పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అయోధ్య- అహ్మదాబాద్ విమాన సర్వీసులు ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
యుపిలో త్వరలో మరో 5 విమానాశ్రయాలు..శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
2024 చివరి నాటికి జోవార్ అంతర్జాతీయ విమానాశ్రయం..శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
రెండో దశలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం 5 లక్షల చదరపు అడుగులకు, రన్ వే 3700 మీటర్లకు పొడిగించి 3000 మంది ప్రయాణికులకు సేవలు....శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా
Posted On:
11 JAN 2024 2:16PM by PIB Hyderabad
న్యూఢిల్లీ నుంచి అయోధ్య- అహ్మదాబాద్ మధ్య నేరుగా నడిచే విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈరోజు ప్రారంభించారు.దీంతో అయోధ్యకు అహ్మదాబాద్ నుంచి వారానికి మూడు డైరెక్ట్ విమానాల సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జయవీర్ సింగ్, అయోధ్య పార్లమెంటు సభ్యులు శ్రీ లల్లూ సింగ్ , అహ్మదాబాద్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి పాల్గొన్నారు.
ఇండిగో ఈ మార్గంలో సేవలు అందిస్తుంది. ఈ క్రింది షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ - అయోధ్య - అహ్మదాబాద్ (వారానికి మూడుసార్లు) మధ్య 11 జనవరి 2024 నుంచి విమాన సర్వీస్ ప్రారంభమవుతుంది:
ఆర్ఈ 6345 సర్వీస్ (ఎయిర్ బస్) అహ్మదాబాద్ - అయోధ్య మంగళ,గురు, శనివారాల్లో నడుస్తుంది. ఉదయం 9.10కి అహ్మదాబాద్ లో బయలుదేరే విమానం 11.00 గంటలకు అయోధ్య చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో ఆర్ఈ 112 అయోధ్య నుంచి ప్రతి మంగళ,గురు, శనివారాల్లో 11.30కి బయలుదేరి అహ్మదాబాద్ కు 13.40కి చేరుతుంది.
విమాన సర్వీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన శ్రీ జ్యోతిరాదిత్య అయోధ్య, అహ్మదాబాద్ ల మధ్య ప్రారంభమైన డైరెక్ట్ ఫ్లైట్ రెండు నగరాల మధ్య విమాన సర్వీసులు పెంచుతుందని అన్నారు. అయోధ్య, అహ్మదాబాద్ నగరాలు భారతదేశానికి సరైన అర్ధం ఇస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్భారతదేశ ఆర్థిక శక్తికి , అయోధ్య భారతదేశ ఆధ్యాత్మిక, నాగరికత శక్తికి నిదర్శనం అని అన్నారు రెండు నగరాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక, ప్రయాణ పర్యాటక రంగం వృద్ధి సాధ్యమవుతుందన్నారు.
20 నెలల రికార్డు సమయంలో అయోధ్య విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించడంలో సహకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌కు శ్రీ సింధియా ధన్యవాదాలు తెలిపారు.
విమానాశ్రయాలు కేవలం 'విమానాశ్రయాలు' గా మాత్రమే కాకుండా ఒక ప్రాంతం నైతికత, సంస్కృతి చరిత్ర కు ముఖద్వారాలుగా ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా విమానాశ్రయం నెరవేరుస్తుందని మంత్రి అన్నారు. మహర్షి రామ మందిరం స్ఫూర్తితో వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం బయట నిర్మాణం రూపు దిద్దుకుంది. రాముడి జీవిత ప్రయాణాన్ని వర్ణించే విధంగా టెర్మినల్ భవనంలో అందమైన పెయింటింగ్స్ కళాఖండాలు ఏర్పాటు చేశారు.
గత 9 ఏళ్లలో పౌర విమానయాన రంగంలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించిందని శ్రీ సింధియా తెలిపారు. లో కేవలం 2014లో ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయంతో సహా రాష్ట్రంలో 10 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి వివరించారు. వచ్చే నెల నాటికి, యూపీలో అజంగఢ్, అలీఘర్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్‌లలో విమానాశ్రయాలు ఏర్పాటు అవుతాయని శ్రీ సింధియా తెలిపారు. 2024 చివరి నాటికి జెవార్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధంగా ఉంటుంది. మొత్తంగా భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ 19 విమానాశ్రయాలను కలిగి ఉంటుందని వెల్లడించారు.
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించామని, అత్యధికంగా ఒకసారి 600 మంది విమాన ప్రయాణికులకు సేవలు అందుతాయని శ్రీ సింధియా వివరించారు. త్వరలో విమానాశ్రయాన్ని 50,000 చదరపు మీటర్లకు విస్తరిస్తామని, ప్రయాణికుల సామర్థ్యాన్ని 3000 కి పెంచుతామని మంత్రి తెలిపారు. తదుపరి దశలో 2200 మీటర్ల పొడవు ఉన్న రన్‌వే 3700 మీటర్లకు విస్తరించి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో విమాన సేవలు ఎక్కువ చేసేందుకు గత 9 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో 2014లో 18 నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 41 నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా, రాష్ట్రంలో 2014లో వారంలో 700 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి.ప్రస్తుతం వారంలో 1654 విమాన సర్వీసులో నడుస్తున్నాయి. కదలికలు పెరిగాయి.
మహర్షి వాల్మీకి అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని నిర్ణీత సమయంలో పూర్తి చేసినందుకు శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య నుంచి ప్రారంభమైన నూతన విమాన సర్వీస్ పర్యాటకం, వాణిజ్యం , పెట్టుబడులకు మరిన్ని మార్గాలు తెరుస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్లున్మాంగ్ వుల్నామ్, సంయుక్త కార్యదర్శి శ్రీ అసుంగ్బా చుబా ఆవో, ఇండిగో స్పెషల్ డైరెక్టర్ శ్రీ ఆర్కే సింగ్ కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1995281)
Visitor Counter : 159