ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా మే 2023 నుండి జీఎస్టీలో ఉనికిలో లేని పన్ను చెల్లింపుదారులపై నిరంతర చేపట్టిన డ్రైవ్‌లో భాగంగా 29,273 బోగస్ సంస్థలకు సంబంధించి రూ.44,015 కోట్ల విలువైన అనుమానిత ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసి) ఎగవేతలు గుర్తించబడ్డాయి; 121 మందిని అరెస్టు చేశారు.

Posted On: 07 JAN 2024 6:01PM by PIB Hyderabad

వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ)లో మోసాలను అరికట్టడానికి మరియు సమ్మతిని పెంచడానికి దేశవ్యాప్తంగా కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ (సిబిఐసి) మరియు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాలు ఉనికిలో లేని/బోగస్ రిజిస్ట్రేషన్‌లు మరియు వస్తువులు మరియు సేవల అంతర్లీన సరఫరా లేకుండా నకిలీ ఇన్‌వాయిస్‌ల జారీ వంటి జీఎస్టీకి సంబంధించిన మోసాలపై దృష్టి కేంద్రీకరించాయి.

మే 2023 మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి అనుమానిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసి) ఎగవేతలో పాల్గొన్న మొత్తం 29,273 బోగస్ సంస్థల ద్వారా రూ.44,015 కోట్లు గుర్తించారు. ఐటీసీని బ్లాక్ చేయడం ద్వారా రూ. 3,802 కోట్లు మరియు రూ.844 కోట్ల రికవరీ ద్వారా మొత్తం రూ. 4,646 కోట్లు ఆదా చేయబడ్డాయి. అలాగే 121 మందిని అరెస్ట్‌ చేయడం జరిగింది.

డిసెంబర్, 2023తో ముగిసిన త్రైమాసికంలో 4,153 బోగస్ సంస్థలకు సంబంధించిన అనుమానిత ఐటీసీ ఎగవేతలను దాదాపు రూ. 12,036 కోట్లు గుర్తించారు. వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 1,317 కోట్లు ఆదా అయ్యాయి. ఇందులో రూ. 319 కోట్లు రియలైజ్ అయ్యాయని, ఐటీసీని బ్లాక్ చేయడం ద్వారా రూ.997 కోట్లకు రక్షణ కల్పించామని చెప్పారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేశారు. వీరిలో 31 మందిని కేంద్ర జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రాల వారీగా వివరాలు జతచేయబడ్డాయి.

జీఎస్టీ నమోదు ప్రక్రియను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ సమయంలో బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రమాణీకరణ  పైలట్ ప్రాజెక్ట్‌లు గుజరాత్, పుదుచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించబడ్డాయి.

 

అంతేకాకుండా జీఎస్టీ రిటర్న్‌ల సీక్వెన్షియల్ ఫైలింగ్, జీఎస్టీఆర్‌-1 & జీఎస్టీఆర్-3బి రిటర్న్‌లలో పన్ను బాధ్యతలోని అంతరాన్ని మరియు ఐటీసి మధ్య అందుబాటులో ఉన్న గ్యాప్‌ని సరిచేయడానికి సిస్టమ్ రూపొందించిన సమాచారం వంటి చర్యల ద్వారా పన్ను ఎగవేతను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. జీఎస్టీఆర్‌-2బి & ఐటీసి జీఎస్టీఆర్‌-3బి రిటర్న్‌లు, డేటా అనలిటిక్స్ వినియోగం మరియు నకిలీ ఐటీసిని గుర్తించడానికి రిస్క్ పారామీటర్‌లు మొదలైనవి వాటిలో ఉన్నాయి.
 

డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో బోగస్ సంస్థలపై చర్యలు

రాష్ట్రం/యూటీ పేరు

గుర్తించిన బోగస్ సంస్థల సంఖ్య

పన్ను ఎగవేత అనుమానం (రూకోట్లు)

ఐటీసి  బ్లాక్ చేయబడిన రికవరీ చేయబడిన మొత్తం (రూ కోట్లు)

అరెస్టులు చేశారు

ప్రతి లక్ష సంస్థలకు  నమోదైన నకిలీ సంస్థలు

ఆంధ్రప్రదేశ్

19

765

11

0

5

అరుణాచల్ ప్రదేశ్

0

13

14

0

0

అస్సాం

19

116

67

0

8

బీహార్

30

148

88

0

5

చండీగఢ్

2

5

1

0

6

ఛత్తీస్‌గఢ్

26

83

34

1

15

దాద్రా & నగర్ హవేలీ

0

0

0

0

0

ఢిల్లీ

483

3028

90

11

61

గోవా

4

29

0

0

9

గుజరాత్

178

445

25

3

15

హర్యానా

424

624

76

3

81

హిమాచల్ ప్రదేశ్

4

14

4

0

3

జమ్మ కశ్మీర్

3

1

0

0

2

జార్ఖండ్

23

110

2

0

11

కర్ణాటక

223

397

59

2

22

కేరళ

42

152

4

0

10

లడఖ్

0

0

0

0

0

మధ్యప్రదేశ్

70

158

22

1

13

మహారాష్ట్ర

926

2201

102

11

54

మణిపూర్

0

0

0

0

0

మేఘాలయ

0

5

0

0

0

మిజోరం

0

0

0

0

0

నాగాలాండ్

0

0

0

0

0

ఒడిషా

138

337

7

0

42

పుదుచ్చేరి

2

2

0

0

8

పంజాబ్

82

75

4

1

21

రాజస్థాన్

507

197

31

1

59

సిక్కిం

2

2

2

0

18

తమిళనాడు

185

494

374

1

16

తెలంగాణ

117

536

235

1

23

త్రిపుర

9

20

0

0

29

ఉత్తర ప్రదేశ్

443

1645

44

5

24

ఉత్తరాఖండ్

66

88

0

0

33

పశ్చిమ బెంగాల్

126

343

18

0

17

అండమాన్ & నికోబార్

0

0

0

0

0

లక్షద్వీప్

0

0

0

0

0

మొత్తం

4153

12036

1317

41

29


(Release ID: 1993994) Visitor Counter : 150


Read this release in: English , Hindi , Urdu , Marathi