ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విద్యా సంస్థల కోసం డొమైన్ రిజిస్టరేషన్, డిఎన్ఎస్, విలువ ఆధారిత సేవల కోసం ఎర్నెట్ ఇండియా వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన ఎంఇఐటివై కార్యదర్శి
Posted On:
04 JAN 2024 7:21PM by PIB Hyderabad
దేశంలోని విద్యా సంస్థల కోసం కొత్తగా అభివృద్ధి చేసిన సమగ్ర వెబ్ పోర్టల్ ఎర్నెట్ (ERNET)ను తన కార్యాలయంలో గురువారం నాడు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ డొమైన్ రిజిస్ట్రేషన్‌ను, డిఎన్ఎస్ & విలువ ఆధారిత సేవలు అంటే సేవగా వెబ్ సైట్ (డబ్ల్యుఎఎఎస్)ను, సేవగా లెర్నింగ్ మేనేజ్‌మెంట్ (ఎల్ఎంఎఎఎస్)ను అందిస్తుంది. యూజర్లు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ తమ అవసరానికి అనుగుణంగా వారి కోసం అందుబాటులో ఉన్న వివిధ టెంప్లేట్లను ఎంపిక చేసుకొని, తమ స్వంత వెబ్ సైట్‌ను, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను సృష్టించుకోవచ్చు. ఒక్క క్లిక్ తోనే టెంప్లెట్‌ను తమ అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా మార్చుకొని తమ వెబ్‌సైట్‌ను, ఎల్ఎంఎస్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఈ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ - సోర్స్ (బహిరంగంగా లభించే) సాఫ్ట్‌వేర్ ను, ఎఐ/ ఎంఎల్ వంటి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించి అభివృద్ధి చేశారు.
అంతేకాకుండా, ఇర్నెట్ ఇండియా నూతన కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా ప్రారంభించి, అక్కడి అధికారులు, సిబ్బందితో ఎంఇఐటివై కార్యదర్శి ఎస్ కృష్ణన్ ముచ్చటించారు.
ఎర్నెట్ ఇండియా అన్నది ఎంఇఐటివై పరిధిలోని లాభం కోసం కాని శాస్త్రీయ సంస్థ. అది ఎసి. ఇన్, ఎడ్యు. ఇన్ & రెస్ . ఇన్ (ac.in’, ‘edu.in’ & ‘res.in) అన్న డొమైన పేరు కలిగిన అన్ని విద్య & పరిశోధన సంస్థలకు ప్రత్యేక డొమైన్ రిజిస్ట్రార్. ఇందుకు అదనంగా ఎర్నెట్ ఇండియా వెబ్ యాక్సిసబిలిటీ సేవను, క్యాంపస్ వైఫై సేవలను, స్మార్ట్ క్లాస్ రూంలను, భూసంబంధ & ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల ద్వారా దేశంలోని విద్యా సంస్థలకు & పరిశోధన సంస్థలకు అనుసంధానతను కల్పిస్తారు. ఇది డేటా సెంటర్ల ఏర్పాటు క్షేత్రంలో కూడా పని చేస్తుంది.
అవసరమైన వివరాల కోసం ఎర్నెట్ ఇండియా@ రిజిస్ట్రార్ @ ఎర్నెట్ .ఇన్ అన్న ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా కానీ 011-22170578 అన్న నెంబర్‌కు డయల్ చేయడం ద్వారా కానీ రిజిస్ట్రార్ శ్రీ నవీన్ చౌధరిని సంప్రదించవచ్చు.
***
(Release ID: 1993285)