ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో 2024 జనవరి 13 నుంచి 17 వరకు“ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024”
ఈశాన్య భారతదేశ వైవిధ్యం, సాంప్రదాయ కళలు, చేతిపనులు సంస్కృతులను ప్రతిబింబించే విధంగా “ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” నిర్వహణ ... ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్
“ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” లో కొనుగోలుదారు-విక్రేతల మధ్య సమావేశాలు, వివిధ రంగాలలో సహకారం సాధన కోసం కార్యక్రమాలు.. శ్రీ చంచల్ కుమార్
“ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” లో సాంప్రదాయ నృత్యాలు, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు, ఈశాన్య ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం ప్రదర్శన
Posted On:
04 JAN 2024 7:14PM by PIB Hyderabad
నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ & హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEHHDC) సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీలో 2024 జనవరి 13 నుంచి 17 వరకు“ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” ను నిర్వహిస్తుంది. ఐదు రోజుల పాటు జరిగే సాంస్కృతిక మహోత్సవం లో ఈశాన్య భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపంలో కార్యక్రమం జరుగుతుంది.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ ఈరోజు ఉత్తర పూర్వి మహోత్సవం మొదటి ఎడిషన్ వివరాలను మీడియాకు వివరించారు.ఈశాన్య భారతదేశానికి చెందిన సుసంపన్నమైన వైవిధ్యాన్ని, సంప్రదాయ కళలు, చేతిపనులు, సంస్కృతులను ఒకే వేదిక మీద కింద మిళితం చేసేలా ఈ మహోత్సవ్‌ను నిర్వహిస్తామని శ్రీ కుమార్ తెలియజేశారు.
ఆర్థిక అవకాశాల “ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” ఒక వేదిక ఉంటుందని అని శ్రీ చంచల్ కుమార్తెలియజేశారు. సాంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా “ఉత్తర పూర్వి మహోత్సవ్ 2024” జరుగుతుందని వివరించారు.
250 మంది నేత కార్మికులు, రైతులు, పారిశ్రామికవేత్తలు మహోత్సవ్‌లో పాల్గొంటారనిశ్రీ చంచల్ కుమార్ తెలిపారు. మహోత్సవం సందర్భంగా ప్యానల్ డిస్కషన్స్, బయ్యర్ సెల్లర్ మీట్‌లు నిర్వహిస్తామని చెప్పారు. సంప్రదాయ నృత్యాలు, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు,ఈశాన్య ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం మహోత్సవంలో ఆకర్షణలుగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో చిత్రాన్ని కూడా ఆవిష్కరించారు.
మహోత్సవ్ ముఖ్యాంశాలు-
(i) హస్తకళలు, చేనేత, వ్యవసాయ ఉద్యానవన ఉత్పత్తులు: మహోత్సవంలో 250 మంది నేత కార్మికులు, రైతులు,పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన సాంస్కృతిక ప్రత్యేక అంశాలను ప్రదర్శించడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. . మహోత్సవ్ ఈశాన్య భారతదేశంలో అత్యుత్తమమైన, హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, జీఐ ఉత్పత్తులు,- స్వదేశీ పండ్లు, ఈశాన్య సేంద్రీయ ఉత్పత్తులను ఉత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
(ii) ప్యానెల్ చర్చలు: "శ్రేయస్సు వైపు: వికసిత భారత్ దిశగా ఈశాన్య ప్రగతి" అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో దేశ చైతన్యం, పురోగతి సాధనలో ఈశాన్య ప్రాంతం పాత్ర అనే అంశంపై చర్చలు జరుగుతాయి. అభివృద్ధిపై దృష్టి సారించి, ఇంతవరకు సరైన గుర్తింపు పొందని అంశాలను గుర్తించడం లక్ష్యంగా చర్చలు నిర్వహిస్తారు.
"ఈశాన్య ప్రాంతంలో మహిళా నాయకులు"పై జరిగే చర్చా కార్యక్రమంలో ప్రాంత అభివృద్ధికి సహకరించిన మహిళా నాయకులపై చర్చలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో సామాజిక అభివృద్ధిలో మహిళలు చేసిన కృషిని గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్థిర సమాజ అభివృద్ధికి అమలు చేయాల్సిన సమ్మిళిత వ్యూహాలను రూపొందించడం లక్ష్యంగా చర్చా కార్యక్రమాలు జరుగుతాయి.
