శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణరంగంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు– 2024 కోసం నామినేషన్లకు ఆహ్వానం
విజ్ఞాన రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ మరియు విజ్ఞాన్ టీమ్ అనే నాలుగు విభాగాలలో యాభై ఆరు అవార్డులను ప్రకటించారు.
జాతీయ సాంకేతిక దినోత్సవం (11 మే, 2024) రోజున అవార్డులను ప్రకటిస్తారు.
Posted On:
14 JAN 2024 10:54AM by PIB Hyderabad
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగంలో భారత ప్రభుత్వం “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను” ప్రకటించింది.
సాంకేతిక నిపుణులు మరియు ఆవిష్కర్తల అత్యుత్తమ మరియు స్ఫూర్తిదాయకమైన శాస్త్రీయ, సాంకేతిక మరియు ఆవిష్కరణలకు ఈ జాతీయ అవార్డు గుర్తింపు తెస్తుంది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ (ఆర్వీపీ) కోసం శాస్త్ర, సాంకేతికత మరియు సాంకేతికత నేతృత్వంలోని ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ రంగాలలో వ్యక్తులు లేదా బృందాల కోసం నామినేషన్లు/దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
చిత్రం....
అవార్డులు క్రింది నాలుగు విభాగాలలో ఇవ్వబడతాయి:
విజ్ఞాన రత్న (వీఆర్): సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జీవితకాల విజయాలు & సహకారాలను గుర్తించడానికి గరిష్టంగా మూడు అవార్డులు అందించబడతాయి.
విజ్ఞాన్ శ్రీ (వీఎస్): సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశిష్ట సేవలను గుర్తించడానికి గరిష్టంగా 25 అవార్డులు ఇవ్వబడతాయి.
విజ్ఞాన్ యువ: శాంతి స్వరూప్ భట్నాగర్ (వీవైఎస్ఎస్బీ) అవార్డు: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన యువ శాస్త్రవేత్తలను గుర్తించి ప్రోత్సహించడానికి గరిష్టంగా 25 అవార్డులు ఇవ్వబడతాయి.
విజ్ఞాన్ టీమ్ (వీటీ) అవార్డు: సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక బృందంలో అసాధారణమైన సహకారం అందించిన ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు/పరిశోధకులు/ఆవిష్కర్తలతో కూడిన బృందానికి గరిష్టంగా మూడు అవార్డులు అందించబడతాయి.
రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం కింది 13 డొమైన్‌లలో ఇవ్వబడుతుంది, అవి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ & కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సైన్స్ మరియు సాంకేతికత మరియు ఇతరులు.
అన్నిరకాల అవార్డుల కోసం 14 జనవరి 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డ్ పోర్టల్ (https://awards.gov.in/)లో నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. సాధారణ మార్గదర్శకాలు మరియు ఆర్వీపీ వివరాలు అవార్డుల పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. .. ఈ ఏడాది అవార్డులను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)సమన్వయం చేస్తోంది.
అవార్డులు 11 మే 2024 (జాతీయ సాంకేతిక దినోత్సవం) రోజున ప్రకటిస్తారు. అన్ని కేటగిరీల అవార్డుల ప్రదానోత్సవం 23 ఆగస్టు 2024 (జాతీయ అంతరిక్ష దినోత్సవం)న నిర్వహించబడుతుంది.
***
(Release ID: 1997218)
Visitor Counter : 200