వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశం మరియు యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని యూఎస్‌ $100 బిలియన్లకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాయి: శ్రీ. పీయూష్ గోయల్


భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్ వంటివి భారతదేశం-యుఏఈ సహకారాన్ని మరియు రూపాయిని ప్రోత్సహించడానికి అలాగే రూపాయి మరియు దిర్హామ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహిస్తున్నాయని గోయల్ హైలైట్ చేశారు

యూఏఈ-భారత్ భాగస్వామ్యంలో విస్తృత సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి యూఏఈ-ఇండియా బిజినెస్ సమ్మిట్: శ్రీ.గోయల్

భారతదేశం-యుఏఈ భాగస్వామ్యం అనేది 21వ శతాబ్దాన్ని నిర్వచించే కూటమి. ఇది భాగస్వామ్య చరిత్రలో మరియు పరస్పర పురోగతి కోసం ఆకాంక్షలతో నిండింది: శ్రీ. గోయల్

డబ్ల్యూటీఓ ఎంసి 13కి అధ్యక్షత వహించడంలో డాక్టర్ థాని నాయకత్వాన్ని శ్రీ.గోయల్ ప్రశంసించారు మరియు భారతదేశం నుండి పూర్తి మద్దతుకు హామీ ఇచ్చారు

Posted On: 10 JAN 2024 8:38PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారతదేశం మరియు యూఏఈ తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని యూఎస్‌ $ 100 బిలియన్లకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో జరిగిన 'యుఏఈ ఇండియా బిజినెస్ సమ్మిట్'లో మంత్రి ప్రసంగిస్తూ..అంతరిక్ష పరిశోధన, భద్రత, విద్య, మరియు వాతావరణ సహకారంతో కూడిన భారతదేశం-యుఏఈ భాగస్వామ్యం  బహుముఖ స్వభావాన్ని నొక్కిచెప్పారు.

ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి పరిశ్రమలు మరియు వ్యాపారాల నుండి కొత్త ప్రతిపాదనల కోసం చూస్తున్నాయని శ్రీ గోయల్ చెప్పారు. ఇండియా యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగిందన్నారు. భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఆర్థిక కారిడార్ మరియు రూపాయిని ప్రోత్సహించడానికి మరియు రూపాయి మరియు దిర్హామ్‌ల మధ్య ప్రత్యక్ష వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి చొరవ వంటి కీలక సహకారాలను కూడా ఆయన హైలైట్ చేశారు.

ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉన్నందుకు సంతోషించిన మంత్రి, యూఏఈ ఇండియా బిజినెస్ సమ్మిట్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.యూఏఈ-భారతదేశం భాగస్వామ్యం అందించే విస్తారమైన సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని నొక్కి చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో యూఏఈ అధ్యక్షుడు హెచ్‌.హెచ్‌. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క అసాధారణ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.

కొత్త భాగస్వామ్యాలను అన్వేషించడం, అవకాశాలను గుర్తించడం, వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంలో అనంతమైన అవకాశాలను మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశం-యుఏఈ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దపు నిర్వచించే కూటమిగా ఆయన వర్ణించారు. ఇది భాగస్వామ్య చరిత్ర మరియు పరస్పర పురోగతి కోసం ఆకాంక్షలతో పాతుకుపోయిందన్నారు.

భారతదేశం మరియు యూఏఈ మధ్య శాశ్వతమైన స్నేహాన్ని పెంపొందించడంలో అమూల్యమైన సహకారాన్ని అందించినందుకుగాను యూఏఈ  విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి హెచ్‌.ఈ. డా. థాని బిన్ అహ్మద్ అల్ జెయోడి; మరియు డిపి వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ మరియు సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం శ్రీ గోయల్ తన కృతజ్ఞతలు తెలిపారు.

సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం మార్గదర్శకత్వంలో జెబెల్ అలీ ఫ్రీ జోన్‌లో భారత్ పార్క్‌ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ప్రస్తావిస్తూ వివిధ రంగాలలో యూఏఈ-భారత్ వ్యాపార సంబంధాన్ని పెంపొందించడంలో వారి కీలక పాత్రలను శ్రీ గోయల్ గుర్తించారు. ఈ చొరవ రెండు దేశాలు మరియు వెలుపల అంతర్జాతీయ వాణిజ్యానికి అనేక అవకాశాలను తెరుస్తుందని, భారతదేశం యొక్క ప్రపంచ దృశ్యమానతను గణనీయంగా పెంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్ యూసుఫ్ అలీ అబ్దుల్‌ఖాదర్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషిని కూడా మంత్రి హైలైట్ చేశారు. కాశ్మీర్‌లో షాపింగ్ మాల్ ఏర్పాటు వంటి భారతదేశ వృద్ధి కథనంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం గురించి ప్రస్తావించారు.

దేశాల మధ్య అభివృద్ధి చెందుతున్న రక్షణ, సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలపై దృష్టిని ఆకర్షించిన శ్రీ గోయల్ యూఏఈ రాజకీయ స్థిరత్వం, వ్యాపార-స్నేహపూర్వక విధానాలు మరియు మౌలిక సదుపాయాల పురోగతి పరస్పర వృద్ధికి మరియు శ్రేయస్సుకు అనుకూలమైన కారకాలుగా ఉన్నాయని ప్రశంసించారు.

ఫిబ్రవరిలో అబుదాబిలో జరగనున్న డబ్ల్యూటీఓ మంత్రివర్గ సమావేశం 13కి అధ్యక్షత వహించనున్న డా. థాని నాయకత్వాన్ని శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు మరియు దీనిని విజయవంతం చేయడంలో భారతదేశం నుండి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

భారతదేశం యొక్క జనాభా ప్రయోజనం మరియు దాని యువ, ఆకాంక్షగల జనాభాను ఉటంకిస్తూ మంత్రి భారతదేశ వృద్ధి కథలో పాల్గొనవలసిందిగా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. గణనీయమైన రాబడిని అందించడానికి మరియు తన 1.4 బిలియన్ల ప్రజల కలలు మరియు ఆకాంక్షలకు దోహదం చేసే దేశం యొక్క సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు.

అచంచలమైన ఆశావాదం మరియు భవిష్యత్తు కోసం భాగస్వామ్య దృక్పథాన్ని వివరించిన మంత్రి..రెండు దేశాలపై శాశ్వత ప్రభావాన్ని చూపే శాశ్వత భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికి భారతదేశం మరియు యుఏఈల నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 1995135) Visitor Counter : 121