోల్-బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ (టిపిపి);
- 2×800 ఎండబ్ల్యూ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాలో ఎంసిఎల్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన 'మహానది బేసిన్ పవర్ లిమిటెడ్' (ఎంబిపిఎల్) ద్వారా ఏర్పాటు చేయబడుతుంది.
****
(Release ID: 1997440)
Visitor Counter : 98