బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిషాలో 2400 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్రాజెక్టును బిహెచ్ఇఎల్‌కు ప్ర‌దానం చేసి ఎన్ఎల్‌సిఐఎల్‌


ప్రాజెక్టు ఝ‌ర్సుగూడ జిల్లాలో రానుంది; ఉప‌యోగించ‌నున్న ప‌ర్యావ‌ర‌ణ అనుకూల, ఆధునిక సాంకేతిక‌త‌

త‌క్కువ ధ‌ర‌కు విద్యుత్‌తో ల‌బ్ధి పొంద‌నున్న త‌మిళ‌నాడు, ఒడిషా, కేర‌ళ‌, పుదుచ్చేరీ

Posted On: 13 JAN 2024 11:34AM by PIB Hyderabad

ఐసిబి మార్గం ద్వారా పోటీ టెండ‌ర్ల‌ను ఆహ్వానించిన అనంత‌రం ఒడిషాలోని ఘ‌రు్స‌గూడ జిల్లాలో 2,400 మెగావాట్ల సామ‌ర్ధ్యంతో (3 x 800 మెగావాట్ల - స్టేజ్ I)పిట్ హెడ్ (బొగ్గు నీరు, భూమి, ర‌వాణా సౌక‌ర్యాలు, బొగ్గు గ‌నుల‌కు సామీప్యం, లోడ్ సెంట‌ర్లు క‌లిగి ఉండ‌డం)  థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు బిహెచ్ ఇఎల్‌కు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని న‌వ‌ర‌త్న కంపెనీ అయిన ఎన్ఎల్ సి లిమిటెడ్ ఇపిసి కాంట్రాక్టును ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అల్ట్రా సూప‌ర్ క్రిటిక‌ల్ టెక్నాల‌జీ (నీటి సందిగ్ధ ఉష్ణోగ్ర‌త‌లు, పీడ‌నాల సాంకేతిక‌త‌) ఆధారంగా ప‌ని చేస్తుంది.  మొత్తం 2400 మెగావాట్ల విద్యుత్తు త‌మిళ‌నాడు, ఒడిషా, కేర‌ళ‌, పుదుచ్చేరి రాష్ట్రాల‌తో ముడిప‌డి ఉండ‌ట‌మే కాదు ఈ మేర‌కు ఇప్ప‌టికే పిపిఎలు అమ‌లు చేయ‌డం జ‌రిగింది. కాంట్రాక్టు ప‌రిధిలో 3 X800 మెగావాట్ల - 2400 మెగావాట్ల‌ స్టేజ్-I కోసం ఎస్‌సిఆర్ వంటి ప‌రిక‌రాల ఇంజినీరింగ్‌, త‌యారీ, స‌ర‌ఫ‌రా, ఏర్పాటు,బాయిల‌ర్లు, ట‌ర్బైన్, జ‌న‌రేట‌ర్లు, బ్యాలెన్స్ ఆఫ్ పాయింట్లు, ఎఫ్‌జిడి,  ప్రారంభించ‌డాలు ఉన్నాయి.
ఈ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు కోసం ఒడిషాలోని సంభ‌ల్‌పూర్‌, ఝ‌ర్సుగూడలో 2020 నుంచి  ప్రారంభ‌మైన ఎన్ ఎల్ సిఐఎల్ త‌లాబిరా II& III గ‌నులు నుంచి ఏడాదికి 200 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు అనుసంధానం ఉంటుంది. ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన నీటిని హీరాకుడ్ రిజ‌ర్వ‌యార్‌తో అనుసంధాన‌మైంది. ఉత్ప‌త్తి అయిన విద్యుత్తును ఐఎస్‌టిఎస్‌లు, ఎస్‌టియు నెట్‌వ‌ర్క్ ద్వారా త‌ర‌లిస్తారు. 
ఎంఇఎఫ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎఫ్‌జిడి, ఎస్‌సిఆర్ వంటి తాజా కాలుష్య‌నియంత్ర‌ణ ప‌రిక‌రాల‌తో ప్రాజెక్టు పురోగ‌మిస్తుంది. బ‌యోమాస్ (జీవద్ర‌వ్యం) నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల (గ్రీన్‌) చొర‌వ‌లో భాగంగా బ‌యోమాస్  కోఫైరింగ్ (ఒకే జ్వ‌ల‌న వ్య‌వ‌స్థ‌లో రెండు వేర్వేరు ఇంధ‌నాల జ్వ‌ల‌నం)కు స‌రిపోయేలా బాయిల‌ర్ల‌ను రూపొందిస్తారు. 
మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల చొర‌వ‌లో భాగంగా జీవ‌ద్ర‌వ్య కోఫైరింగ్‌కు త‌గిన‌ట్లుగా బాయిల‌ర్ల‌ను రూపొందిస్తారు. 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి యూనిట్‌ను ఆర్ధిక సంవ‌త్స‌రం 2028-29 సంద‌ర్భంగా ప్రారంభిస్తారు. పిట్‌హెడ్ థ‌ర్మ‌ల్ ప్రాజెక్టు అయినందున ధీని ధ‌ర మారుతూ , పోటీగా ఉంటుంది. కాగా, ఎన్ఎల్‌సి ఇండియా త‌న ల‌బ్ధిదారుల కోసం త‌క్కువ ధ‌ర‌కు విద్యుత్తును ఉత్ప‌త్తి చేసి, అందిస్తుంది. 

***


(Release ID: 1996116) Visitor Counter : 226