కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అన్ని సంస్థలకు ఎం2ఎం, డబ్ల్యుపీఏఎన్ /డబ్ల్యుఎల్ఏఎన్ల నమోదును విస్తరించిన డాట్
- మార్చి 31, 2024లోపు సరళసంచర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచన
- దీనికి కట్టుబడి ఉండకపోతే అధీకృత టెలికాం లైసెన్సుల నుండి టెలికాం వనరుల ఉపసంహరణ లేదా డిస్‌కనెక్షన్‌కు అవకాశం
- సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వ విభాగాలు మరియు భాగస్వామ్యాలను కలిగి ఉంటాయి
- సురక్షితమైన మరియు వినూత్నమైన ఎం2ఎం/ఐఓటీ ల్యాండ్‌స్కేప్‌ను నిర్మించడాన్ని నిర్ధారించడానికి డాట్ కట్టుబడి ఉంది
Posted On:
07 JAN 2024 11:21AM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్), కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ (ఎంఓసీ), మెషిన్-టు-మెషిన్ (ఎం2ఎం) మరియు వైర్‌లెస్ పర్సనల్ ఏరియా నెట్‌వర్క్/ వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యుపీఏఎన్ /డబ్ల్యుఎల్ఏఎన్) రిజిస్ట్రేషన్‌ను పేర్కొన్న వ్యాపారాలలో నిమగ్నమైన అన్ని సంస్థలకు విస్తరించింది. ఎం2ఎం సర్వీస్ ప్రొవిజనింగ్ మరియు డబ్ల్యుపీఏఎన్ /డబ్ల్యుఎల్ఏఎన్ కనెక్టివిటీ ప్రొవిజనింగ్‌లో నిమగ్నమైన అన్ని వ్యాపార సంస్థలు (కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు/సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పీలు, సంస్థలు, అండర్ టేకింగ్‌లు, యాజమాన్య సంస్థలు, సొసైటీలు మరియు ట్రస్ట్‌లతో సహా) రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సరళసంచార్ పోర్టల్ (https://saralsanchar.gov.in) ద్వారా సరళమైన మరియు పారదర్శకమైన ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలని డాట్ సూచించింది. ఈ విధంగా చేయకపోవడం అధీకృత టెలికాం లైసెన్సుల ద్వారా పొందిన టెలికాం వనరుల ఉపసంహరణ లేదా డిస్‌కనెక్ట్‌కు దారితీయవచ్చు. ప్రామాణిక-ఆధారిత మరియు సురక్షితమైన ఎం2ఎం/ ఐఓటీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడానికి గాను రిజిస్ట్రేషన్ పరిధిని విస్తరించడానికి నిర్ణయం తీసుకోబడింది. ఇది టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీలు), కేవైసీ, సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్ మొదలైన వాటితో ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన ఎం2ఎం సర్వీస్ ప్రొవైడర్లు మరియు ఎం2ఎం సేవల కోసం డబ్ల్యుపీఏఎన్ /డబ్ల్యుఎల్ఏఎన్ సంబంధించిన కనెక్టివిటీ ప్రొవైడర్ల ఆందోళనలను కూడా పరిష్కరిస్తుంది. "ఎం2ఎం కమ్యూనికేషన్స్‌లో స్పెక్ట్రమ్, రోమింగ్ మరియు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (క్యూఓఎస్) సంబంధిత అవసరాలు"పై ట్రాయ్ సిఫార్సులు మరియు ఎం2ఎం పరిశ్రమ వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత. 'ఎం2ఎం సర్వీస్ ప్రొవైడర్స్ (ఎం2ఎంఎస్పీ) & డబ్ల్యుపీఏఎన్ /డబ్ల్యుఎల్ఏఎన్ కనెక్టివిటీ ప్రొవైడర్ల కోసం ఎం2ఎం సేవల నమోదు ప్రక్రియ' కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరణాత్మక మార్గదర్శకాలు కింది లింక్ ద్వార అందుబాటులో ఉన్నాయి:
(https://dot.gov.in/latestupdates/guidelines-registration-process-m2m-service- providers-m2msp-and-wpanwlan-connectivity)
***
(Release ID: 1994045)
Visitor Counter : 175