ఆయుష్

ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసిడి) 11 మాడ్యూల్ 2 లో ఆయుర్వేదం, సిద్ధ, యునాని వ్యాధి ప్రబలత విధానాలకు గుర్తింపు


కార్యక్రమంలో పాల్గోనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సీనియర్ అధికారులు, డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల ప్రతినిధులు

అంతర్జాతీయంగా వ్యాధులను నిర్వచించే పదకోశంలో ఏఎస్యూ (ఆయుర్వేదం, యునాని, సిద్ధ)

Posted On: 09 JAN 2024 6:11PM by PIB Hyderabad

వ్యాధి ప్రబలత కోసం  ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన పదకోశం  ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసిడి) 11 మాడ్యూల్ 2 ని   2024 జనవరి 10న న్యూఢిల్లీలో విడుదల చేయనున్నారు.  ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వ్యవస్థల ఆధారిత వ్యాధులకు సంబంధించిన డేటా, పదజాలాన్ని ఇకపై డబ్ల్యూహెచ్ వో ఐసీడీ11 వర్గీకరణలో చేర్చనున్నారు.

ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వ్యవస్థల ఆధారంగా వ్యాధులకు సంబంధించిన డేటా, పరిభాషను ఇకపై డబ్ల్యూహెచ్ వో ఐసీడీ11 లో లభిస్తాయి. వ్యాధుల నిర్వచనం కోసం  ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన   పదజాల నియమావళి వల్ల  ఎ.ఎస్.యు (ఆయుర్వేదం, యునాని మరియు సిద్ధ) వైద్యంలో ప్రపంచ ఏకరూపత అభివృద్ధి చెందుతుంది. 

అంతర్జాతీయంగా వ్యాధులను వర్గీకరించడానికి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసిడి) అనే వర్గీకరణ శ్రేణిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాధులపై ప్రపంచ డేటా ప్రధానంగా ఆధునిక బయో మెడిసిన్ ద్వారా నిర్ధారణ చేయవలసిన ఆరోగ్య సంరక్షణ పద్ధతుల  ఆధారంగా రూపొందింది. ఐసిడిలో ఇంతవరకు  ఆయుర్వేదం, సిద్ధ, యునాని మొదలైన ఆయుష్ వ్యవస్థల ఆధారంగా వ్యాధులకు సంబంధించిన డేటా, పదజాలం వర్గీకరణను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చలేదు. 

డబ్ల్యూహెచ్ఓ జెనీవాలోని ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ఈ రోజు (జనవరి 9) ఆయుష్ మంత్రిత్వ శాఖ ను సందర్శించారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు, సభ్యులతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు,  ఐసిడి 11 లో సాంప్రదాయ వైద్యాన్ని చేర్చడం వంటి అంశాలను చర్చించారు. . ఈ చర్చలో డబ్ల్యూహెచ్ వో ట్రెడిషన్, కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీసెస్ టెక్నికల్ ఆఫీసర్ ప్రదీప్ దువా పాల్గొన్నారు. కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోనిసెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ (సిబిహెచ్ఐ) పనిచేస్తోంది. ఐసిడి సంబంధిత కార్యకలాపాల కోసం డబ్ల్యూహెచ్ఓ సహకార కేంద్రంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ (సిబిహెచ్ఐ) పనిచేస్తుంది.  వివిధ వ్యాధులు, మరణాలపై సమాచారాన్ని సేకరించి సంబంధిత వర్గాలకు సమాచారం అందించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ (సిబిహెచ్ఐ) కార్యక్రమాలు అమలు చేస్తోంది. నేషనల్ ఆయుష్ మోర్బిడిటీ అండ్ స్టాండర్డైజ్డ్ ఎలక్ట్రానిక్ పోర్టల్ (నామ్స్టీఈ) ద్వారా ఆయుర్వేదం, సిద్ధ, యునాని మెడిసిన్ పదజాలాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది.  డబ్ల్యూహెచ్ఓ సహకారంతో ఐసిడి 11 సిరీస్  టిఎం 2 మాడ్యూల్ కింద ఆయుష్ - ఆయుర్వేదం, సిద్ధ, యునాని వ్యవస్థల ఆధారంగా వ్యాధులకు సంబంధించిన సమాచారం, పదజాలం  వర్గీకరణను ఆయుష్ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. కార్యక్రమాన్ని అమలు చేయడానికి  ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో డోనర్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యల వల్ల   భారతదేశ ప్రజారోగ్య  వ్యవస్థ, పరిశోధన, ఆయుష్ భీమా కవరేజీ, పరిశోధన, అభివృద్ధి , విధాన రూపకల్పన వ్యవస్థలు  మరింత బలోపేతం అవుతాయి.వివిధ వ్యాధులను నియంత్రించడానికి భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో కూడా ఈ కోడ్లను ఉపయోగించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని అనేక ఇతర సభ్య దేశాలు కూడా ఐసిడిలో సాంప్రదాయ వైద్య వ్యాధుల పరిభాషను చేర్చడానికి ఇలాంటి ఫార్మాట్ ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

మలేరియా వంటి అంటువ్యాధులు , దీర్ఘకాలిక నిద్రలేమి వంటి జీవనశైలి వ్యాధులను  ఈ వర్గీకరణలో చేర్చారు.  వెర్టిగో గైడెన్స్ డిజార్డర్ (మాతృ నామం) ను ఆయుర్వేదం, సిద్ధు,యునానీ వైద్య విధానాలు గుర్తించాయి.వెర్టిగో గైడెన్స్ డిజార్డర్ ని   ఆయుర్వేదంలో 'బ్రహ్మహ' సిద్ద లో  'అజల్ కిర్క్రిప్పు' అని , యునానిలో 'సద్రా-ఓ-ద్వార్' అని పిలుస్తారు.

ఐసీడీ-11 కింద ఇలాంటి పదజాలానికి అంతర్జాతీయ కోడింగ్ ఉంటుందని.  ఆయుర్వేదం, సిద్ధ, యునానీ మెడిసిన్ వ్యాధుల పేర్లు, డేటాను టీఎం 2 మాడ్యూల్ ద్వారా అంతర్జాతీయంగా కోడ్ లో ప్రపంచ దేశాలకు భారత వైద్య వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. . డబ్ల్యూహెచ్ వో, ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారుల సంయుక్త సమక్షంలో 2024 జనవరి 10న న్యూఢిల్లీలో ఐసీడీ11ను విడుదల అవుతుంది. 

 

***

 



(Release ID: 1994729) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Marathi , Hindi