రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లో యూకే రక్షణ మంత్రి మిస్టర్ గ్రాంట్ షాప్స్‌తో చర్చలు జరిపారు; ముఖ్యంగా రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడంపై చర్చ జరిగింది
ద్వైపాక్షిక అంతర్జాతీయ క్యాడెట్ మార్పిడి కార్యక్రమంపై భారతదేశం & యూకే అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి; ఆర్&డిలో రక్షణ సహకారంపై ఏర్పాటు చేసిన లేఖ
Posted On:
09 JAN 2024 7:39PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జనవరి 09, 2024న లండన్‌లో యూకే రక్షణ మంత్రి మిస్టర్ గ్రాంట్ షాప్స్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరువైపులా ఫలవంతమైన ఆలోచనల మార్పిడితో సమావేశం చాలా ఆసక్తికరంగా జరిగింది. మంత్రులిద్దరూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక రక్షణ, భద్రత మరియు సహకార విషయాలపై చర్చించారు. మిస్టర్ గ్రాంట్ షాప్స్ యూకే మరియు భారతదేశం మధ్య సంబంధం..లావాదేవీలు మాత్రమే కాదని అది రెండు దేశాలు అనేక సారూప్యతలు మరియు భాగస్వామ్య లక్ష్యాలతో సహజ భాగస్వాములు అని నొక్కి చెప్పారు. రక్షణ మంత్రి రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక కలయికను ప్రశంసించారు.
ద్వైపాక్షిక రక్షణ సమావేశం తర్వాత భారతదేశం మరియు యూకే మధ్య రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వాటిలో ఒకటి ద్వైపాక్షిక అంతర్జాతీయ క్యాడెట్ మార్పిడి కార్యక్రమ నిర్వహణపై అవగాహన ఒప్పందం మరొకటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మరియు యూకే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ (డిఎస్‌టిఎల్) మధ్య పరిశోధన మరియు అభివృద్ధిలో సహకారంపై అరేంజ్‌మెంట్ లెటర్. ఈ పత్రాలు రెండు దేశాల మధ్య ప్రజల మార్పిడి ముఖ్యంగా యువతకు సహకరిస్తాయి అలాగే రెండు దేశాల మధ్య రక్షణ పరిశోధన సహకారానికి మరింత ఊపును అందిస్తాయి.
జనవరి 8వ తేదీన సాయంత్రం లండన్ చేరుకున్న రక్షణ మంత్రి ఈరోజు ముందుగా టావిస్టాక్ స్క్వేర్‌లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ద్వారా తన లండన్‌లో కార్యక్రమాలను ప్రారంభించారు. మహాత్మా గాంధీ సమీపంలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో 1888 నుండి 1891 వరకు లా విద్యను అభ్యసించారు. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి ముంబైకి తిరిగి వచ్చిన నేపథ్యాన్ని పురస్కరించుకుని జనవరి 9వ తేదీన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకుంటున్నారు. దేశాభివృద్ధికి ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ యొక్క గొప్ప సహకారాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది.
యూకే రక్షణమంత్రితో ద్వైపాక్షిక సమావేశానికి ముందు హార్స్ గార్డ్స్ పరేడ్ గ్రౌండ్‌లో శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.
***
(Release ID: 1994699)
Visitor Counter : 151