రక్షణ మంత్రిత్వ శాఖ
యుకె ప్రధానిని లండన్‌లో మర్యాదాపూర్వకంగా కలిసిన రక్షణ మంత్రి
శాంతియుతమైన, స్థిరమైన నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని బలోపేతం చేసేందుకు యుకె& భావసారూప్యత కలిగిన ఇతర దేశాలు భారత్‌తో కలిసి పని చేయాలిః శ్రీ రాజ్‌నాథ్ సింగ్
యుకె-భారత్ సంబంధాల రక్షణ& భద్రతా సంబంధాల స్తంభాన్ని బలోపేతం చేసేందుకు ఆసక్తితో ఉన్నాం ః శ్రీ రిషి సునాక్
Posted On:
11 JAN 2024 9:05AM by PIB Hyderabad
భారత రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జనవరి 10, 2024న యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి శ్రీ రిషీ సునాక్‌ను లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమావేశం స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఇరు దేశాల నాయకుల దిశానిర్దేశంలో ఆధునిక, బహుముఖీయ, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యంగా చారిత్రక సంబంధాలను రూపొందించడం, పునర్నిర్మించడంలో రెండు దేశాలూ గణనీయమైన పురోగతిని సాధించాయని రక్షణ మంత్రి పట్టి చూపారు.
ఇటీవల రక్షణలో ద్వైపాక్షిక సహకారం, ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్ధా్యల పెంపు, ఇంటర్ ఆపరబిలిటీ పెరగడంతో పాటుగా కీలకమైన సముద్ర రంగంలో సైన్యం నుంచి సైన్యం సంబంధాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. సాంకేతిక రంగం సహా రక్షణ పరిశ్రమలో సహకారాన్ని పెంచేందుకు కొనసాగుతున్న కృషిని గురించి ఉద్ఘాటించారు. యుకె రక్షణ పరిశ్రమతో జరిగిన సానుకూల సంభాషణల గురించి, ద్వైపాక్షిక రక్షణ సంబంధంలో నూతన సానుకూల శక్తి గురించి ఆయన రిషీ సునాక్‌కు క్తుప్తంగా వివరించారు.
శాంతియుతమైన, స్థిరమైన నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని బలోపేతం చేసేందుకు యుకె, భావసారూప్యత కలిగిన ఇతర దేశాలు కూడా భారత్‌తో కలిసి పని చేయాలని రక్షణ మంత్రి పేర్కొన్నారు. భారతదేశాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా దాని అనితరసాధ్యమైన పెరుగుదలతో సహా, స్నేహపూర్వక సహకారంతో బలోపేతం చేయవచ్చు, వేగవంతం చేయవచ్చు.
21వ శతాబ్దం మధ్య నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే జాతీయ లక్ష్యం దిశగా 1.4 బిలియన్ల భారతీయుల అన్వేషణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ కృషి విశేషమైన ఫలాలను అందించిందని, పెరుగుదలలో స్థిరమైన వృద్ది ఉందని, పేదరికం గణనీయంగా తగ్గి, వ్యాపారానికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటు అయిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేసేందుకు యుకె వంటి స్నేహపూర్వక దేశాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉండేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాలలో యుకె, భారతదేశం పని చేయవలసిన అవసరాన్ని గురించి రక్షణ మంత్రి చెప్పిన అంశాలతో ప్రధానమంత్రి సునాక్ పూర్తిగా అంగీకరించారు.
ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో తమ వంటి సంస్థలతో బలమైన భారత ప్రభుత్వ మద్దతు కలిగిన వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాలను ద్వైపాక్షిక సంబంధాల రక్షణ, భద్రత పునాదిని బలోపేతం చేయడం పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.
ఈ సమావేశం సందర్భంగా యుకె ప్రధానికి రామ్ దర్బార్ విగ్రహాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అందచేశారు. ఈ సమావేశానికి యుకె ఎన్ఎస్ఎ సర్ టిమ్ బారో కూడా హాజరయ్యారు.
విదేశాంగ, కామన్‌వెల్త్, డెవలప్‌మెంట్ కార్యాలయంలో యుకె విదేశాంగ మంత్రి లార్డ్ డేవిడ్ కెమరూన్‌ను కూడా రక్షణ మంత్రి కలుసుకున్నారు. వివిధ స్థాయిల్లో భారత్-యుకె భాగస్వామ్యం నూతన వేగాన్ని, దిశను పుంజుకోవడం పట్ల మంత్రులిద్దరూ సంతృప్తిని వ్యక్తం చేశారు.
స్థితిస్థాపకతను నిర్మంచేందుకు ఇరు దేశాలకు చెందిన సరఫరా గొలుసుల సమ్మిళితం చేయడం సహా రక్షణ పరిశ్రమలను సమగ్రపరచాలన్న లక్ష్యాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రేఖామాత్రంగా వివరించారు. అంతేకాకుండా, భారత్, యుకెలు కలిసి అమలు చేయగల ఉమ్మడి ప్రాజెక్టుల గుర్తింపు, చర్చతో పాటుగా ద్వైపాక్షిక స్టార్టప్ స్థాయి ఇంటరాక్షన్ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమానికి మద్దతును బలోపేతం చేసేందుకు ఒక మార్గంగా యుకె భావిస్తున్న రక్షణ పరిశ్రమల సహకారం సహా రక్షణ రంగంలో భారత్‌తో సహకరించాలని యుకె ప్రభుత్వం కోరుకుంటోందని విదేశాంగ మంత్రి కెమరూన్ పునరుద్ఘాటించారు.
అనంతరం, రక్షణ మంత్రి లండన్‌లోని ఇండియా హౌజ్‌లో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో ముచ్చటించారు. భారత మూలాలకు చెందిన దాదాపు 160మంది ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనేకమంది భారతీయ సైనిక దళ మాజీ ఉద్యోగులు, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యులు కొందరు కూడా హాజరయ్యారు.
***
(Release ID: 1995283)
Visitor Counter : 129