మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హజ్ ఒప్పందం 2024పై సంతకాలు చేసిన భారత్ - సౌదీ అరేబియా
2024 హజ్ యాత్ర కోసం భారత్ నుంచి 1,75,025 మందికి కోటా ఖరారు, భారత హజ్ కమిటీ ద్వారా వెళ్లనున్న 1,40,020 మంది యాత్రికులు
హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా వెళ్లేందుకు 35,005 మంది యాత్రికులకు అనుమతి
Posted On:
07 JAN 2024 8:23PM by PIB Hyderabad
భారత్ - కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మధ్య 2024 హజ్ ఒప్పందం కుదిరింది. భారత మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి మురళీధరన్ - సౌదీ అరేబియా హజ్ & ఉమ్రా మంత్రి డా. తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా ఈ రోజు జెడ్డాలో ఒప్పందంపై సంతకాలు చేశారు.
హజ్ యాత్ర 2024 కోసం భారతదేశం నుంచి మొత్తం 1,75,025 మంది యాత్రికులకు కోటా ఖరారైంది. భారత హజ్ కమిటీ ద్వారా 1,40,020 మందికి సీట్లు రిజర్వ్ చేస్తారు. మొదటిసారి హజ్ యాత్ర చేస్తున్న సాధారణ యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా వెళ్లేందుకు మిగిలిన 35,005 మంది యాత్రికులను అనుమతిస్తారు.
చివరి హజ్ యాత్రికుడికి కూడా సమాచారాన్ని అందించి, యాత్రను సౌకర్యవంతంగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలను సౌదీ అరేబియా మంత్రి ప్రశంసించారు. తమ వైపు నుంచి సాధ్యమైనంత సాయం చేయడానికి అంగీకరించారు. 'లేడీస్ వితౌట్ మెహ్రమ్' (ఎల్‌డబ్ల్యూఎం) విభాగంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చొరవను సౌదీ అరేబియా మంత్రి మెచ్చుకున్నారు.
ద్వైపాక్షిక హజ్ ఒప్పందం కుదిరిన తర్వాత, శ్రీ మురళీధరన్‌తో కలిసి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం హజ్ టెర్మినల్‌ను సందర్శించారు. హజ్ యాత్రికుల కోసం సౌదీ అరేబియా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు, భారతీయ హజ్ యాత్రికులకు సౌకర్యాలు కల్పించే వ్యవస్థలను పర్యవేక్షించారు.
***
(Release ID: 1994091)
Visitor Counter : 335