వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకాల్లో నవంబర్ 2023 వరకు రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడులు
పిఎల్‌ఐ పథకాలు ఉత్పత్తి/అమ్మకాలు రూ. 8.61 లక్షల కోట్లు మరియు 6.78 లక్షలకు పైగా ఉపాధి కల్పన
భారీస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల గణనీయమైన సహకారంతో పిఎల్‌ఐ పథకాల ఎగుమతులు రూ. 3.20 లక్షల కోట్లు.
Posted On:
17 JAN 2024 4:42PM by PIB Hyderabad
ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాలు నవంబర్ 2023 వరకు రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడి, ఉత్పత్తి/అమ్మకాలు రూ. 8.61 లక్షల కోట్లు మరియు ఉపాధి కల్పన (ప్రత్యక్ష & పరోక్ష) 6.78 లక్షలకు పైగా ఉంది. పిఎల్‌ఐ పథకాలు ఎగుమతులు రూ. 3.20 లక్షల కోట్లుగా ఉంది. వీటిలో భారీ-స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు వంటి రంగాల నుండి గణనీయమైన సహకారం అందించబడింది.
ప్రస్తుతం 14 రంగాలలో 746 దరఖాస్తులు ఆమోదం పొందాయి. వీటి పెట్టుబడుల విలువ రూ. 3 లక్షల కోట్లు. ఇందులో బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్, ఫార్మా, టెలికాం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్ & డ్రోన్స్ వంటి రంగాలలో పిఎల్‌ఐ లబ్ధిదారులలో 176 ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. అనేక ఎంఎస్‌ఎంఈలు పెద్ద కార్పొరేట్‌లకు పెట్టుబడి భాగస్వాములు/ కాంట్రాక్ట్ తయారీదారులుగా పనిచేస్తున్నాయి.
ప్రోత్సాహక మొత్తం సుమారు 8 రంగాలకు పిఎల్‌ఐ పథకాల కింద రూ.4,415 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. పెద్ద-స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ (ఎల్‌ఎస్ఈఎం), ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైసెస్, ఫార్మాస్యూటికల్స్, టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు డ్రోన్స్ & డ్రోన్ కాంపోనెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ, ఛార్జర్‌లు, పిసిబిఏ, పిసిబి, కెమెరా మాడ్యూల్స్, పాసివ్ కాంపోనెంట్ , పలు రకాల ఎలక్ట్రానిక్ భాగాల తయారీ దేశంలో స్థానికీకరించబడింది. కాంపోనెంట్ ఎకోసిస్టమ్ గ్రీన్ షూట్స్‌లో టాటా వంటి పెద్ద కంపెనీలు కాంపోనెంట్ తయారీలోకి ప్రవేశించాయి. పిఎల్‌ఐ లబ్ధిదారులు మార్కెట్ వాటాలో ~ 20% మాత్రమే ఉన్నారు. అయితే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ~ 82% మొబైల్ ఫోన్‌ల ఎగుమతులకు సహకరించారు. 2020-21 ఆర్థికసంవత్సరంలో మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తి 125% కంటే ఎక్కువ పెరిగింది మరియు మొబైల్ ఫోన్‌ల ఎగుమతి ~4 రెట్లు పెరిగింది. ఎల్‌ఎస్‌ఈఎం కోసం పిఎల్‌ఐ పథకం ప్రారంభించినప్పటి నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ~254% పెరిగింది.
పిఎల్‌ఐ పథకం కారణంగా ఫార్మా రంగంలో ముడిసరుకు దిగుమతులు గణనీయంగా తగ్గింది. పెన్సిలిన్-జితో సహా భారతదేశంలో ప్రత్యేకమైన ఇంటర్మీడియట్ మెటీరియల్స్ మరియు బల్క్ డ్రగ్స్ తయారు చేయబడుతున్నాయి. సిటి స్కాన్, లీనియర్ యాక్సిలరేటర్ (ఎన్‌ఐఎన్‌ఏసి), రొటేషనల్ కోబాల్ట్ మెషిన్, సి-ఆర్మ్, ఎంఆర్‌ఐ, క్యాథ్ ల్యాబ్, అల్ట్రాసోనోగ్రఫీ, డయాలసిస్ మెషిన్, హార్ట్ వాల్వ్‌లు, స్టెంట్‌లు మొదలైన 39 వైద్య పరికరాల ఉత్పత్తి ప్రారంభమైంది.
టెలికాం రంగంలో 60% దిగుమతి ప్రత్యామ్నాయం సాధించబడింది మరియు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పిఎల్‌ఐ లబ్దిదారుల కంపెనీల టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల అమ్మకాలు బేస్ ఇయర్ (2019-20)తో పోలిస్తే 370% పెరిగాయి. 90.74% సిఏజిఆర్‌తో డ్రోన్ పరిశ్రమలో పెట్టుబడిపై గణనీయమైన ప్రభావం కనిపించింది.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో పిఎల్‌ఐ పథకం కింద భారతదేశం నుండి ముడి పదార్థాల సోర్సింగ్ గణనీయమైన పెరుగుదలను సాధించింది. ఇది భారతీయ రైతులు మరియు ఎంఎస్‌ఎంఈల ఆదాయాన్ని వృద్ధి చేసింది. ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి మరియు విదేశాల్లో బ్రాండింగ్ & మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బ్రాండ్ దృశ్యమానత మెరుగుపడింది. ఈ పథకం మిల్లెట్ సేకరణను 668 ఎంటి ( 20-21 ఆర్థికసంవత్సరం ) నుండి 3,703 ఎంటీ (22-23ఆర్థిక సంవంత్సరం )కి పెంచడానికి దారితీసింది.
'ఆత్మనిర్భర్'గా మారాలనే భారతదేశ దృష్టిని దృష్టిలో ఉంచుకుని, 14 కీలక రంగాలకు పిఎల్‌ఐ పథకాలు [రూ. ప్రోత్సాహక వ్యయంతో. 1.97 లక్షల కోట్లు (యూఎస్$26 బిలియన్లకు పైగా)] భారతదేశ తయారీ సామర్థ్యాలు మరియు ఎగుమతులను మెరుగుపరచడానికి అమలులో ఉన్నాయి.
ఈ కీలకమైన నిర్దిష్ట రంగాలలో పిఎల్‌ఐ పథకం భారతీయ తయారీదారులను ప్రపంచవ్యాప్త పోటీకి సిద్ధం చేయడానికి, ప్రధాన యోగ్యత మరియు అత్యాధునిక సాంకేతికత రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమర్థతలను నిర్ధారించడం; స్థాయి ఆర్థిక వ్యవస్థలను సృష్టించడం; ఎగుమతులను మెరుగుపరచడం మరియు ప్రపంచ విలువ గొలుసులో భారతదేశాన్ని అంతర్భాగంగా మార్చండానికి ఉపయోగపడుతోంది.
పిఎల్‌ఐ పథకాలు భారతదేశ ఎగుమతుల్లో సాంప్రదాయ వస్తువుల నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ వస్తువులు, ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులు మొదలైన అధిక విలువ-ఆధారిత ఉత్పత్తులకు మార్చాయి.
***
(Release ID: 1997154)
Visitor Counter : 204