శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్ లక్ష్య సాధన కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశానికి ప్రపంచంలో అగ్రస్థానం లభించేలా చూసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్న శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ

Posted On: 04 JAN 2024 4:28PM by PIB Hyderabad

మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్న కేంద్ర శాస్త్ర సాంకేతిక  శాఖ (డిఎస్‌టి) దేశాభివృద్ధిలో శాస్త్ర  సాంకేతిక రంగం కీలక పాత్ర పోషించేలా చూసేందుకు చర్యలు అమలు చేస్తోంది. 

శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్ర స్థానం సాధించినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవతరించడానికి అవకాశం కలుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ స్పష్టం చేశారు.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ సైంటిఫిక్ ఆఫీసర్ ఫోరమ్ ఏర్పాటు చేసిన  సమావేశంలో డిఎస్‌టి శాస్త్రవేత్తలతో  ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ వివిధ అంశాలపై  చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించేందుకు ప్రస్తుతం అమలు జరుగుతున్న అన్ని కార్యక్రమాల మధ్య ఏకీకరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. 

 ఇంక్యుబేషన్ సెంటర్‌ల ఏర్పాటు, ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్ వంటి అనేక కార్యక్రమాలతో పాటు; NM-ICPS, అంతర్జాతీయ ద్వైపాక్షిక కార్యక్రమ కేంద్రాలు,SERB లాంటి  అనేక కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు.  ఖచ్చితమైన వ్యవసాయం, స్వదేశీ బయోమెడికల్ పరికరాల తయారీ,  6G సెమీకండక్టర్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్, హైడ్రోజన్ ఎనర్జీ, ఆటోమొబైల్ రంగంలో  పరిశోధన వంటి  ప్రధాన కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నామని ప్రొఫెసర్ అభయ్ కరాండికర్  అన్నారు

పరిశ్రమ రంగం సహకారంతో  ఈ కార్యక్రమాలను ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ANRF ఏర్పాటుతో డిఎస్‌టి పాత్ర మరింత పెరుగుతుందన్నారు. జాతీయ ప్రాముఖ్యత కార్యక్రమాలు, విధానాలను అభివృద్ధి చేయడంపై డిఎస్‌టి దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు.  డిస్కవరీ సైన్స్కు ప్రాధాన్యత ఇచ్చి డిఎస్‌టి కార్యక్రమాలు ప్రారంభిస్తుందని ఆయన వివరించారు.  ఆర్థిక నియమ నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించి, కీలక రంగాలను గుర్తించడానికి  మేధోమథన సదస్సులు  నిర్వహించాలని  సూచించారు.

***


(Release ID: 1993265) Visitor Counter : 307
Read this release in: English , Urdu , Hindi , Bengali-TR