సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు డీఈపీడబ్ల్యూడీ & ఎన్‌హెచ్‌ఆర్‌డీఎన్‌ ఒప్పందం

Posted On: 16 JAN 2024 12:06PM by PIB Hyderabad

దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెంపు దిశగా కీలక అడుగు పడింది. గోవాలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్‌ పర్పుల్ ఫెస్ట్' ముగింపు రోజున, కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూడీ) & జాతీయ మానవ వనరుల అభివృద్ధి నెట్‌వర్క్ (ఎన్‌హెచ్‌ఆర్‌డీఎన్‌) ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పీఎం-దక్ష్-డీఈపీడబ్ల్యూడీ డిజిటల్ పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను పెంచడం ఈ వ్యూహాత్మక ఒప్పందం లక్ష్యం.

దివ్యాంగుల సాధికారత విభాగం వ్యాప్తిని పెంచడంలో, దేశవ్యాప్తంగా హెచ్‌ఆర్ నిపుణులతో సంబంధాలు పెంచుకోవడంలో ఈ అవగాహన ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. దివ్యాంగులకు అర్ధవంతమైన ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలను విస్తరించడం, మరింత సమగ్రమైన & విభిన్నమైన శ్రామికశక్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం.

***



(Release ID: 1996830) Visitor Counter : 107