ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఒక జిల్లా, ఒక ఉత్పాదన’ పథకాని కి గానుప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన యుపి విశ్వకర్మ
Posted On:
08 JAN 2024 3:20PM by PIB Hyderabad
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ రోజు న భేటీ అయ్యారు. ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులు, ఇంకా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ ల సభ్యులు మరియు స్థానిక ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ నివాసి , టెరాకటా సిల్క్ వ్యాపారాన్ని చేస్తున్న కుటుంబం లో ఒక సభ్యుడు అయిన శ్రీ లక్ష్మీ ప్రజాపతి 12 మంది సభ్యుల తో మరియు సుమారు గా 75 మంది సహచరుల తో కలసి లక్ష్మీ స్వయం సహాయ సమూహాన్ని ఏర్పాటు చేసుకొన్నట్లు ప్రధాన మంత్రి కి వివరించారు. ఈ స్వయం సహాయ సమూహం యొక్క సామూహిక వార్షిక ఆదాయం సుమారు గా ఒక కోటి రూపాయలు ఉన్నట్లు శ్రీ లక్ష్మీ ప్రజాపతి తెలిపారు. ‘ఒక జిల్లా, ఒక ఉత్పాదన’ (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్.. ఒడిఒపి) కార్యక్రమం లో భాగం గా ఏయే ప్రయోజనాల ను అందుకొంటున్నది చెప్పాలంటూ ప్రధాన మంత్రి వాకబు చేసిన మీదట శ్రీ లక్ష్మీ ప్రజాపతి జవాబిస్తూ, ఈ పథకం విషయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దృష్టికోణాని కి ధన్యవాదాల ను తెలియ జేశారు. ప్రతి ఒక్క చేతివృత్తి కళాకారుడు ఒక టూల్ కిట్ ను, విద్యుత్తు ను మరియు మట్టి తయారీకై ఉపయోగపడే యంత్రాల ను ఎటువంటి ఖర్చు లేకుండానే అందుకొన్నట్లు; వీటితో పాటు గా జాతీయ స్థాయి లో ఏర్పాటు అయ్యే వివిధ ప్రదర్శనల లో పాలుపంచుకొనేందుకు ఒక అవకాశాన్ని కూడా దక్కించుకొన్నట్లు చెప్పారు.
వేరు వేరు పథకాల అమలు అంశం లో మునుపటి ప్రభుత్వాల తో పోలికల ను శ్రీ ప్రజాపతి ప్రస్తావిస్తూ, టాయిలెట్స్, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి, ఒడిఒపి ల వల్ల కలుగుతున్న ప్రయోజనాల ను వివరించారు. ఆ తరహా పథకాల ను గురించిన చైతన్యం వార్తాపత్రికల లో వస్తున్న ప్రకటన లు మరియు క్షేత్ర స్థాయి లో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఏర్పడిందని తెలిపారు. ‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’ (‘మోదీ యొక్క హామీ ని మోసుకు వచ్చే బండి’) గ్రామాల ను చేరుకొన్న వేళ ప్రజల లో పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న ఉత్సాహం ఒక్కటే కాకుండా ఆ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం కూడాను భారీ ఎత్తున జనసమూహాన్ని ఆకట్టుకొంటోంది అని శ్రీ ప్రజాపతి తెలిపారు.
టెరాకటా సిల్క్ ఉత్పత్తులు బెంగళూరు, హైదరాబాద్, లఖ్‌నవూ, దిల్లీ లు సహా ప్రతి ఒక్క మెట్రోపాలిటన్ సిటీ లోను మహారాష్ట్ర, గుజరాత్, తమిళ నాడు మొదలైన రాష్ట్రాల లోను అమ్ముడవుతున్నాయి అని ఆయన అన్నారు.
పిఎమ్ విశ్వకర్మ యోజన వెనుక గల ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, అది జీవనం లో మార్పు ను తీసుకు వచ్చేటటువంటి ఒక పథకం అని, అది చేతివృత్తి కళాకారులందరి కి ఆధునిక పనిముట్టుల ను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేటటువంటి పథకం అని వ్యాఖ్యానించారు. శ్రీ ప్రజాపతి తాను ఉంటున్న ప్రాంతం లో విశ్వకర్మ యోజన ను గురించిన అవగాహన ను పెంపొందింప చేయవలసింది అంటూ ఆయన ను ప్రధాన మంత్రి కోరారు. వోకల్ ఫార్ లోకల్, ఇంకా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ కార్యక్రమాల కు ప్రభుత్వం కట్టబెడుతున్న ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి వివరించారు. అలాగే ఈ పథకాలు సఫలం అయ్యేటట్టు ప్రజలు భాగస్వామ్యం పంచుకోవడం మరియు వారు ప్రమేయం పెట్టుకోవడం పట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 1994265)
Visitor Counter : 150
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam