రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
2030 నాటికి ప్రమాద మరణాలను 50% తగ్గించాలనే లక్ష్యంతో రోడ్డు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీ నితిన్ గడ్కరీ చెప్పారు.
प्रविष्टि तिथि:
16 JAN 2024 1:03PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 2030 నాటికి ప్రమాద మరణాలను 50% తగ్గించాలనే లక్ష్యంతో రోడ్డు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 'రోడ్ సేఫ్టీ - ఇండియన్ రోడ్స్@2030- రైజింగ్ ది బార్'పై సి ఐ ఐ జాతీయ సదస్సులో రోడ్డు భద్రత పై ప్రసంగిస్తూ ' శ్రీ గడ్కరీ మాట్లాడుతూ ' 4 ఈ ఆఫ్ రోడ్ సేఫ్టీ' -ఇంజనీరింగ్ (రోడ్డు & వాహన ఇంజనీరింగ్) - ఎన్‌ఫోర్స్‌మెంట్ (అమలు )- విద్య మరియు అత్యవసర వైద్య సేవను బలోపేతం చేయడంపై దృష్టి సారించడంతో పాటు సామాజిక ప్రవర్తనలో మార్పు చాలా ముఖ్యమైనది. రోడ్డు భద్రతను పెంపొందించేందుకు వాటాదారులందరి సహకారంపై ఆయన ఉద్ఘాటించారు.
రోడ్డు ప్రమాదాలపై తాజా నివేదిక 2022 ప్రకారం 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.68 లక్షల మరణాలు, 4 లక్షల తీవ్ర గాయాలు జరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు.ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయని, రోడ్డు ప్రమాదాల మరణాలు 10% పెరిగాయని, దీని ఫలితంగా జీ డీ పీ కి 3.14% సామాజిక-ఆర్థిక నష్టం వాటిల్లిందని శ్రీ గడ్కరీ చెప్పారు. 60% మరణాలు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువకులేనని ఆయన అన్నారు .ప్రమాద మరణం అనేది కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోవడం, యజమానికి వృత్తిపరమైన నష్టం ఆర్థిక వ్యవస్థకు మొత్తం నష్టం అని ఆయన అన్నారు.
పౌరులలో ట్రాఫిక్ సతప్రవర్తనకు రివార్డుల వ్యవస్థ నాగ్‌పూర్‌లో సానుకూల ఫలితాలను ఇచ్చిందని శ్రీ గడ్కరీ అన్నారు. డ్రైవర్లకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహించాలని కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు మరియు సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఉచిత శిబిరాలు నిర్వహించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలు, ఎన్‌జిఓ, స్టార్టప్‌లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, ఐఐటి, యూనివర్సిటీలు, ట్రాఫిక్ మరియు హైవే అథారిటీల సహకారంతో రోడ్డు భద్రత ఉత్తమ పద్ధతులను విద్య మరియు అవగాహన వ్యాప్తి చేయడం మన ముందున్న మార్గమని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 1996824)
आगंतुक पटल : 181