కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

2023 నవంబర్ నెలలో ఈఎస్ఐ పథకం కింద కొత్తగా చేరిన 15.92 లక్షల మంది కార్మికులు


ఈఎస్ఐ సభ్యత్వం పొందిన 25 ఏళ్లలోపు 7.47 లక్షల మంది యువ ఉద్యోగులు

ఈఎస్ఐ పథకంలో చేరిన 3.17 లక్షల మంది మహిళా ఉద్యోగులు

2023 నవంబర్ నెలలో ఈఎస్ఐ పథకం కింద కొత్తగా రిజిస్టర్ అయిన 20,830 సంస్థలు

2023 నవంబర్ నెలలో 58 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులకు ఈఎస్ఐ పథకం ప్రయోజనాలు

Posted On: 16 JAN 2024 11:05AM by PIB Hyderabad

2023 నవంబర్ నెలలో ఈఎస్ఐ పథకం లో కొత్తగా 15.92 లక్షల మంది ఉద్యోగులు సభ్యత్వం పొందారు. తాజాగా విడుదల అయిన  ఈఎస్ఐసీ తాత్కాలిక పేరోల్ డేటా లో ఈ వివరాలు ప్రకటించారు.

తాజా ఈఎస్ఐసీ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం   2023 నవంబర్ నెలలో 20,830 కొత్త సంస్థలు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి  వచ్చాయి. దీనివల్ల ఎక్కువ మంది కార్మికులకు పథకం ప్రయోజనాలు అందుతాయి.

ఈ నెలలో మొత్తం 15.92 లక్షల మంది ఉద్యోగులు  ఈఎస్ఐ పథకంలో చేరారు.వీరిలో  7.47 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు పొందారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారని గణంకాలు చెబుతున్నాయి. 47 శాతం మంది యువతకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2023 నవంబర్ నెలలో  సభ్యుల నికర నమోదులో మహిళా ఉద్యోగుల సంఖ్య  3.17 లక్షలుగా ఉందని పేరోల్ డేటాను జెండర్ల వారీగా విశ్లేషిస్తే తెలుస్తోంది. 2023 నవంబర్ నెలలో మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులు ఈఎస్ఐ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి తన ప్రయోజనాలను అందించడానికి ఈఎస్ఐసి కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది.

డేటా జనరేషన్ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుంది.  పేరోల్ డేటా తాత్కాలికం సమాచారం మాత్రమే. 

 

***



(Release ID: 1996826) Visitor Counter : 79