మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాగర్ పరిక్రమ ఫేజ్- XII లో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా పశ్చిమ బెంగాల్‌లో 2024 జనవరి 10 నుండి 11వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలలోపాల్గొంటారు.


సాగర్ పరిక్రమ యాత్రలో మత్స్యకారులు, మత్స్య రైతులు మరియు ఇతర ముఖ్య వాటాదారులతో సమీక్షా సమావేశాలు మరియు పరస్పర సంభాషణలు ఉంటాయి

Posted On: 09 JAN 2024 1:08PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రదేశాలలో 2024 జనవరి 10 నుండి 11 జనవరి 2024 వరకు నిర్వహించబడుతున్న సాగర్ పరిక్రమ ఫేజ్- XII ఈవెంట్‌లో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మరియు ఎం ఓ ఎస్ డాక్టర్ ఎల్  మురుగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా కిసాన్ క్రెడిట్ కార్డ్ (కే సి సి ) లబ్దిదారులు మరియు ఇతర వాటాదారులైన  ప్రగతిశీల మత్స్యకారులు, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులు, యువ మత్స్య పారిశ్రామికవేత్తలు మొదలైన వారిని  సత్కరిస్తారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ( పి ఎం ఎం ఎస్ వై ) ద్వారా తీసుకున్న ఉత్తమ పద్ధతులు మరియు చొరవలు పథకం, కే సి సిమరియు ఇతర పథకాలు గురించి  మత్స్యకారులకు విస్తృతంగా ప్రచారం చేస్తారు.

సాగర్ పరిక్రమ దశ-XII పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలైన దిఘా, శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్, డైమండ్ హార్బర్‌లోని సుల్తాన్‌పూర్ ఫిషింగ్ హార్బర్, గంగా సాగర్‌లను కవర్ చేస్తుంది. సాగర్ పరిక్రమ ఫేజ్- XII కార్యక్రమంలో మత్స్య శాఖ, భారత ప్రభుత్వం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, మత్స్యకారుల సంఘం  ప్రముఖులు పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.

సాగర్ పరిక్రమ యాత్రలో మత్స్యకారులు, చేపల పెంపకందారులు మరియు ఇతర ముఖ్య వాటాదారులతో సమీక్షా సమావేశాలు మరియు పరస్పర చర్చలు ఉంటాయి. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కే సి సి మరియు ఇతర కార్యక్రమాల కోసం ప్రచారాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు ప్రతినిధులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకారుల సహకార సంఘాల నాయకులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, దేశం నలుమూలల నుంచి ఇతర వాటాదారులు హాజరుకానున్నారు.

పశ్చిమ బెంగాల్ ఆరు వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలతో విభిన్న జల వనరులతో ఎనిమిది లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ లోతట్టు నీటి వనరులతో మరియు 158 కి.మీ తీరప్రాంతాన్ని కలిగి ఉంది. చేపల పెంపకం రంగంలో చల్లని నీటి నుండి సముద్రానికి మరియు మధ్యలో ఉన్న ప్రతిదానికీ (లోతట్టు, ఉప్పునీరు, చిత్తడి నేల) గొప్ప వైవిధ్యం ఉంది.

"సాగర్ పరిక్రమ" మొదటి దశ ప్రయాణం 5 మార్చి 2022న గుజరాత్‌లోని మాండ్వి నుండి ప్రారంభమైంది మరియు ఇప్పటివరకు, సాగర్ పరిక్రమ యొక్క మొత్తం పదకొండు దశలు కర్ణాటక, అండమాన్ & నికోబార్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశాగుజరాత్, డామన్ & డయ్యూ, మహారాష్ట్ర, గోవా తీరప్రాంత రాష్ట్రాలు/యూటీలలో కవర్ చేయబడ్డాయి.

సాగర్ పరిక్రమ ప్రజల జీవన ప్రమాణాలు మరియు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది. వారి సవాళ్లను గుర్తించి, చేపలవారికి ప్రభుత్వ అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది. మత్స్యకారుల మరియు మత్స్య రైతుల సమస్యల పరిష్కారానికి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పి ఎం ఎం ఎస్ వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కే సి సి) మరియు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాల ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి సాగర్ పరిక్రమ సహాయం అందిస్తుంది.

మత్స్యకారుల ఆర్థిక సాధికారత ద్వారా సమ్మిళిత వృద్ధిని పెంపొందించే అపారమైన సంభావ్యతతో, మత్స్య పరిశ్రమ ఒక అభివృద్ధి పరిశ్రమ  గా పరిగణించబడుతుంది. మత్స్యకారుల సమస్యలు, అనుభవాలు మరియు ఆకాంక్షలను బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే మత్స్యకార గ్రామాల పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరియు తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు అందుబాటులో ఉన్న పథకాలను హైలైట్ చేయడానికి భారత ప్రభుత్వం సాగర్ పరిక్రమ యాత్రను చేపట్టింది. సాగర్ పరిక్రమ యాత్ర యొక్క పదకొండు దశలు అనేక తీర ప్రాంతాలలో  సాగే  ఈ  ప్రస్థానంలో భిన్న కష్టాలను మరియు విభిన్న సంస్కృతులను చూస్తాయి.   

 

***


(Release ID: 1994693) Visitor Counter : 126