"ఈశాన్య భారతదేశ ప్రభావం- ఈశాన్య భారతదేశ యువత ప్రభావం పాత్ర " అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో " భారతదేశ ఆర్థిక రంగం పై యువత, శ్రామిక శక్తి ప్రభావం " పై చర్చలు జరుగుతాయి. దేశాభివృద్ధికి ఈశాన్య ప్రాంతానికి చెందిన యువత అందించే సహకారం, ఆకాంక్షలు, సవాళ్లనుకార్యక్రమంలో ప్రముఖంగా చర్చిస్తారు.
(iii)కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశాలు: వివిధ రంగాలలో విలువైన పరస్పర చర్యలు పెంపొందిస్తూ, ముఖ్యమైన కొనుగోలుదారు-విక్రేత సమావేశాలకు ఉత్సవం ఒక వేదికను అందిస్తుంది. చేనేత,హస్తకళలు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, పర్యాటకంపై చర్చలు జరుగుతాయి. వ్యాపార అవకాశాలను అన్వేషణ, పరస్పర సహకారం కోసం మార్గాలను గుర్తిస్తారు. ఏటా 5,000 - 10,000 మంది కళాకారులకు సహకారం అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిజిటల్ వ్యాపారం, చిన్న తరహా వ్యాపార సంస్థలకు అవసరమైన సహకారం అంశాలపై కూడా చర్చలు జరుగుతాయి.
(iv) సాంస్కృతిక ప్రదర్శన: సంప్రదాయ నృత్యాలు, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు మరియు ప్రాంతం సాంస్కృతిక వారసత్వం ప్రదర్శనలు నిర్వహిస్తారు. 2024. జనవరి 14 సాయంత్రం 5:00 గంటలకు అస్సాం సత్రియా నృత్యం త్రిపుర హోజాగిరి నృత్య ప్రదర్శన ఉంటుంది. సాయంకాలం 5 నుంచి రెండు గంటల పాటు ఫ్యాషన్ షో జరుగుతుంది.
2024 జనవరి 15న ఉత్సవాల్లో మణిపూర్ నుంచి తంగ్తా ఫైట్ సిక్కిం లయన్ డ్యాన్స్ ప్రదర్శిస్తారు. . జనవరి 16, వేడుకలు సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతాయి, మిజోరాం నుండి వచ్చిన బృందం మణిపూర్ నుంచి మనోహరమైన సంగీత ట్యూన్‌లతో పాటు ఆకట్టుకునే గంట సేపు ప్రదర్శనను అందిస్తుంది. జనవరి 17న ముగింపు ఉత్సవం జరుగుతుంది. . రాక్ బ్యాండ్ బాటిల్ రాకెట్స్ ఇండియా సుమారు గంటపాటు సంగీత విభావరి నిర్వహిస్తుంది. . ముగింపు కార్యక్రమంలో గాయని వయోలిన్ సునీతా భుయాన్ ఇక్కడ సంగీత ప్రతిభను ప్రదర్శిస్తారు.
ఈ ప్రదర్శనలతో పాటు ఈ ఉత్సవంలో మేఘాలయ వంగల నృత్యం, నాగాలాండ్ ముంగ్వంత నృత్యం, మిజోరాం వెదురు నృత్యం, అస్సాం బిహు నృత్యం, ప్రఖ్యాత టెట్సియో సోదరీమణులు, శంకురాజ్ కొన్వార్ ప్రదర్శనలు వంటి ఇతర సంప్రదాయ నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు.
మొదటిసారిగా నిర్వహిస్తున్న ఉత్తర పూర్వీ మహోత్సవం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ఈశాన్య భారతదేశ సాంస్కృతిక , ఆర్థిక అవకాశాలకు సంబంధించిన అవగాహన కల్పిస్తోంది.
ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు:-
“ఉత్తర్ పూర్వీ మహోత్సవ్ 2024” సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో బరాక్ హాస్టల్ ను ప్రారంభిస్తారు. ఈ హాస్టల్ 400 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తుంది. న్యూఢిల్లీలోని ద్వారకలో నార్త్ ఈస్ట్ కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని ఢిల్లీలో ఈశాన్య భారతదేశానికి సాంస్కృతిక సమాచార కేంద్రంగా పనిచేస్తుంది.
వెబ్‌సైట్:
ఉత్తర పూర్వీ మహోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని క్రింది లింక్‌లలో చూడవచ్చు:
వెబ్‌సైట్: http://uttarpurvi.com/
Facebook: https://www.facebook.com/profile.php?id=61554920154046&mibextid=hIlR13
Instagram: https://www.instagram.com/uttarpurvi_mahotsav?igsh=Z3E2YnQ3YjBuNDhj’
***
(Release ID: 1993363)
Visitor Counter : 205