వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

“కోచింగ్ రంగం లో తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణ మరియు నియంత్రణ” కోసం కమిటీ సమావేశం


అన్ని కోచింగ్ సంస్థలకు వర్తించే మార్గదర్శకాలు

కోచింగ్ సంస్థల ద్వారా సక్సెస్ రేట్లు, ఎంపికల సంఖ్య మొదలైన వాటికి సంబంధించిన తప్పుడు క్లెయిమ్‌లను నిరోధించడానికి మార్గదర్శకాలు

Posted On: 09 JAN 2024 3:53PM by PIB Hyderabad

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( సి సి పి ఏ ) జనవరి 8, 2024న కోచింగ్ సెక్టార్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి ఏర్పాటైన కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. మార్గదర్శకాల ముసాయిదాపై కమిటీ చర్చించింది.

కమిటీ చైర్మన్ శ్రీ రోహిత్ కుమార్ సింగ్, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి మరియు సి సి పి ఏ చీఫ్ కమిషనర్‌తో పాటు ఇతర సభ్యులు కమిషనర్ (సి సి పి ఏ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్, విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ లా యూనివర్సిటీ (NLU) ప్రతినిధులు ), ఢిల్లీ,  ఫిట్జీ , ఖాన్ గ్లోబల్ స్టడీస్ మరియు ఇకిగై  లా. సమావేశంలో పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పాల్గొన్నారు.

శ్రీ రోహిత్ కుమార్ సింగ్, సెక్రటరీ (కన్స్యూమర్ అఫైర్స్)చీఫ్ కమీషనర్ (సి సి పి ఏ) వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం సి సి పి ఏ కి అత్యంత ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు. కోచింగ్ సెక్టార్‌లో ప్రకటనలకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రత్యేకంగా పరిష్కరించడంలో స్పష్టత అవసరమని ఆయన హైలైట్ చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో సి సి పి ఏ దృఢంగా విశ్వసిస్తోందని మరియు వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా వస్తువులు లేదా సేవలకు సంబంధించి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయకూడదని  గట్టిగా విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మార్గదర్శకాలు ఆన్‌లైన్ లేదా ఫిజికల్ అయినా అన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వర్తిస్తాయి మరియు రూపం, ఫార్మాట్ లేదా మీడియంతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రకటనలను కవర్ చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద నిర్వచించబడిన విధంగా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా చేసే ప్రకటన తప్పుదారి పట్టించే ప్రకటనగా భావించబడాలంటే విజయవంతమైన అభ్యర్థులు ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచడం తో సహా విజయవంతమైన అభ్యర్థులు ఎంచుకున్న కోర్సులు ( ఉచితం లేదా చెల్లింపు), కోర్సు వ్యవధి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచడం మొదలైన మార్గదర్శకాలు షరతులను నిర్దేశిస్తాయి.

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సక్సెస్ రేట్లు లేదా ఎంపికల సంఖ్య మరియు వినియోగదారుల అపార్థానికి దారితీసే లేదా వినియోగదారు స్వయం నిర్ణయం మరియు ఎంపికను దెబ్బతీసే ఇతర పద్ధతులకు సంబంధించి తప్పుడు సమాచారం   ఇవ్వకూడదని కూడా మార్గదర్శకాలు సూచిస్తాయి.

మార్గదర్శకాలు ప్రకటనల విడుదల చేసే ముందు గమనించవలసిన చేయవలసినవి మరియు చేయకూడనివి అంశాలను కూడా సూచిస్తున్నాయి:-

కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన అభ్యర్థి ఫోటోతో అవసరమైన దిగువ సమాచారాన్ని పేర్కొనాలి:-
విజయవంతమైన అభ్యర్థి సాధించిన ర్యాంక్
విజయవంతమైన అభ్యర్థి ఎంచుకున్న కోర్సు
కోర్సు యొక్క వ్యవధి
ఇది చెల్లించినా లేదా ఉచితం అయినా
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు 100% ఎంపిక లేదా 100% ఉద్యోగ హామీ లేదా గ్యారెంటీ ప్రిలిమినరీ లేదా మెయిన్‌లను క్లెయిమ్ చేయకూడదు.

ప్రకటనలోని నిరాకరణ/బహిర్గతం/ముఖ్యమైన సమాచారం యొక్క ఫాంట్ ప్రకటనలో ఉపయోగించిన విధంగానే ఉండాలి. అటువంటి సమాచారం యొక్క స్థానం ప్రకటనలో ప్రముఖమైన మరియు కనిపించే ప్రదేశంలో ఉండాలి.
కోచింగ్ సెక్టార్ ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం జరిమానాలు వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం విధించబడతాయని  వినియోగదారుల రక్షణ చట్టం 2019 యొక్క నిబంధనల ఉల్లంఘనలు పై  చర్యలు  కొనసాగుతాయని కూడా స్పష్టం చేయబడింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది మరియు మార్గదర్శకాలు వాటాదారులకు స్పష్టత ఇచ్చే ఉద్దేశ్యం తో జారీచేయబడ్డాయి .

గైడ్‌లైన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఉందని, సమావేశంలో చర్చించిన ముసాయిదాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కమిటీ గమనించింది.

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సి సి పి ఏ సౌమోటో చర్య తీసుకుంది. దీనికి సంబంధించి, సి సి పి ఏ తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం 31 కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు నోటీసులు జారీ చేసింది మరియు తప్పుదారి పట్టించే ప్రకటనల పై   9 మందికి జరిమానా విధించింది.

విజయవంతమైన అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు, హాజరైన కోర్సు వ్యవధి, అభ్యర్థులు చెల్లించే ఫీజులకు సంబంధించి కొన్ని కోచింగ్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని సి సి పి ఏ గమనించింది. సి సి పి ఏ కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు 100% ఎంపిక, 100% ఉద్యోగ హామీ మరియు ధృవీకరించదగిన సాక్ష్యాలను అందించకుండా ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలకు హామీ ఇవ్వడం వంటి క్లెయిమ్‌లను కూడా చేస్తున్నాయని కూడా గమనించింది.

 

***



(Release ID: 1995019) Visitor Counter : 120