భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

అంటార్కిటిక్ యాత్ర కోసం తొలిసారిగా బయలుదేరిన హిందూ మహాసముద్ర దేశాల శాస్త్రవేత్తలు - 'కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌'

Posted On: 10 JAN 2024 5:38PM by PIB Hyderabad

'కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌' (సీఎస్‌సీ) దేశాల మధ్య సముద్ర రంగ సహకారంలో మరో ముందడుగు పడింది. గోవాలోని 'నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్' నేతృత్వంలో, భారతదేశ 43వ అంటార్కిటిక్ యాత్రలో మారిషస్‌, బంగ్లాదేశ్‌ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. మారిషస్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, బంగ్లాదేశ్‌కు చెందిన ఒక శాస్త్రవేత్త 20 డిసెంబర్ 2023న కేప్‌టౌన్‌లో నౌకలోకి ఎక్కారు.

2022 నవంబర్‌లో గోవా, హైదరాబాద్‌లో జరిగిన తొలి సీఎస్‌సీ 'ఓషనోగ్రాఫర్స్ అండ్ హైడ్రోగ్రాఫర్స్ కాన్ఫరెన్స్' ఫలితంగా ఈ యాత్రలో పొరుగు దేశాల శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.

దీనికి ముందు, 2023 జూన్‌లో, సీఎస్‌సీ దేశాల శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెల రోజుల పరిశోధనల కోసం 'సాగర్ నిధి'లో బయలుదేరారు.

శాస్త్రవేత్తలంతా 3-4 నెలల పాటు అంటార్కిటిక్ యాత్రలో పాల్గొంటారు. ధృవ ప్రాంతంలో వివిధ అంశాలపై పరిస్పర సహకారంతో పరిశోధనలు చేస్తారు, ధృవ ప్రాంత పర్యావరణంలోని సవాళ్లను అర్థం చేసుకుంటారు.

****



(Release ID: 1995127) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Hindi