ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమీక్షా సమావేశం
प्रविष्टि तिथि:
09 JAN 2024 7:08PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతంలో (ఎన్ఇఆర్) పక్షం రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులు జరిపే పర్యటనల సందర్భంగా చేసిన సిఫార్సులపై ఆయా శాఖల అధికారులు, విభాగాలు తీసుకున్న చర్యల స్థితిని ఈశాన్య ప్రాంతపు సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ సమీక్షించారు. మంత్రుల పర్యటనల సందర్భంగా కేంద్ర మంత్రుల సిఫార్సులపై మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న చర్యల స్థితిగతులపై ఎండీఓఎన్ఈఆర్ సహాయ మంత్రి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఎండీఓఎన్ఈఆర్ నుంచి డిపార్టుమెంట్ కార్యదర్శి & సీనియర్ అధికారులు, రైల్వే, రోడ్డు రవాణా, హైవేలు, మహిళా -శిశు అభివృద్ధి, పౌర విమానయానం, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వాణిజ్యం మరియు పరిశ్రమలు, సామాజిక న్యాయం మరియు సాధికారత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు , గిరిజన వ్యవహారాలు, జల శక్తి, హోం వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, ఉక్కు, వినియోగదారుల వ్యవహారాలు, డీపీఐఐటీతో పాటుగా అన్ని ఈశాన్య రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎండీఓఎన్ఈఆర్ ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సమన్వయంతో ఎండీఓఎన్ఈఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను హైలైట్ చేసింది, దీని ఫలితంగా ఎన్ఈఆర్ మొత్తం వృద్ధి చెందింది. ఎన్ఈఆర్ లో కేంద్ర మంత్రుల పర్యటనల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఎన్ఈఆర్ సందర్శనల సందర్భంగా కేంద్ర మంత్రుల సిఫార్సులపై సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. భారత ప్రభుత్వ పథకాలు/ ప్రాజెక్ట్‌ల ప్రయోజనం ఎన్ఈఆర్లోని ప్రతి ఒక్కరికీ చేరేలా చూసేందుకు, సిఫార్సులపై సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల చర్యల నివేదికను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఎండీఓఎన్ఈఆర్ కార్యదర్శితో కలిసి మంత్రిత్వ శాఖలు/ విభాగాలు సమర్పించిన ఈటీఆర్ల స్థితిని సమీక్షించారు. అనేక సిఫార్సులపై ఏటీఆర్ ఇంకా సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎండీఓఎన్ఈఆర్ కొత్తగా ప్రారంభించిన “పూర్వోత్తర్ సంపర్క్ సేతు” పోర్టల్ గురించి పాల్గొనే వారందరికీ తెలియజేశారు. ఇంకా తాము తీసుకున్న చర్యల నివేదికను సమర్పించని మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వారంలోపు దానిని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అభ్యర్థించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెండు నెలల తర్వాత తదుపరి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
***
(रिलीज़ आईडी: 1995020)
आगंतुक पटल : 183