ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమానికి సింహాద్వారంగా గిఫ్ట్ సిటీ’
గాంధీనగర్‌లో జరిగిన 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
11 JAN 2024 12:52PM by PIB Hyderabad
గిఫ్ట్ సిటీ ఆర్థిక, పెట్టుబడులకు కేంద్రంగా ఉండి ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దృక్పథాన్ని నెరవేర్చడంలో గిఫ్ట్ సిటీ ముఖ్యమైన పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి
నిర్మలా సీతారామన్ అన్నారు. ఈరోజు గాంధీనగర్లో నిర్వహించిన 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ -2024లో భాగంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్ సిటీ-యాన్ ఆస్పిరేషన్ ఆఫ్ మోడ్రన్ ఇండియా’ సెమినార్లో నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గిఫ్ట్ సిటీ ఆలోచనను రూపొందించారని, అది ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా విస్తరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. గ్రీన్ టెక్నాలజీ పరంగా ప్రధాన మంత్రి దృష్టిని వివరిస్తూ.. గ్రీన్ క్రెడిట్లకు గిఫ్ట్ సిటీ వేదికగా ఉండాలని మంత్రి సీతారామన్ అన్నారు. 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లుగా మారాలనే లక్ష్యాన్ని సాధించడానికి విభిన్నమైన ఫిన్టెక్ ప్రయోగశాలను నిర్మించాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి సూచించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ) లో పెరుగుతున్న కార్యకలాపాల ఉనికిని జాబితా చేస్తూ.. GIFT సిటీలో ఇప్పుడు ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్తో సహా 3 ఎక్స్ఛేంజీలు, 9 విదేశీ బ్యాంకులు, 26 ఎయిర్క్రాఫ్ట్ లెస్సర్, 80 ఫండ్ మేనేజర్లు, 50 ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్లు మరియు 40 ఫిన్టెక్ ఎంటిటీలతో సహా 25 బ్యాంకులు ఉన్నాయని మంత్రి శ్రీమతి సీతారామన్ వివరించారు. షిప్పింగ్ వ్యవహారాలకు భారతదేశం తయారీ కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవాలని.. గ్లోబల్ ఫైనాన్స్‌కు ప్రాప్యతను కల్పించే ఐఎస్ఎస్సీలో 8 షిప్ లీజింగ్ సంస్థలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. భారతదేశంలోని స్టాక్ మార్కెట్లలో రిటైల్ భాగస్వామ్యం ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక రంగ సంస్కరణల యొక్క మరొక ప్రత్యేక లక్షణమని శ్రీమతి. సీతారామన్ వ్యాఖ్యానించారు. గిఫ్ట్ సిటీని సాంకేతికత మరియు ఆర్థిక ప్రపంచం యొక్క సమ్మేళనంగా అభివర్ణించిన కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్థిక సేవలలో సాంకేతికత యొక్క ప్రయోజనాలను చొప్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గిఫ్ట్ సిటీ గ్లోబల్ ఫైనాన్స్‌ను యాక్సెస్ చేయడంలో భారతదేశ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలను అందించడానికి రూపొందించబడింది. అంతకుముందు చాలా గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌లు రాజధానిలో మాత్రమే కనిపించాయని, అయితే గిఫ్ట్ సిటీకి సాంకేతికతతో కూడిన ఆర్థిక సేవలను పొందడంలో ప్రత్యేకత ఉందని సీతారామన్ వివరించారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వృద్ధి ఇంజిన్‌ను నడుపుతోందని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచానికి మరియు గ్లోబల్ సౌత్‌కు మధ్య ఇది వారధిగా మారగలదని అన్నారు.
భారతదేశం ప్రపంచ వేదికపై ఆర్థిక ప్రాముఖ్యత యొక్క మార్గంలో కొనసాగుతున్నందున, భారతదేశ ప్రజలు ఆవిష్కర్తలు మరియు వ్యవస్థాపకులుగా మారాలనుకుంటున్నారు మరియు ఈ ఆకాంక్షలను సాకారం చేయడంలో గిఫ్ట్ సిటీ సహాయపడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. సెమినార్ ప్రారంభ సెషన్‌లో గుజరాత్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీ కనుభాయ్ దేశాయ్, గిఫ్ట్ సిటీ చైర్మన్ శ్రీ హస్ముఖ్ అధియా, ఐఎఫ్ఎస్సీఏ చైర్మన్ శ్రీ కె. రాజారామన్, గిఫ్ట్ సిటీ ఎండీ & సీఈఓ శ్రీ తపన్ రే పాల్గొన్నారు.
***
(Release ID: 1995282)
Visitor Counter : 190